చైనాలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఓ పురుషుడికి(33) గత 20 ఏళ్లుగా రుతుక్రమం అవుతోంది. ఓ రోజు మూత్రంలో రక్తం, తీవ్రమైన కడుపునొప్పి రావడంతో అతడు ఆసుపత్రికి వెళ్లాడు. ఈ క్రమంలో చికిత్స అందించిన వైద్యులు అతడికి షాకింగ్ వార్త చెప్పారు. అతడికి గర్భాశయం ఉందని, అండాలు విడుదలవుతున్నట్లు తెలిపారు. జీవశాస్త్రపరంగా అతడు మహిళ అని నిర్ధారించారు. దీంతో ఒక్కసారిగా అతడు ఖంగుతిన్నాడు.
ఇక, గత 20 ఏళ్ల నుంచి అతడి మూత్రంలో రక్తం వస్తూనే ఉంది. అయితే,యుక్తవయస్సులో ఉన్నప్పుడు మూత్రవిసర్జన సమస్య ఉండడంతో ఆపరేషన్ చేయించుకున్నాడు. అప్పటి నుంచి అతడికి మూత్రంలో రక్తంతోపాటు సాధారణ పొత్తికడుపు నొప్పి వస్తున్నది. ఇటీవల కడుపునొప్పి నాలుగు గంటలకుపైగా కొనసాగడంతో డాక్టర్‌ను సంప్రదించాడు. డాక్టర్ అతడికి అపెండిసైటిస్ అని నిర్ధారించారు. అనతరం ఆపరేషన్ చేసినప్పటికీ కడుపు నొప్పి తగ్గలేదు.
దీంతో.. బాధితుడికి స్కానింగ్ తీయడంతో అసలు విషయం బహిర్గతమైంది. అతడికి గర్భాశయం, అండాశయాలతో సహా స్త్రీ పునరుత్పత్తి అవయవాలు ఉన్నాయని వైద్యులు గుర్తించారు. కాగా, ఆరోగ్యకరమైన వయోజన మహిళల్లో హార్మోన్లు ఎలా ఉంటాయో అలాగే ఉన్నట్లు కనుగొన్నారు. చివరకు రుతుక్రమం వల్లే ఇలా మూత్రంలో రక్తం వస్తుందని నిర్ధారించారు. అనంతరం తనకున్న స్త్రీ పునరుత్పత్తి అవయవాలను అతడు కోరడంతో గత నెలలో అతడికి శస్త్రచికిత్స చేశారు. అది విజయవంతం కావడంతో బాధితుడు సంతోషం వ్యక్తం చేశాడు.
Man’s urinary problem leads to intersex diagnosis, told he’s been menstruating @SCMPNews #Intersex #LGBTI #China🇨🇳 https://t.co/gaLA2pXn6C
— Chloë M. Smith PhD. (@ChloeMS) July 9, 2022
Comments
Please login to add a commentAdd a comment