బీజింగ్: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ తమ దేశంలోనే పుట్టిందన్న విమర్శలను చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి హువా చున్‌యింగ్ ఖండించారు. వాస్తవానికి ఈ వైరస్ గత ఏడాది ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రదేశాల్లో ప్రాణం పోసుకుందని స్పష్టం చేశారు.
అయితే, తమ దేశంలో బయటపడ్డ వైరస్ ఆనవాళ్ల గురించి ప్రపంచంలో ఇతర దేశాల కంటే ముందే తాము రికార్డు చేసి, బయటపెట్టామని అన్నారు. అందుకే కరోనా చైనాలో పుట్టిందన్న ప్రచారం మొదలైందని పేర్కొన్నారు. కరోనా ఎక్కడ మొదలైందనే విషయాన్ని తేల్చడానికి సమగ్రమైన దర్యాప్తు చేస్తామని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) ప్రకటించిన సంగతి తెలిసిందే. (హథ్రాస్: 60 మంది పోలీసులు.. 8 సీసీ కెమెరాలు)
Comments
Please login to add a commentAdd a comment