అమెరికన్లకు మస్క్ తాయిలం
పెన్సిల్వేనియా: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటింగ్‌ను ట్రంప్‌కు అనుకూలంగా మార్చేందుకు ప్రపంచ కుబేరుడు ఎలాన్‌మస్క్ తాయిలాలు ప్రకటిస్తున్నారు. వాక్ స్వాతంత్య్రం, తుపాకీ హక్కులపై తాము రూపొందించిన పిటిషన్‌పై సంతకాలు చేసే స్వింగ్ స్టేట్లలో రిజిస్టరయిన ప్రతి ఓటరుకు 47 డాలర్లు ఇస్తానని ట్రంప్ ఇప్పటికే ప్రకటించడం తెలిసిందే. తాజాగా ఆయన మరో ప్రతిపాదన తెరపైకి తెచ్చారు. పెన్సిల్వేనియాలో శనివారం నుంచి రిజిస్టర్డ్ ఓటర్ల నుంచి రోజూ డ్రా తీసి ఎంపికైన ఓటరుకు దాదాపు రూ.8.4 కోట్లు అందజేస్తామని చెప్పారు. నవంబర్ 5 ఈ లాటరీ కొనసాగుతుందన్నారు.
కమలా హారిస్, ట్రంప్ మధ్య పోటీ నువ్వా నేనా అన్నట్లు సాగుతుండటం తెలిసిందే. అమెరికా ఎన్నికల చట్టం ప్రకారం ఇలా తాయిలాలు ప్రకటించడం చట్టబద్ధమేనని స్లేట్ మేగజీన్ తెలిపింది. ఇది ట్రంప్‌కు ఓటేసే వారిని గుర్తించేందుకు జరిగే ప్రయత్నమే తప్ప, ఓటేయడానికి అభ్యరి్థకి నేరుగా డబ్బు చెల్లించడం కిందకు రాదని పేర్కొంది. ఇదే నిబంధనను అవకాశంగా తీసుకుని బెన్ అండ్ జెర్రీస్ సంస్థ 2008లో ఎన్నికల రోజున ఓటేసిన ప్రతి ఒక్కరికీ ఉచితంగా ఐస్‌క్రీం అందజేస్తామని ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment