US NSA: Modi & Biden have Productive, Very Practical Relationship
Sakshi News home page

ఒకేరకమైన ఆసక్తులు.. మోదీ, బైడెన్‌ ఇద్దరూ ఇద్దరే!

Published Fri, Nov 11 2022 10:34 AM | Last Updated on Fri, Nov 11 2022 11:13 AM

G20: These Are The Common Interests Between Modi And Biden - Sakshi

వాషింగ్టన్‌: భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌.. ఇద్దరూ ఇద్దరేనని అమెరికా  పొగడ్తలు గుప్పించింది. ఇండోనేషియా బాలిలో జరగబోయే జీ20 సదస్సులో.. మోదీ-బైడెన్‌లు ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో.. 

జాతీయ భద్రతా సలహాదారు జేక్‌ సల్లీవన్‌ గురువారం వైట్‌హౌజ్‌లో మీడియాతో మాట్లాడారు. భారత ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌.. ఇద్దరూ ఇద్దరే. క్లిష్టమైన సమస్యలను ఎదుర్కొవడంలో..  ఈ ఇద్దరూ ఒకేరకమైన ఆసక్తులు కనబరుస్తుంటారు. అంతేకాదు ఇరు దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేయడానికి కష్టపడుతుంటారు అని సల్లీవన్‌ తెలిపారు. 

మోదీ-బైడెన్‌లు ఉత్పాదక, ఆచరణాత్మక సంబంధం ఈ కలిగి ఉన్నారని ఆయన అన్నారు. జీ20 సదస్సు నేపథ్యంలో ఈ ఇద్దరి మధ్య భేటీ అందరి దృష్టి ఆకర్షించడం ఖాయమని అన్నారు. ఇదిలా ఉంటే.. వచ్చే ఏడాది జీ20 సదస్సుకు భారత్‌ ఆతిథ్యం ఇవ్వనున్న సంగతి తెలిసిందే.

ఇదీ చదవండి: ఎవరీ నబీలా సయ్యద్‌!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement