బీజింగ్: బద్ధ శత్రువులైన చైనా, పాకిస్తాన్ భారత్ ఒకే వేదికను పంచుకోనున్నాయి. భారత సైనికులతో కలిసి ఈ రెండు దేశాలు తమ బలగాలతో సైనిక విన్యాసాలలో పాల్గొనబోతున్నారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంపై ఈ మూడు దేశాలు త్వరలోనే ఈ విన్యాసాలను నిర్వహించనున్నాయి. షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీవో) కూటమిలో భాగంగా ఈ కార్యక్రమం జరగనుంది. 8 దేశాలతో కూడిన ఈ కూటమిలో భారత్, చైనా, పాకిస్తాన్ దేశాలకు సభ్యత్వం ఉంది. ‘పబ్బి- యాంటీ టెర్రర్-2021’ పేరిట ఈ విన్యాసాలు జరుగుతాయని ఎస్‌సీవో తెలిపింది. అయితే, సైనిక విన్యాసాలు ఎక్కడ నిర్వహిస్తారనే విషయంపై ఇంకా స్పష్టత లేదు.
మార్చి 18 న ఉజ్బెకిస్తాన్‌లోని తాష్కెంట్‌లో జరిగిన కౌన్సిల్ ఆఫ్ రీజినల్ టెర్రరిస్ట్ స్ట్రక్చర్ (రాట్స్) 36వ సమావేశంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. ఎస్‌సీవో అనేది ఒక ఆర్థిక, భద్రతాపరమైన కూటమి. దీనిలో 2017న భారత్, పాకిస్తాన్‌ను పూర్తి సభ్యులుగా చేర్చారు. దీని వ్యవస్థాపక సభ్యులలో చైనా, రష్యా, కజకిస్తాన్, కిర్గిజ్ రిపబ్లిక్, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్ ఉన్నాయి. రాట్స్ సంబంధిత ఎస్‌సీవో కౌన్సిల్ తదుపరి సమావేశం సెప్టెంబరులో ఉజ్బెకిస్తాన్‌లో జరగనుంది.
( చదవండి : పాక్‌లో మళ్లీ లాక్‌డౌన్.. )
బద్ధశత్రువులతో వేదికను పంచుకోనున్న భారత్
Published Mon, Mar 22 2021 9:53 AM | Last Updated on Mon, Mar 22 2021 11:13 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment