రష్యా,ఉక్రెయిన్‌ మధ్య శాంతికి భారత్‌ పాత్ర కీలకం: ఇటలీ పీఎం | Italy Pm Giorgia Meloni Meets Ukraine President | Sakshi
Sakshi News home page

రష్యా,ఉక్రెయిన్‌ మధ్య శాంతికి భారత్‌ పాత్ర కీలకం: ఇటలీ పీఎం

Published Sun, Sep 8 2024 9:59 AM | Last Updated on Sun, Sep 8 2024 12:51 PM

Italy Pm Giorgia Meloni Meets Ukraine President

రోమ్‌: రష్యా-ఉక్రెయిన్‌ల మధ్య రెండేళ్లుగా యుద్ధం జరుగుతోంది. ఈ యుద్ధంపై ఇటలీ ప్రధాని జార్జియా మెలోని తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యా- ఉక్రెయిన్‌ల మధ్య వివాదాన్ని పరిష్కరించడానికి భారత్‌, చైనా కీలక పాత్ర పోషిస్తాయని మెలోని అన్నారు. ఉక్రెయిన్‌ పునర్నిర్మాణానికి సంబంధించి ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌ స్కీ ఇటలీలో పర్యటించారు. 

ఈ పర్యటన సందర్భంగా జెలెన్‌స్కీ మెలోనితో సమావేశమయ్యారు. రష్యా, ఉక్రెయిన్‌ వివాద పరిష్కారానికి ఇటలీ మద్దతుటుందని మెలోని తెలిపారు. రష్యా- ఉక్రెయిన్‌ల మధ్య శాంతి నెలకొనేందుకు భారత్‌, చైనా, బ్రెజిల్‌ దేశాలు మధ్యవర్తిత్వం వహించగలవని రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ఇటీవలే వ్యాఖ్యానించడం గమనార్హం. 

ఇదీ చదవండి.. వాళ్లు సంక్షోభాన్ని పోగోట్టగలరు 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement