
టోక్యో:మహిళల పునరుత్పత్తి అవయవాలపై జపాన్ చట్ట సభ సభ్యుడు నవోకీ హ్యకుట చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఆయన వ్యాఖ్యలపై దేశంలో మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జపాన్‌లో ఎప్పటినుంచో పడిపోతున్న జననాల రేటుపై ఇటీవల హ్యకుట ఇటీవల స్పందించారు.
30 ఏళ్ల వయసు దాటిన తర్వాత మహిళల గర్భసంచి తొలగించడంతో పాటు 25 ఏళ్లు దాటిన తర్వాత పెళ్లిల్లు నిషేధించాలన్నారు. ఈ చర్యలు తీసుకుంటే దేశంలో జననాల రేటు పెరిగే అవకాశం ఉంటుందన్నారు. ఈ వ్యాఖ్యలపై రోజురోజుకు వివాదం పెరుగుతూ మహిళల ఆగ్రహావేశాలు చల్లారకపోవడంతో హ్యకుట స్పందించారు.
తన వ్యాఖ్యలు కేవలం ఊహాజనితం అ ని వివరణ ఇచ్చారు. అయినా ఆయనపై మహిళలు శాంతించడం లేదు. కాగా,నవలా రచయితగా ఉన్న హ్యకుట అనంతరం రాజకీయాల్లోకి ప్రవేశించి జపాన్ కన్జర్వేటివ్ పార్టీలో చేరి చట్టసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు.