కోరిన కోర్కెలు నెరవేర్చే దేవాలయాల గురించి మనం తరచూ వింటూనే ఉంటాం. ఇటువంటి దేవాలయాలకు జనం పోటెత్తడాన్ని కూడా చూసేవుంటాం. అయితే విడాకుల దేవాలయాన్ని ఎప్పుడూ చూసివుండం. ఇంతకీ ఈ దేవాలయం ఎక్కడ ఉంది? ఈ ఆలయానికి భక్తులు ఎందుకు వస్తారో ఇప్పుడు తెలుసుకుందాం.
600 ఏళ్లకుపైగా చరిత్ర కలిగిన మాస్తుగావోకా టోకీజీ ఆలయం జపాన్‌లో ఎంతో పేరొందిన దేవాలయం. ఈ ఆలయానికి ఘనమైన సంస్కృతి, ఆచార సంప్రదాయాలు కూడా ఉన్నాయి. ఈ ఆలయం సాధికారత, నవీనీకరణల సందేశాన్ని అందిస్తుంది. ఈ దేవాలయాన్ని డైవర్స్ టెంపుల్ అంటే విడాకుల దేవాలయం అని అంటారు.
ఈ పేరు ఎలా వచ్చిందంటే..
1285లో బౌద్ధ బిక్షువు కాకుసాన్ షిదో-నీ నిర్మించిన ఈ ఆలయం ప్రముఖ బౌద్ధ మందిరంగా విలసిల్లుతోంది. మొదట్లో ఈ ఆలయంలో నిస్సహాయులైన మహిళలకు ఆధ్యాత్మిక శిక్షణ అందించేవారు. ఆ రోజుల్లో మహిళల పరిస్థితి ఘోరంగా ఉండేది. వారికి సమాజంలో ఎటువంటి అధికారాలు ఉండేవికాదు. దీనికితోడు వారిపై పలు సామాజిక కట్టుబాట్లు విధించేవారు. అటువంటి పరిస్థితుల మధ్య మహిళలు గృహ హింసకు గురయ్యేవారు. దీంతో వారు ప్రశాంతత కోసం ఈ మందిరానికి వస్తుండేవారు.
ఆ రోజుల్లో పలు సామాజిక వర్గాలలో పెళ్లిళ్లి పెటాకులవుతుండేవి. విడాకుల వ్యవహారాలు కూడా విరివిగా జరిగేవి. ఇటువంటి సమయంలో ఒంటరి మహిళలు ఇక్కడికి వచ్చి ఆశ్రయం పొందుతుండేవారు. ఇటువంటి మహిళలకు ఇక్కడ విడాకుల ధృవపత్రాలను అందించేవారు. ఈ పత్రాలు ఒంటరి మహిళలకు స్వేచ్ఛగా ఉండే హక్కును ప్రసాదించేవి.
In Japan, visitors can write their divorce wishes & flush them down the toilet in the Mantokuji Temple. #movingon pic.twitter.com/ohwCsEz8FA
— BBL Divorce Finance (@BBLChurchill) July 23, 2014
టోకీజీ మందిరంలో ఒక సంగ్రహాలయం కూడా ఉంది. దీనిలో ఈ ఆలయానికి సంబంధించిన చరిత్రతో ముడిపడిన కళాకృతులు కొలువుదీరి ఉన్నాయి. నాటి మహిళల కష్టాలను కళ్లకు కట్టినట్లు చూపే పలు ఆనవాళ్లు ఇక్కడ కనిపిస్తాయి. దీనికి తోడు ఇది ఒక బౌద్ధమందిరంగానూ పేరొందింది. బౌద్ధ మతానికి సంబంధించిన ధార్మిక సమావేశాలు ఇక్కడ జరుగుతుండేవి. ఇప్పటికీ ఆలయంలోని బౌద్ధ బిక్షువులు, నన్‌లు ఇక్కడికి వచ్చేవారికి మార్గదర్శనం చేస్తుంటారు.
పచ్చని ప్రకృతి శోయగాల నడుమ ఉన్న ఈ ఆలయం ప్రశాంతతను ప్రసాదిస్తుందని చెబుతుంటారు. కలపతో రూపొందించిన అనేక కళా కృతులు ఈ ఆలయంలో కనిపిస్తాయి. ఆలయ ద్వారంవైపు ముందుకు సాగేవారికి రాతితో కూడిన రహదారి మార్గం స్వాగతం పలుకుతుంది. ఆలయంలోని పెద్ద హాలులో ధార్మిక సమావేశాలు, ధ్యాన కార్యక్రమాలు జరుగుతుంటాయి.
More Than Just a “Divorce Temple”http://t.co/izUFwFRXuT#Tokeiji #Japan pic.twitter.com/5rDwXus1r4
— IGNITION (@ignition_co) July 14, 2015
ఇది కూడా చదవండి: ఈ దీవుల్లో హాయిగా ఉండండి.. రూ. 70 లక్షలు అందుకోండి!
Comments
Please login to add a commentAdd a comment