
అమెరికా అధ్యక్షడు జో బైడెన్ మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ అమెరికాలో పూర్తిగా విఫలమయ్యారన్నారు. ఈ మేరకు ఇండోనేషియాలో బాలిలో జరుగుతున్న జీ20 శిఖరాగ్ర సదస్సుకు హాజరైన బైడెన్ బాలి నుంచి చేసిన ట్విట్‌లో ఈ వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ తాను 2024 ఎన్నికల బరిలోకి దిగుతున్నాను అని చెప్పిన నేపథ్యంలోనే బైడెన్ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.
ట్రంప్ అమెరికాలో అధ్యక్షుడి హోదాలో ఉండగానే పూర్తిగా విఫలమయ్యారు. అందుకు ఆనాడు ఎన్నికల్లో రిగ్గింగ్‌కి పాల్పడటం, హెల్త్‌కేర్‌ల పై దాడి చేయడం, ఉగ్రవాదులను అడ్డుకోవడం, మహిళల హక్కులపై దాడి చేయడం, హింసాత్మకంగా ప్రవర్తించడం, వైట్‌హౌస్‌పై దాడి తదితరాలన్ని నిదర్శనం అని చెప్పారు. అవే 2020 ఎన్నికల ఓటమికి కారణం అని నర్మగర్భంగా తేల్చి చెప్పారు బైడెన్ అన్నారు. ఆయన ఎలా వైఫల్యం చెందారో వివరిస్తూ ట్రంప్‌కి సంబంధించిన వీడియోని ట్విట్టర్‌లో షేర్ చేశారు.
Donald Trump failed America. pic.twitter.com/fylyocYcse
— Joe Biden (@JoeBiden) November 16, 2022
(చదవండి: నేను రెడీ.. అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో డొనాల్డ్ ట్రంప్.. అధికారిక ప్రకటన)
Comments
Please login to add a commentAdd a comment