ఇచ్చిపుచ్చుకోవటంలోనే అసలైన ఆనందం.. అందుకే వందేళ్లు బతికాం! | Longest Married Couple Celebrates 81st Wedding Anniversary UK | Sakshi
Sakshi News home page

ఊహించని దాంపత్యం: ఇచ్చిపుచ్చుకోవటంలోనే అసలైన ఆనందం.. అందుకే వందేళ్లు బతికాం!

Published Mon, Jan 17 2022 6:50 PM | Last Updated on Mon, Jan 17 2022 7:17 PM

Longest Married Couple Celebrates 81st Wedding Anniversary UK - Sakshi

మనిషి వందేళ్లు జీవిస్తే ఈరోజుల్లో అద్భుతమే! అలాంటిది జీవితాంతం తోడుంటానని చేయి పట్టుకుని నడిచిన తోడుతో సుదీర్ఘకాలం జీవిస్తే?!.. ఆ అన్యోన్య జంట ఆనందం మాటల్లో వర్ణించలేం! ఇటీవల వందేళ్ల వయసున్న ఒక జంట.. ఏకంగా 81వ వివాహ వార్షికోత్సవవేడుకను చేసుకుని వార్తల్లోకెక్కింది.  తద్వారా అరుదైన ఓ రికార్డు సృష్టించారు.


ఇంగ్లండ్‌కు చెందిన ఈ అరుదైన జంట ఫొటో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.  రాన్(102), జాయిస్ బాండ్(100).. ఎనిమిది దశాబ్దాలపాటు అన్యోన్యంగా గడిపారు. ఈ కాలంలో ఎన్నో పరిణామాలు జరిగాయి. ఇంగ్లండ్‌కు సుమారు 15 మంది ప్రధానమంత్రులు మారారు. కానీ, పాశ్చాత్య సంస్కృతిలో ఉన్నప్పటికీ.. వీళ్ల మనుసులు మాత్రం దూరం కాలేదు. తొలి చూపులోనే ప్రేమలో పడ్డ ఈ జంట.. 1941 నుంచి ‘ఆదర్శ జంట’గా నిలిచింది. అందుకు కారణాలు..

రాన్(21), జాయిస్ బాండ్(18) ఏళ్ల వయసులో న్యూపోర్ట్ పాగ్నెల్ రిజిస్ట్రీ ఆఫీస్‌లో వివాహం చేసుకున్నారు. వీరికి ఎలీన్‌, బిల్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. జాయిస్‌.. ఊల్వర్త్స్ రిటైల్‌ సూపర్‌ మార్కెట్‌లో మాజీ ఉద్యోగి. రాన్‌.. రెండో ప్రపంచ యుద్దం కంటే ముందు నుంచే స్థానికంగా ఉండే ఓ మోటర్‌సైకిల్‌ గ్యారేజీలో పనిచేసేవారు. 

రాన్‌ స్పందిస్తూ.. జీవితంలో కొన్నిసార్లు కష్టాలు వచ్చాయి. వాటిని మేమిద్దరం సమిష్టిగా ఎదుర్కొన్నాం. ఒకరికొకరం ఎల్లప్పుడూ మద్దతుగా నిలిచాం’ అని తెలిపారు. జాయిస్ బాండ్ స్పందిస్తూ.. ‘మేము 81వ వివాహవార్షికోత్సం జరుపుకుంటామని అసలు ఊహించలేదు. చాలా అదృష్టంగా భావిస్తున్నాం’ అని చెప్పారు. తమ వివాహబంధంలో బాస్‌ ఎవరు లేరని, తాము ఎప్పుడూ ఒకరినొకరం గౌరవించుకునేవాళ్లమని తెలిపారు.

తాము ఇద్దరం ఇంత ఆరోగ్యంగా, అన్యోన్యంగా ఉండటానికి ఒక్కటే సీక్రెట్‌ ఉందని.. ‘ఏదైనా ప్రేమగా ఇచ్చిపుచ్చుకునే వాళ్లం’ అని తెలిపారు. వారి కూతురు ఎలీన్‌ మాట్లాడుతూ.. ‘నా తల్లిదండ్రులు 81వ వివాహ వార్షికోత్సం జరుపుకుంటున్నారని చెబితే ఎవరూ నమ్మలేదు. నా తల్లిదండ్రులు నిజంగా స్ఫూర్తిదాయకమైన వ్యక్తులు, నాకు, సోదరుడికి మాత్రమే కాదు. వారు.. మా పిల్లలు, వాళ్ల పిల్లలకు కూడా ఎప్పుడూ ప్రేరణ కలిగించేవారే’ అని చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement