
కోడిపుంజు దాడి చేయడంతో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన ఐర్లాండ్‌లో చోటు చేసుకుంది. జాస్పర్ క్రాస్ తన ఇంట్లో పెంచుకుంటున్న కోడిపుంజు దాడిలో తీవ్రంగా గాయపడి మరణించాడు. వినడానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ ఈ కేసుకు సంబంధించిన షాకింగ్ నిజాలు ఇటీవలే వెల్లడయ్యాయి. అసలేం జరిగిందంటే.. గత ఏప్రిల్‌లో తన ఇంట్లో పెంచుకుంటున్న కోడిపుంజు దాడి చేయడంతో జాస్పర్‌కు గాయపడ్డాడు. దీంతో అతనికి తీవ్రంగా రక్తస్రావం అయ్యింది.
అదే సమయంలో అతనికి గుండెపోటు రావడంతో మృతి చెందాడు. ఈ కేసుకు సంబంధించిన విచారణలో జాస్పర్ తన పెంపుడు కోడి దాడి చేయడం వల్ల చనిపోయినట్లు బయటపడింది. ఈ ఘటన జరిగినప్పుడు అదే ప్రాంతంలో నివసించే గార్డా ఇయోన్ బ్రౌన్ కోర్టులో తెలిపిన సమాచారం ప్రకారం.. దాడి గురించి తెలుసుకున్న తర్వాత తాను క్రాస్ ఇంటికి వెళ్లినట్లు తెలిపాడు. ఆ సమయంలో క్రాస్ వంట గదిలో రక్తపు మడుగులో నేలపై పడి ఉన్నట్లు పేర్కొన్నాడు. అతని కాలు వెనుక భాగంలో గాయం కూడా కనిపించిందన్నాడు. క్రాస్ పడి ఉన్న చోటు చుట్టు రక్తపు మరకలు ఉన్నట్లు చెప్పాడు. అతన్ని బతికించేందుకు తాను తీవ్రంగా ప్రయత్నించాడని చివరికి అది కూడా విఫలమైందని తెలిపాడు. కాగా ఆ కోడిపుంజు గతంలో తనపై కూడా దాడి చేసినట్లు క్రాస్ కూతురు పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment