తల్లి సారా బీమ్
హూస్టన్: వ్యాక్సిన్స్‌లు వచ్చినా ఇప్పటికీ కరోనా జనాలను ఎంత భయపెట్టిస్తోందో చెప్పే ఘటన ఇది. అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలోని హ్యారిస్ కౌంటీలో ఒక తల్లి కోవిడ్ సోకిందనే భయంతో కుమారుడిని డిక్కీలో పడుకోబెట్టి టెస్టింగ్ కేంద్రానికి తీసుకెళ్లింది. స్కూలు టీచరైన సారా బీమ్ (41 ఏళ్లు) హ్యారిస్ కౌంటీలోని టెస్టింగ్ కేంద్రానికి వెళ్లి తన 13 ఏళ్ల కుమారుడికి కరోనా పరీక్ష చేయాలని కోరింది.
తన కుమారుడు డిక్కీలో ఉన్నాడని అక్కడి వైద్య సిబ్బందికి చెప్పింది.. డిక్కీని తెరిచి చూపించింది. నివ్వెరపోయిన వారు డిక్కీలో నుంచి మొదట బాలుడిని బయటకు తీయాలని కోరగా.. ఆమె అందుకు నిరాకరించి కారును వేగంగా అక్కడి నుంచి పోనిచ్చింది.
దాంతో అప్రమత్తమైన వైద్య సిబ్బంది స్థానిక పోలీసులకు సమాచారమిచ్చారు. సీసీటీవీ ఫుటేజీ పరిశీలించిన పోలీసులు హ్యారిస్ కౌంటీ జిల్లా కోర్టు దృష్టికి విషయాన్ని తీసుకెళ్లగా.. జడ్జి బుధవారం సారా బీమ్‌కు అరెస్టు వారెంటు జారీచేశారు.
(చదవండి: పాక్‌లో ఘోరం.. మంచు కింద 22 మంది సజీవ సమాధి)
Comments
Please login to add a commentAdd a comment