ఇస్లామాబాద్: మంకీ పాక్స్ వ్యాధి ఇప్పటికే ఆఫ్రికా దేశాల్లో వేగంగా వ్యాప్తిచెందుతోంది. దీంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) ప్రపంచ ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటించింది. తాజాగా పాకిస్థాన్‌లో ముగ్గురు వ్యక్తులకు మంకీ పాక్స్ సోకినట్లు ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
పాకిస్థాన్‌కు చెందిన ముగ్గురు వ్యక్తులు ఆగస్టు 3న సౌదీ అరేబియా నుంచి వచ్చారు. వారికి ఆరోగ్య సమస్యలు రావడంతో వైద్య పరీక్షలు చేయించుకోగా మంకీ పాక్స్ ఉన్నట్లు తేలింది. వారికి మంకీపాక్స్ ఉన్నట్లు ఆగస్ట్ 13న పెషావర్‌లోని ఖైబర్ మెడికల్ యూనివర్సిటీ వెల్లడించింది.
కాగా ఆ ముగ్గురితో విమానంలో ప్రయాణించిన వారిని, సన్నిహితులను గుర్తించి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఆరోగ్యశాఖ తెలిపింది. 2023లో కరాచీలోని జిన్నా అంతర్జాతీయ విమానాశ్రయంలో ముగ్గురు ప్రయాణికులకు మంకీపాక్స్ ఉన్నట్లు నిర్ధారణ అవడంతో వారికి అత్యవసర వైద్యసేవలు అందించారు. అప్పట్లో దేశంలో మొత్తం 11 మంకీపాక్స్ కేసులు నమోదవగా ఒకరు మరణించారు.
Comments
Please login to add a commentAdd a comment