కారకాస్: ఆశ్చర్యపరిచే సంఘటన... ప్రస్తుతం బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతూ సామాన్యుడికి అందనంత దూరంలో ఉంది. కానీ ఈ దేశంలో మాత్రం బంగారం నెలకు దిగొచ్చి సామన్యుడి చేతికందొచ్చింది. భారీ స్థాయిలో బంగారం సముద్రపు అలలతో ఒడ్డుకు కొట్టుకొచ్చింది. నమ్మశక్యం కానీ ఈ సంఘటన వెనిజులాలో చోటుచేసుకుంది. ఆదివారం గ్వాకలోని సముద్ర తీరానికి బంగారు, వెండి ఆభరణాలు వేల సంఖ్యలో కొట్టుకొచ్చాయట. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దాదాపు 2 వేలకు పైగా మత్స్యాకార కుటుంబాలు ఈ బీచ్ వద్ద నివసిస్తుంటాయి. ఈ క్రమంలో ఓ మత్స్యకారుడు చేపల వేట కోసం ఉదయాన్నే తీరానికి రాగా అతడికి ఒడ్డున ఇసుకలో మెరుస్తున్న వస్తువు కనిపించింది. అదేంటని చేతిలోకి తీసుకుని చూడగా అది బంగారు ఆభరణం. (చదవండి: వైరల్: కూతురి వేళ్లు కొరుక్కుతిన్న తల్లి!)
దాంతో ఆశ్చర్యపోయిన ఆ మత్స్యకారుడు బంగారం దొరికిందోచ్..! అంటూ గట్టిగా కేకలు వేశాడు. అతడి కేకలు విన్న మిగతా గ్రామస్తులు, మత్స్యకారులు వచ్చి చూసేసరికి బీచ్ ఒడ్డున ఇసుకల్లో బంగారం, వెండి ఆభరణాలు కనిపించాయి. అనంతరం గ్రామస్తులు బీచ్ మొత్తం జల్లెడ పట్టడం ప్రారంభించారు. బంగారు ఆభరణాలు దొరకడంతో గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తూ.. ఇలాంటి సంఘటన ఎప్పుడు జరగలేదని, ఇదే మొదటిసారని చెప్పారు. ఈ బంగారం ఒడ్డుకు ఎలా వచ్చిందో, అసలు సముద్రంలోకి ఎలా చేరాయో ఇప్పటికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని చెప్పుకొచ్చారు. ఈ విషయం తెలిసిన వెనిజులా నిపుణులు ఒడ్డుకు బంగారు ఆభరణాలకు ఎలా కొట్టుకువచ్చాయని శోధించే పనిలో పడ్డారట. (చదవండి: పాకిస్తాన్: ‘అందుకే విగ్రహం ధ్వంసం చేశా’)
Comments
Please login to add a commentAdd a comment