Sea coast
-
బీచ్‌కు పోదాం.. పదా.. పదా
జలకాలాటలలో గలగల పాటలలో ఏమి హాయిలే అలా.. అనుకుంటూ బీచ్‌లో అలలపై తేలియాడుతుంటే భలే ఉంటుంది కదూ! సూర్యోదయ, సూర్యాస్తమయ సమయాల్లో ఆ అంబుధి చెంత నిలబడి.. భానుడి వర్ణాలను చూస్తుంటే కళ్లు తిప్పుకోలేం కదూ! కడలి అందాలకు, మనలోని భావోద్వేగానికి తరతరాల అనుబంధం అది. సముద్రానికి, భారతీయ సంప్రదాయాలకు కూడా అవినాభావ సంబంధం ఉంది. సముద్ర స్నానం వల్ల మానసిక ఆనందంతో పాటు ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఎన్నో ఉన్నాయని పలు అధ్యయనాలు పేర్కొంటున్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్‌కు ఉన్న అపార వనరుల్లో సుదీర్ఘ సముద్ర తీరం ఒకటి. ఇక్కడి మన బీచ్‌లు ఎంతో ప్రఖ్యాతి పొందాయి. రుషికొండ బీచ్ ప్రపంచ గుర్తింపు సాధిస్తూ బ్లూఫ్లాగ్‌ను కూడా సొంతం చేసుకుంది. – శ్రీపాద బాలసుబ్రహ్మణ్యం, ఏపీ సెంట్రల్ డెస్క్ జోరుగా.. హుషారుగా.. అద్భుతమైన, 975 కిలోమీటర్ల పొడవైన తీర ప్రాంతం ఆంధ్రప్రదేశ్ సొంతం. ఇక్కడ ఎన్నో అందమైన బీచ్‌లు ఉన్నాయి. వీకెండ్ వచ్చిందంటే చాలు జనాలతో ఆ బీచ్‌లు పోటెత్తుతున్నాయి. సూర్యలంక, మైపాడు, పేరుపాలెం, మంగినపూడి తదితర బీచ్‌లకు ఆదివారాల్లో 50 వేల మందికి పైగా వచ్చి సెలవు రోజును ఎంజాయ్ చేస్తున్నారు. విశాఖ, కాకినాడ లాంటి నగరాల బీచ్‌లకు పర్యాటకుల సందడి చెప్పనక్కర్లేదు. రోజు రోజుకు పెరుగుతున్న బీచ్ పర్యాటకంతో స్థానిక ప్రజలు ఉపాధి పొందుతున్నారు. దీనికి తగ్గట్లే ప్రభుత్వం కూడా బీచ్‌ల అభివృద్ధికి నిధులు కేటాయిస్తోంది. రిసార్ట్స్ నిర్మిస్తూ.. రోడ్లు వేస్తూ ఈ పర్యాటకాన్ని ప్రోత్సహిస్తోంది. ఆరోగ్య రహస్యాలు ఎన్నో.. సముద్రం నీటిలో సూక్ష్మపోషకాలు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఆ నీరులో ఉండే మెగ్నిషియం, సోడియం, కాల్షియం, క్లోరైడ్, సల్ఫేట్ వంటి సూక్ష్మధాతువులు చర్మానికి సహజ సౌందర్యాన్ని ఇస్తాయి. సొరియాసిస్, ఎగ్జిమా వంటి చర్మవ్యాధులతో బాధ పడేవారికి ఈ ఉప్పునీరు ఎంతో ఉపశమనం కలిగిస్తుంది. సముద్రనీటిలో ఉండే మెగ్నిషియంమన శరీరంలోని కార్టిసోల్ స్థాయిలను తగ్గిస్తుంది. అలాగే నాడీవ్యవస్థను కంట్రోల్ చేసి మనలోని మానసిక ఒత్తిడిని నియంత్రిస్తుంది. ♦ ఉప్పునీటి స్నానం శరీరంలోని యాంటీఆక్సిడెంట్స్ ప్రక్రియ సక్రమంగా ఉండేలా నియంత్రిస్తుంది. గుండె జబ్బులు, క్యాన్సర్ల ముప్పును తగ్గించేందుకు సహకరిస్తుంది. సీ వాటర్‌లో మెగ్నిషియం ఎక్కువగా ఉండటం వల్ల మజిల్స్ రిలాక్స్ అయ్యి.. మంచి నిద్ర పడుతుంది. ♦ ట్రేస్ఎలిమెంట్స్, సూక్ష్మజీవులతో పాటు యాంటీబ్యాక్టీరియల్‌గా ఉండేవి సముద్రంలో చాలా ఉంటాయి. వీటిని చర్మం గ్రహించడం ద్వారా సహజ యాంటీబయాటిక్స్‌లా ఉపయోగపడతాయి. ♦ సముద్రంలోని ఉప్పునీరు సైనస్ ఇబ్బందులను తొలగిస్తుంది. సహజ సెలైన్ సొల్యూషన్‌గా పనిచేసి సైనస్లో పేరుకున్న మ్యూకస్‌ను క్లియర్ చేస్తుంది. ♦ రెగ్యులర్‌గా సముద్ర స్నానం చేస్తూ ఈత కొట్టడం వల్ల సహజంగా బరువు తగ్గుతారని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. బ్లూఫ్లాగ్ కోసం.. పరిశుభ్రమైన బీచ్‌లకు బ్లూఫ్లాగ్ సర్టిఫికెట్ లభిస్తుంది. ఈ గుర్తింపును ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ (ఎఫ్ఈఈ) అనే అంతర్జాతీయ సంస్థ ఇస్తుంది. 77 దేశాల్లో ఈ సంస్థ కార్యక్రమాలు ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షించేలా బ్లూఫ్లాగ్ గుర్తింపు రావాలంటే.. ఆబీచ్ పరిసరాలు పరిశుభ్రంగా, పర్యావరణ హితంగా ఉండాలి. 33 అంశాల్లో బీచ్‌ను అభివృద్ధి చేస్తే దానికి బ్లూఫ్లాగ్ వస్తుంది. మొత్తం 50 దేశాల్లో 4,831 బీచ్‌లకు ఈ సర్టిఫికెట్ లభించింది. మన దేశంలో 12 బీచ్‌లకు ఆ సర్టిఫికేషన్ లభించగా.. మన రాష్ట్రంలో రుషికొండ (విశాఖ) బీచ్ ఈ ఘనత సాధించింది. మరిన్ని బీచ్‌లకు కూడా బ్లూఫ్లాగ్ సాధించాలని రాష్ట్ర పర్యాటక శాఖ కృతనిశ్చయంతో ఉంది. మైపాడు బీచ్‌కు తరచూ వెళ్తాం నేను ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాను. చిన్నప్పటి నుంచి బీచ్‌లకు వెళ్లడం, అక్కడ స్నానం చేయడం అంటే ఎంటో ఇష్టం. సెలవు రోజుల్లో నెల్లూరు జిల్లాలోని మైపాడు బీచ్‌కు ఫ్యామిలీతో పాటు వెళ్తుంటాను. మా పిల్లలు బీచ్‌లో స్నానాన్ని ఎంతో ఎంజాయ్ చేస్తారు. తగిన జాగ్రత్తలతో వారితో పాటు నేను కూడా ఇక్కడ స్నానం చేస్తాను. పని ఒత్తిడితో ఇక్కడికి వస్తే చాలా రిలాక్సింగ్ అనిపిస్తుంది. సముద్ర స్నానం చేస్తే మంచిదని మా పెద్దలు కూడా చెబుతుండేవారు. – కేఎన్వీ కుమార్, తిరుపతి మూడ్ మారుతుంది ♦ మానసిక ఆరోగ్యానికి బీచ్‌ల సందర్శనం ఎంతో ఉపయోగపడుతుందని స్విమ్ ఇంగ్లాండ్ సంస్థ అధ్యయనం చెబుతోంది. సముద్రంలో ఈత కొట్టడం వల్ల ఫీల్ గుడ్ మాలిక్యూల్స్ పిలిచే బీటా ఎండార్ఫిన్స్ శరీరంలో పెరుగుతాయని, రెగ్యులర్‌గా ఈతకొట్టే వాళ్లు అతి తక్కువ సార్లు మానసిక వైద్యుల్ని సంప్రదిస్తున్నారని ఆ సంస్థ నివేదికలు పేర్కొంటున్నాయి. హైడ్రోథెరపీగా కూడా బీచ్బాత్ ఉపయోగపడుతుందని చెబుతున్నారు. ♦సముద్రంపై నుంచి వచ్చే గాలి ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. బీచ్ వద్దకు వెళితే హ్యాపీ హార్మోన్‌గా పిలిచే సెరిటోనిన్ మన శరీరంలో పెరిగి, మనం రిలాక్స్ అవుతామని, సముద్ర హోరు, ఆ అనంత జలరాశి దృశ్యం మన మూడ్‌ను మారుస్తుందని ఆ అధ్యయనాలు పేర్కొన్నాయి. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ♦మద్యం సేవించి సముద్రంలో స్నానం చేయకూడదు ♦తీవ్రమైన గాయాలు ఉన్నపుడు బీచ్‌లో స్నానం చేయకుండా ఉంటేనే మంచిది. ♦ఈతలో నైపుణ్యం ఉంటే తప్ప తీరంనుంచి దూరంగా లోపలికి వెళ్లకూడదు. ♦సముద్రంలో పెద్ద రాళ్లు ఉంటే జాగ్రత్తగా ఉండాలి. అలల తాకిడికి తల రాళ్లకు కొట్టుకునే ప్రమాదం ఉంటుంది. అలాంటి ప్రాంతాల్లో తలకిందులుగా డైవ్ చేయడం కూడా ప్రమాదం. ♦అలలు ఎక్కువగా ఉన్నపుడు జాగ్రత్త వహించాలి. బలమైన అలల మధ్య ఇరుకైన ప్రవాహాన్ని రిప్ కరెంట్ అంటారు. ఇవి మనిíÙని ఒక్కసారిగా లోతైన ప్రవాహంలోకి లాగేస్తాయి. ♦ఉరుములు, మెరుపులు ఉన్న సమయంలో సముద్రంలో ఉండటం ప్రమాదం. వెంటనే సురక్షిత ప్రదేశానికి వెళ్లిపోవాలి. ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమైన బీచ్‌లు ♦రామకృష్ణ బీచ్, రుషికొండ, భీమిలి (విశాఖ) ♦మంగినపూడి (కృష్ణా జిల్లా) ♦పేరుపాలెం (పశ్చిమ గోదావరి) ♦ అంతర్వేది (అంబేడ్కర్ కోనసీమ జిల్లా) ♦ కాకినాడ (కాకినాడ జిల్లా) ♦ మైపాడు (నెల్లూరు జిల్లా) ♦ సూర్యలంక, రామాపురం (బాపట్ల జిల్లా) ♦ కళింగపట్నం, భావనపాడు (శ్రీకాకుళం జిల్లా) -
తీరంలో కరెంట్ తీగలుండవ్.!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం నుంచి నెల్లూరు జిల్లా తడ వరకు 972 కిలోమీటర్ల పొడవున సముద్ర తీరం ఉంది. తుపానులు వచ్చినప్పుడు ఈ తీరం వెంబడి ఉన్న గ్రామాల్లో ఎక్కువగా నష్టపోయేది విద్యుత్ వ్యవస్థ. నేలకొరిగిన విద్యుత్ స్తంభాలు, తెగిన వైర్లను యధాస్థితికి తెచ్చేందుకు వారాలు పడుతుంది. అంత వరకు ఆ ప్రాంతాల ప్రజలు చీకటిలోనే గడపాలి. ఆ సమయంలో పాములు వంటి విషకీటకాల బారిన పడి జనం ప్రాణాలు కోల్పోయిన ఘటనలు కూడా ఉన్నాయి. ఈ బాధల నుంచి విముక్తి కలిగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక రూపొందించిందని ఆంధ్రప్రదేశ్ మధ్య ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీసీపీడీసీఎల్) సీఎండీ జె.పద్మాజనార్దన రెడ్డి తెలిపారు. విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)ల ద్వారా తీరం వెంబడి భూగర్భ విద్యుత్ లైన్లు ఏర్పాటు చేస్తున్నట్లు ‘సాక్షి ప్రతినిధి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో చెప్పారు. భూగర్భ లైన్లు సాధారణంగా దెబ్బతినవని, విద్యుత్ పునరుద్ధరణ కూడా వేగంగా జరుగుతుందని వివరించారు. జాతీయ రోజువారీ విద్యుత్ సరఫరా సగటులో రాష్ట్రం మొదటి స్థానంలో ఉందని, 24 గంటల్లో 23.56 గంటలకు తగ్గకుండా విద్యుత్ అందిస్తున్నామని తెలిపారు. రాష్ట్ర విద్యుత్ రంగంలో విప్లవాత్మక మార్పులు, అభివృద్ధిపై ఆయన అందించిన వివరాలు ఆయన మాటల్లోనే.. తీర ప్రాంతంలో ప్రత్యేక గ్రిడ్ తుపాన్లు, గాలుల వల్ల విద్యుత్ వ్యవస్థకు కలిగే నష్టాన్ని తగ్గించడానికి తీర ప్రాంతంలో గ్రిడ్‌కు రూపకల్పన చేస్తున్నాం. అంటే దగ్గర్లో ఉన్న 132 కేవీ సబ్స్టేషన్లను డబుల్ సర్క్యూట్ ద్వారా అనుసంధానం చేస్తాం. దీనినే రింగ్ మెయిన్ అంటారు. దీనివల్ల ఒక సబ్ స్టేషన్ దెబ్బతింటే మరో సబ్ స్టేషన్ నుంచి సంబంధిత ప్రాంతాలకు వెంటనే విద్యుత్ అందించొచ్చు. రైతులకు ఉచితంగా స్మార్ట్ మీటర్లు, రక్షణ పరికరాలు వ్యవసాయ పంపుసెట్లకు స్మార్ట్ మీటర్లతో పాటు రక్షణ పరికరాలు కూడా ఉచితంగా అందజేస్తాం. డిసెంబర్ నాటికి ఈ ప్రక్రియ పూర్తి చేయాలనుకుంటున్నాం. ఖర్చుంతా ప్రభుత్వమే భరిస్తుంది. రైతులు ఒక్క పైసా కూడా చెల్లించనవసరం లేదు. ఈ మీటర్లకు విదేశాల్లో స్థిరపడ్డవారు కొందరు మినహా మిగతా రైతులంతా రాతపూర్వకంగా అంగీకారం తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు వ్యవసాయానికి విద్యుత్ సరఫరాలో ఎలాంటి అవాంతరాలు లేకుండా చూస్తున్నాం. గతంలో వ్యవసాయానికి రాత్రి వేళ విద్యుత్ సరఫరా వల్ల పొలాల్లో రైతులు ఎక్కువగా ప్రమాదాల బారిన పడేవారు. దీనిని నివారించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు పగటి పూటే 9 గంటలు నిరంతర విద్యుత్ అందిస్తోంది. పైగా, స్మార్ట్ మీటర్లు, రక్షణ పరికరాల ఏర్పాటు వల్ల రైతులకు ఎటువంటి ప్రమాదాలు జరగవు. ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సూచనల మేరకు కొత్త వ్యవసాయ సర్వీసులను దరఖాస్తు చేసిన నెల లోపే ఇస్తున్నాం. ఇప్పటివరకు 80 వేల కొత్త సర్వీసులు ఇచ్చాం. ప్రజల చేతిలో బిల్లు నియంత్రణ విద్యుత్ బిల్లుల విషయంలో విద్యుత్ శాఖ పొరపాట్లు లేవు. విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) అనుమతించిన టారిఫ్ ప్రకారమే చార్జీలు ఉన్నాయి. ప్రజలు విద్యుత్ ఎక్కువగా వాడుతున్నారు. ఈ వేసవిలో గతంలో ఎన్నడూ లేనంతగా రాష్ట్రవ్యాప్తంగా రోజుకి 263 మిలియన్ యూనిట్లు సరఫరా చేశాం. ప్రజలు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే విద్యుత్ బిల్లు తగ్గించొచ్చు. కెపాసిటర్లు, బ్రేకర్లు నాణ్యమైనవి అమర్చుకోవాలి. ఇంటి లోపల, బయట వాడే బ్రేకర్లు వేర్వేరుగా ఉంటాయి. మాగ్నెటిక్ బ్రేకర్లు వేగంగా, ఖచ్చితత్వంతో పనిచేస్తాయి. ప్రీపెయిడ్ మీటర్లతో ఎవరికి వారు బిల్లును నియంత్రించుకోవచ్చు. అవసరాన్నిబట్టి రీచార్జ్ చేసుకోవచ్చు. వారం వారం విద్యుత్ వినియోగం తెలుసుకోవచ్చు. ముందుగా ప్రభుత్వ, హెచ్‌టీ సర్వీసులకు ప్రీపెయిడ్ మీటర్లు అందిస్తాం. సరికొత్త సబ్స్టేషన్లు విద్యుత్ సబ్ స్టేషన్లకు స్థలాలు దొరకడంలేదు. దీంతో కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో కంటైనర్ సబ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పటికే రెండింటిని అందుబాటులోకి తెచ్చాం. మరో రెండు విజయవాడలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ భారీ విగ్రహాన్ని పెడుతున్న పీడబ్ల్యూడీ గ్రౌండ్స్‌లో, కనకదుర్గ గుడి దగ్గర ఏర్పాటు చేస్తున్నాం. వీటిని ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు. పవర్ ట్రాన్స్ఫార్మర్లు (పీటీఆర్)లు ఒక్కటి కూడా పాడవకుండా, ఒక్క రోజు కూడా లోడ్ రిలీఫ్ ఇవ్వకుండా ఈ వేసవిని సమర్ధంగా ఎదుర్కొన్నాం. 30 ఏళ్లు పైబడిన లైన్లు, కండక్టర్లు, బ్రేకర్లను మారుస్తున్నాం. దీనివల్ల సాంకేతిక నష్టాలు తగ్గుతాయి. -
సాగర తీరంలో కయాకింగ్ క్వీన్
ఆ యువతి పడవ నడపగలదు.. ఒడుపుగా లంగరు సైతం వేయగలదు. తండ్రినే గురువుగా భావించి.. సాగర సంగమ తీరాన్నే శిక్షణ కేంద్రంగా ఎంచుకుని ‘కయాకింగ్ అండ్ కనోయింగ్’ క్రీడలో రాణిస్తోంది. ఇప్పటికే జాతీయ స్థాయిలో పతకాలు సాధించిన ఆ యువతి ప్రపంచ ఒలింపిక్స్‌లో రాణించి భారత్ తరఫున పతకం అందుకోవాలని తహతహలాడుతోంది. నాగాయలంక (అవనిగడ్డ): కృష్ణా జిల్లా నాగాయలంక సాగర సంగమ తీరానికి చెందిన నాగిడి గాయత్రి గ్రామీణులకు పెద్దగా పరిచయం లేని ‘కయాకింగ్ అండ్ కనోయింగ్’ జలక్రీడలో రాణిస్తోంది. ఏడేళ్ల వయసులోనే తండ్రి వెంట నది బాటపట్టిన గాయత్రి చేపల వేట నేర్చుకుంది. జల క్రీడల్లో రాణించాలనే ఆ చిన్నారి తపనను గమనించి తండ్రి నాగబాబు కృష్ణా నదిలో ఈత నేర్పించారు. స్థానిక జెడ్పీ హైస్కూల్లో పదో తరగతి చదివిన గాయత్రి కరాటేలో ప్రత్యేక శిక్షణ తీసుకుంది. విజయనగరం జిల్లా గరివిడి వెటర్నరీ పాలిటెక్నిక్ కళాశాలలో డిప్లొమా చేసింది. నాటు పడవతోనే నదిలో సాధన చేసి గత ఏడాది గుజరాత్లో జరిగిన 36వ జాతీయస్థాయి కయాకింగ్ అండ్ కెనోయింగ్ పోటీల్లో నాలుగో స్థానంలో నిలిచింది. జాతీయ స్థాయిలో రజత పతకం 18 సంవత్సరాల నాగిడి గాయత్రి కరాటే, రోయింగ్, కయాకింగ్ అండ్ కనోయింగ్ పోటీల్లో పలు పతకాలు సాధించింది. 2017లో ఢిల్లీలో జరిగిన 33వ నేషనల్ తైక్వాండో పోటీల్లో కాంస్య పతకం పొందింది. 2021లో రాష్ట్రస్థాయి రోయింగ్ పోటీల్లో బంగారు పతకం కైవశం చేసుకుంది. గత ఏడాది అక్టోబర్‌లో గుజరాత్లో జరిగిన జాతీయస్థాయి వాటర్ స్పోర్ట్స్ పోటీల్లో నాలుగో స్ధానంలో నిలవగా.. ఈ ఏడాది ఫిబ్రవరి 11న భోపాల్‌లో జరిగిన 5వ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ కయాకింగ్ అండ్ కెనోయింగ్ విభాగంలో జాతీయ స్థాయిలో రజత పతకం కైవశం చేసుకుంది. ఈ ఏడాది అక్టోబర్‌లో గోవాలో జరిగే 37వ జాతీయస్థాయి వాటర్ స్పోర్ట్స్ పోటీలకు గాయత్రి అర్హత సాధించింది. దాతల సహాయం, మెరుగైన శిక్షణ అందిస్తే ప్రపంచ ఒలింపిక్ పోటీల్లో పతకం సాధిస్తానని గాయత్రి ధీమా వ్యక్తం చేస్తోంది. చేపల వేటలో సాయపడుతూ.. తండ్రి నాగిడి నాగబాబుకు చేపల వేటలో గాయత్రి సహాయపడుతోంది. తండ్రితో పాటు రాత్రివేళలో బోటుపై సాగర సంగమ ప్రాంతానికి వెళ్లి వల, గాలం ద్వారా చేపల వేట సాగిస్తోంది. పురుషులకు దీటుగా పడవ నడుపుతూ.. లంగరు కూడా వేస్తోంది. చేపల వేటలో తలపండిన మత్స్యకారులు చేయలేని పనులను సైతం గాయత్రి సునాయాసంగా చేస్తుంది. గాలానికి రొయ్య గుచ్చడంలో గాయత్రి దిట్ట. ఒడుపుగా గుచ్చకపోతే రొయ్య ముళ్ళు చేతిలో దిగి తీవ్రంగా బాధిస్తుంది. నాగాయలంకలో 40 చేపల వేట బోట్లు ఉండగా.. వీటిపై ముగ్గురు మాత్రమే గాలానికి ఒడుపుగా రొయ్య గుచ్చేవారు ఉంటే.. అందులో గాయత్రి ఒకరు కావడం విశేషం. నాగిడి నాగబాబు పెద్ద కుమార్తె గౌతమి స్మిమ్మింగ్‌లో, కుమారుడు రాజేష్ తైక్వాండోలో, నాగబాబు సోదరి లక్ష్మీకుమారి కుమారులు కన్నా కుమార్, ఈశ్వర్ తైక్వాండో, కయాకింగ్‌లో, నాగబాబు సోదరుడు సాంబశివరావు కుమార్తె భార్గవి రోయింగ్‌లో, కుమారుడు శ్యాం కయాకింగ్‌లో రాష్ట్రస్థాయి, జాతీయ స్థాయిలో పలు పతకాలు అందుకోవడం విశేషం. ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ సాధిస్తా మా కుటుంబానికి చేపల వేటే జీవనాధారం. మా నాన్న ఎంతో కష్టపడి శిక్షణ ఇప్పిస్తున్నారు. వాటర్ స్పోర్ట్స్ అకాడమీ సెక్రటరీ శివారెడ్డి ప్రోత్సాహం మరువలేనిది. కోచ్‌లు శ్రీనివాస్, నాగబాబు, చిన్నబాబు శిక్షణ నన్ను ఈ స్థాయికి తెచ్చాయి. ప్రపంచ ఒలింపిక్స్ వాటర్ స్పోర్ట్స్ క్రీడల్లో పాల్గొని బంగారు పతకం సాధించాలని ఉంది. దాతల ప్రోత్సాహం, మరింత మెరుగైన శిక్షణ అందిస్తే ఇంకా రాణిస్తాను. – నాగిడి గాయత్రి, కయాకింగ్ క్రీడాకారిణి -
విశాఖ బీచ్‌లో విషాదాలు ఉండవిక.. రాకాసి అలలపై నజర్!
సాక్షి, విశాఖపట్నం: సాగర తీరంలో కవ్వించే అలలతో పోటీ పడుతూ.. సరదాల్లో మునిగి తేలే పర్యాటకుల్ని అమాంతం పొట్టన పెట్టుకుంటున్నాయి రాకాసి అలలు. రిప్ కరెంట్‌గా పిలిచే ఇలాంటి రాకాసి అలలు కడలి మాటున దాగి ఉంటూ వేటు వేస్తుంటాయి. చీలిక ప్రవాహాలుగా పేర్కొనే వీటినుంచి సందర్శకుల్ని రక్షించేందుకు విశాఖ పోలీసులు సరికొత్త సాంకేతికతను అందిపుచ్చుకుంటున్నారు. రిప్ కరెంట్‌పై ముందస్తు సమాచారం అందించే వెబ్సైట్ ద్వారా ఆయా బీచ్‌లలో హెచ్చరికలు జారీ చేసి, సందర్శకుల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించేలా ముందస్తు ఏర్పాట్లు చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. రిప్ కరెంట్ అంటే.. బలమైన అలల మధ్య ఇరుకైన ప్రవాహాన్ని రిప్ కరెంట్ అంటారు. ఇవి మనిషిని ఒక్కసారిగా లోతైన ప్రవాహంలోకి లాగేస్తాయి. సముద్ర గర్భంలోని సుదూర ప్రాంతంలో గాలి ద్వారా ఏర్పడిన అలలు.. నీటి అడుగున బలమైన ప్రవాహంగా తీరం వైపు దూసుకొస్తాయి. తీరానికి వచ్చేసరికి అవి రాకాసి అలలుగా మారిపోతాయి. అల ఒక్కసారిగా తీరాన్ని తాకినప్పుడు సముద్రం అడుగున అత్యంత బలమైన ప్రవాహం ఏర్పడుతుంది. ఈ కెరటాలు తిరిగి వెళ్లేటప్పుడు తీరానికి వచ్చే కొద్దీ వేగం అధికమై తరంగాలు ఏర్పడుతుంటాయి. రిప్ కరెంట్ వేగం సెకనుకు 2 నుంచి 8 అడుగుల వరకూ ఉంటుంది. ఇలాంటి అల చీలికతో ఒడ్డుకు సమాంతరంగా 10 నుంచి 290 అడుగుల వెడల్పుతో ఏర్పడుతుంది. ఈ ప్రవాహంలో ఎవరు ఉన్నా.. రెప్పపాటులో సముద్రంలోపలికి వెళ్లిపోతారు. కొన్ని సందర్భాల్లో గజ ఈతగాళ్లు కూడా దీని నుంచి తప్పించుకోవడం అసాధ్యం. విశాఖ తీరంలో ఎన్నో విషాదాలు విశాఖ సాగర తీరంలో 2018లో 55 మంది, 2019లో 51 మంది, 2020లో 64 మంది, 2021లో 63 మంది మృత్యువాత పడగా.. గతేడాది 30 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. విశాఖ వచ్చే పర్యాటకులు యారాడ బీచ్, ఆర్కే బీచ్, తెన్నేటి పార్క్, సాగర నగర్, రుషికొండ బీచ్, ఐటీ హిల్స్, భీమిలి బీచ్ ప్రాంతాలను ఎక్కువగా సందర్శిస్తుంటారు. ఇక్కడి తీరంలో పెద్దపెద్ద రాళ్లు ఉండటంతో వాటిపై నిలబడి సాగర అందాలను వీక్షిస్తుంటారు. కొంతమంది అక్కడే సరదాగా స్నానాలు చేసేందుకు దిగడంతో ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ముఖ్యంగా తీరం నుంచి ఎక్కువ దూరం సముద్రంలోకి వెళ్లడంతో అకస్మాత్తుగా వచ్చే అలలకు బలైపోతున్నారు. విశాఖ తీరం చుట్టూ కొండలు ఉండటంతో వాతావరణంలో వచ్చే మార్పుల కారణంగా రిప్ కరెంట్ వల్ల ఒక్కొక్కసారి భారీ అలలు వస్తుంటాయి. ఇలా రిప్ కరెంట్ వల్ల అలలు కొన్ని మీటర్ల ఎత్తు వరకు వస్తుంటాయి. ఆ సమయంలో తీరంలో ఉన్నవారు వాటికి చిక్కితే క్షణాల్లో కొన్ని కిలోమీటర్ల లోనికి వెళ్లిపోతుంటారు. సాధారణంగా అలలు ఎవరినైనా లోనికి లాగితే కొద్ది దూరంలోనే విడిచిపెట్టేస్తాయి. అటువంటి వారిని లైఫ్‌గార్డ్స్ రక్షించే అవకాశం ఉంటుంది. ఈ రిప్ కరెంట్ వల్ల వచ్చే కెరటాలకు చిక్కితే మాత్రం సురక్షితంగా బయటపడటం అసాధ్యం. సందర్శకుల భద్రతకు పెద్దపీట ఎంవోఎస్‌డీఏసీ డాట్ జీవోవీ డాట్ ఐఎన్ అనే వెబ్సైట్లో రిప్ కరెంట్ సమాచారం ఎప్పటికప్పుడు ముందస్తు హెచ్చరికలతో లభిస్తుంది. ఇలా వచ్చే ముందస్తు సమాచారం ద్వారా రిప్ కరెంట్ ప్రభావం ఎక్కువగా ఉన్న సమయంలో సముద్రంలోకి ఎవరూ వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటాం. ఒకవేళ రిప్ కరెంట్ ప్రభావం లేనిపక్షంలో సముద్రంలోకి వెళ్లేందుకు అనుమతిస్తాం. త్వరలోనే ఈ విధానాన్ని అమలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. విశాఖ నగరానికి వచ్చే ప్రతి పర్యాటకుడి భద్రతకు అత్యంత ప్రాధాన్యమిస్తున్నాం. – సీహెచ్ శ్రీకాంత్, నగర పోలీస్ కమిషనర్ -
సముద్రం సాక్షిగా... మత్స్యకారులకు ఉపయోగపడే స్టార్టప్
మౌనంగా కనిపించే సముద్రం ఒక మహా విద్యాలయం. అక్కడ ప్రతి కెరటం ఒక పాఠం నేర్పుతుంది. ఒక ప్రాజెక్ట్ కోసం పనిచేస్తున్న క్రమంలో దేవ్లీనా భట్టాచార్జీ మత్స్యకారుల జీవితాలను దగ్గరి నుంచి చూసింది. సముద్రం సాక్షిగా మత్స్యకారులకు ఉపయోగపడే స్టార్టప్ గురించి ఆలోచించింది. ‘న్యూమర్8’ రూపంలో ఆమె కల సాకారం అయింది... యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ఇఎస్ఎ)లో ఒక ప్రాజెక్ట్‌లో భాగంగా పనిచేస్తున్నప్పుడు దేవ్లీనా భట్టాచార్జీకి మత్య్సకారుల జీవన విధానం గురించి క్షుణ్ణంగా తెలుసుకునే అవకాశం వచ్చింది. మత్స్యకారుల సంక్షేమం కోసం డాటాసైన్స్ను ఎలా ఉపయోగించవచ్చు... అనే కోణంలో మేధోమథనం చేస్తున్నప్పుడు ఒక ఆలోచన వచ్చింది. అది ‘న్యూమర్8’ పేరుతో స్టార్టప్‌కు శ్రీకారం చుట్టడానికి కారణం అయింది. వాతావరణ సూచనల నుంచి మార్కెట్ సూచనల వరకు ఎన్నోరకాలుగా మత్స్యకారులకు ఉపయోగపడే స్టార్టప్ ఇది. బెంగళూర్ యూనివర్శిటీలో ఎంసీఏ చేసినా లీనాకు రకరకాల సమస్యలకు సంబంధించి సృజనాత్మక పరిష్కారాల గురించి ఆలోచించడం అంటే ఇష్టం. ఎవరి సహాయం లేకుండానే తన పొదుపు మొత్తాలతో ‘న్యూమర్ 8’ను మొదలుపెట్టింది. డాటా సైంటిస్ట్‌లు, జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టం (జిఐఎస్) నిపుణులతో ఒక బృందాన్ని ఏర్పాటు చేసుకుంది. ప్రతిభావంతురాలైన నందిని కార్తికేయన్‌ను సీటీవోగా నియమించింది. సీయీవోగా లీనా స్టార్టప్‌కు సంబంధించిన రోజువారి వ్యాపారవ్యవహారాలను పర్యవేక్షిస్తే, సీటీవోగా నందిని సాంకేతిక విషయాల బాధ్యతలను చూస్తుంది. ‘న్యూమర్ 8’లోని ‘వోఫిష్’ యాప్‌లో అడ్వైజరీ, మార్కెట్ లింకేజి, ఇన్సూరెన్స్, ఫైనాన్స్ విషయాలలో మత్స్యకారులకు ఉపయోగపడే ఫీచర్లు ఉన్నాయి. ‘వోఫిష్’ శాటిలైట్ ఇమేజ్ డాటా ఎనాలసిస్ అనేది మత్య్సకారులకు చేపల వేటలో ఉపయోగపడుతుంది. వేటకు ఎక్కువ సమయం తీసుకోకపోవడమే కాదు, ఇంధనాన్ని పొదుపు చేయడంలో ఉపయోగపడుతుంది. ‘వోఫిష్’లోని మార్కెట్ లింకేజ్ ఫీచర్‌తో మత్స్యకారులకు అవసరమైన వలలు, కోల్డ్ స్టోరేజ్ సౌకర్యాల ఏర్పాటుకు వీలవుతుంది. దీంతోపాటు మధ్యవర్తుల ప్రమేయం లేకుండా మత్స్యకారులు తమ ఉత్పత్తులను ఆన్లైన్ డిస్ట్రిబ్యూటర్లకు అమ్ముకోవచ్చు. ‘న్యూమర్8’ తాజాగా సముద్రపు నాచుపై దృష్టి పెట్టింది. ఔషధ, ఆహార, రసాయనిక పరిశ్రమలలో ప్రపంచవ్యాప్తంగా సముద్రపు నాచుకు డిమాండ్ పెరుగుతున్న విషయం తెలిసిందే. దీన్ని దృష్టిలో పెట్టుకొని మహారాష్ట్రలోని ‘మహిళా ఆర్థిక్ వికాస్ మహామండల్’ అనే స్వచ్ఛందసంస్థ భాగస్వామ్యంతో మత్య్సకారుల కుటుంబాలకు చెందిన మహిళలకు సముద్రపు నాచు ఉత్పత్తుల ద్వారా ఉపాధి కల్పించే ప్రణాళికను న్యూమర్ 8 సిద్ధం చేసింది. చదవండి: Expiry Date: ఎక్స్పైరీ డేట్ ఎందుకు? ఆ తర్వాత వాడితే ఏమవుతుందో తెలుసా! -
కడలి కోత పెడుతోంది!
సాక్షి, విశాఖపట్నం: విశాఖలోని సాగర తీరం మళ్లీ కోతకు గురవుతోంది. తరచూ సముద్రం ముందుకు చొచ్చుకు వస్తోంది. గతంలో తుపానులు, పెను తుపానుల సమయంలోనే ఇలాంటి పరిస్థితి తలెత్తేది. కానీ ఇప్పుడు స్వల్పంగా ప్రభావం చూపే అల్పపీడనాలు, ఆవర్తనాలు వంటివి ఏర్పడినప్పుడు కూడా కడలి కన్నెర్ర చేస్తోంది. గతంలో 2014, 2015, 2016 సంవత్సరాల్లో విశాఖ సాగర తీరం కోతకు గురైంది. 2015లో మరింత అధికంగా.. కిలోమీటర్ల మేర తీరం దెబ్బతింది. ఆర్కే బీచ్ సహా పలుచోట్ల బీచ్‌లు సముద్రంలోకి కొట్టుకుపోయాయి. అప్పట్లో జీవీఎంసీ అధికారులు తీరంలో పెద్దపెద్ద బండ రాళ్లను దింపి కోతను తాత్కాలికంగా కట్టడి చేశారు. యారాడ నుంచి భీమిలి వరకూ.. సముద్రం నుంచి అలలు ఎగసిపడుతూ దూకుడుగా ముందుకు రావడం వల్ల తీరంలో ఇసుక పెద్దమొత్తంలో సముద్రంలోకి కొట్టుకుపోతోంది. సాధారణంగా ఏటా నైరుతి రుతుపవనాల సీజనులో అలల ఉధృతి అధికంగా ఉండటం వల్ల తీరం కోతకు గురవుతోంది. కొన్నిసార్లు ఈశాన్య రుతుపవనాల సీజన్లోనూ ఇక్కడి తీరం కోత సమస్య ఎదుర్కొంటోంది. ముఖ్యంగా యారాడ నుంచి భీమిలి వరకు దాదాపు 35 కిలోమీటర్ల దూరంలో కొన్నిచోట్ల సముద్ర తీరం తరచూ కోతకు గురవుతున్నట్టు నిపుణులు ఇప్పటికే గుర్తించారు. ఇందులో యారాడ బీచ్, కోస్టల్ బ్యాటరీ, ఆర్కే బీచ్, కురుసుర సబ్‌మెరైన్ మ్యూజియం, చిల్డ్రన్ పార్క్, జోడుగుళ్లపాలెం, రుషికొండ, భీమిలి తదితర ప్రాంతాలున్నాయి. ఈ పరిస్థితిని నివారించడానికి విశాఖ పోర్టు అథారిటీ (వీపీఏ) డ్రెడ్జర్లతో డ్రెడ్జింగ్ చేయిస్తుంటుంది. ఏటా ఏప్రిల్, మే నెలల్లో డ్రెడ్జింగ్ ద్వారా కోతకు గురైన ప్రాంతాల్లో ఇసుకను పంపింగ్ చేస్తుంది. దీంతో తీరం కోతకు ఒకింత అడ్డుకట్ట పడుతోంది. తాజాగా దూకుడు తాజాగా విశాఖ తీరం మరోసారి కోతకు గురవుతోంది. దాదాపు వారం రోజులుగా ఈ పరిస్థితి ఉంది. కోస్టల్ బ్యాటరీ నుంచి పార్క్ హోటల్ వరకు ఉన్న మధ్య ప్రాంతంతోపాటు మరికొన్ని చోట్ల కోత ప్రభావం కనిపిస్తోంది. విశాఖ బీచ్‌లో నాలుగైదు చోట్ల పర్యాటకులకు ఆహ్లాదాన్ని పంచడానికి ఓ రిసార్ట్స్ సంస్థ కొన్నేళ్ల క్రితం సుమారు 600 కొబ్బరి చెట్లను నాటింది. ఈ చెట్లు బీచ్ అందాలను ఆస్వాదించడానికి వచ్చే పర్యాటక ప్రియులను ఆకట్టుకుంటున్నాయి. సముద్ర తీరం కోతకు గురవుతుండడంతో వీటిలో కొన్ని కొబ్బరి చెట్లు, బీచ్‌లో వివిధ ఆకృతులతో జీవీఎంసీ ఏర్పాటు చేసిన విద్యుత్ స్తంభాలు కూలుతున్నాయి. అలల ఉధృతి ఎక్కువైంది ఈ నెల 7న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. 11వ తేదీన పౌర్ణమి వచ్చింది. మరోవైపు ఉత్తరం వైపు నుంచి గాలుల ఉధృతి కూడా పెరిగింది. వీటి ప్రభావంతో అలల ఉధృతి సాధారణం కంటే అధికమైంది. సముద్ర కెరటాలు ముందుకు చొచ్చుకు వచ్చాయి. ఈ పరిస్థితులన్నీ తాజాగా విశాఖ తీరం కోతకు కారణమవుతున్నాయి. – ప్రొఫెసర్ కేవీఎస్ఆర్ ప్రసాద్, వాతావరణం–సముద్ర అధ్యయన విభాగ పూర్వ అధిపతి, ఏయూ -
క్షేమంగా.. ఆ నలుగురు
సాక్షి, మచిలీపట్నం/కాట్రేనికోన: ఐదు రోజుల క్రితం చేపల వేటకు వెళ్లి కనిపించకుండా పోయిన కృష్ణాజిల్లా క్యాంప్‌బెల్‌పేటకు చెందిన మత్స్యకారుల ఆచూకీ లభ్యమైంది. సముద్రంలో గాలివాటాన్ని బట్టి వారు ఉన్న బోటు గురువారం కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం కొత్తపాలెం సముద్ర తీరానికి చేరుకుంది. గమనించిన మెరైన్ పోలీసులు ఆ నలుగురిని క్షేమంగా ఒడ్డుకు చేర్చారు. వివరాల్లోకి వెళితే.. మచిలీపట్నం మండలం కరగ్రహారం పంచాయతీ క్యాంప్‌బెల్‌పేటకు చెందిన సుమారు 20 మంది నాలుగు బోట్లలో ఈ నెల 2వ తేదీన చేపల వేటకు వెళ్లారు. అంతర్వేదికి చేరుకున్నాక ఓ బోటు అలల తాకిడికి ముందుకెళ్లలేక ఆగిపోయింది. ఎంత ప్రయత్నించినా బోటు ముందుకు కదలకపోవడంతో మత్స్యకారులు క్యాంప్‌బెల్‌పేటకు చెందిన ఏడుకొండలుకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. సముద్రంలో చిక్కుకున్న రామాని నాంచారయ్య, మోకా వెంకటేశులు, విశ్వనాథపల్లి మస్తాన్, చెక్కా నరసింహను క్షేమంగా తీసుకొచ్చేందుకు మరికొంతమంది మత్స్యకారులు అంతర్వేదికి పయనమయ్యారు. అక్కడ వారి ఆచూకీ లభ్యం కాకపోవడంతో మాజీ మంత్రి, ఎమ్మెల్యే పేర్ని వెంకట్రామయ్య (నాని), కలెక్టర్ రంజిత్‌బాషాకు సమాచారం ఇచ్చారు. ఈ విషయాన్ని పేర్ని నాని సీఎంవో దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన అధికారులు వారి ఆచూకీ కోసం హెలికాప్టర్ ఏర్పాటు చేశారు. మత్స్యశాఖ అధికారులు, మెరైన్ పోలీసులు, నేవీ తదితర అధికార యంత్రాంగం నాలుగు రోజుల పాటు సముద్రంలో గాలింపు చర్యలు చేపట్టింది. ఎట్టకేలకు అధికార యంత్రాంగం అన్వేషణ ఫలించింది. అమలాపురం సమీపంలో మత్స్యకారుల ఆచూకీ కనుగొన్నారు. ఆ నలుగురిని వెంటనే కాట్రేనికోన పీహెచ్‌సీకి తరలించి వైద్య సేవలు అందించారు. అనంతరం గురువారం రాత్రి ఆ నలుగురిని క్యాంప్‌బెల్‌పేటలోని కుటుంబీకులకు అప్పగించారు. మత్స్యకారుల ఆచూకీ తెలియడంతో మాజీ మంత్రి, ఎమ్మెల్యే పేర్ని నాని, ఇన్చార్జ్ కలెక్టర్ మహేష్‌కుమార్ రావిరాల అధికార యంత్రాంగానికి కృతజ్ఞతలు తెలిపారు. -
పంజరంలో.. 'పండుగ'ప్ప
‘మాకు చేపల వేటే జీవనాధారం. బోట్లు దెబ్బతినడంతో ఆక్వాసాగు చేపట్టాం. అదికూడా కలిసిరాకపోవడంతో ఏం చేయాలో పాలుపోని సమయంలో గ్రామంలోని ఓ పది మంది ఎస్సీ, ఎస్టీ యువకులతో కలిసి సీఎంఎఫ్ఆర్ఐ దగ్గర శిక్షణపొంది కేజ్ కల్చర్ ప్రారంభించాం. నాలుగు కేజ్‌లలో రెండువేల పండుగప్ప పిల్లలు వేశాం. ఏడాది పాటు పెంచి సోమవారం పట్టుబడి పట్టాం. ఒక్కో చేప కేజీ నుంచి రెండు కేజీల వరకు పెరిగింది. కిలో రూ.400 చొప్పున అమ్మితే రూ.8 లక్షల ఆదాయం వచ్చింది. ఖర్చులు పోను రూ.3 లక్షలకు పైగా మిగిలింది’.. కృష్ణాజిల్లా కృత్తివెన్ను మండలం చినగొల్లపాలెం పంచాయతీ ఏటిపవర పల్లెపాలేనికి చెందిన తిరుమాని బలరాం తన ఆనందాన్ని ‘సాక్షి’తో ఇలా పంచుకున్నాడు. సాక్షి, అమరావతి: కృష్ణా జిల్లాలో సముద్ర తీరం వెంబడి విస్తరిస్తున్న పంజరం సాగు (కేజ్ కల్చర్) నిరుద్యోగులకు సిరుల పంట కురిపిస్తోంది. ఇది తక్కువ పెట్టుబడితో రెట్టింపు ఆదాయం తెచ్చిపెడుతోంది. చెరువుల్లో చేపల సాగుకు పరిమితం కాకుండా సముద్ర, సహజ జలవనరులలో కేజ్ కల్చర్, మారీ కల్చర్‌ను (పారేనీటిలో వలలు కట్టి సాగుచేయడం) ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. కేంద్ర సముద్ర మత్స్య పరిశోధన కేంద్రం (సీఎంఎఫ్ఆర్ఐ) సాంకేతిక సహకారాన్నిస్తోంది. జపాన్, చైనా, హాంకాంగ్ దేశాల్లో అభివృద్ధి చెందిన ఈ కల్చర్ ఏపీలో విశాఖ, కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణాజిల్లాలోని తీర ప్రాంతాల్లో విస్తరిస్తోంది. కేజ్ ఏర్పాటు ఇలా.. ► సముద్ర తీరంలో 6 మీటర్లు వెడల్పు, 4 మీటర్ల పొడవు విస్తీర్ణంలో కేజును ఏర్పాటుచేస్తారు. ► వీటిని తుప్పుపట్టని పైపులతో వృత్తాకారం, దీర్ఘచతురస్రాకారంలో ఏర్పాటుచేస్తారు. ► ఇవి నీటిలో తేలియాడేందుకు ప్లాస్టిక్ డ్రమ్ములను అమర్చుతారు. ఇన్నర్, ఔటర్ నెట్లు ఏర్పాటుచేస్తారు. ఇన్నర్ వలలో సాగుచేపడతారు. ► పంజరం ఏర్పాటుచేసే స్థలంలో నీటి ఉష్ణోగ్రత 26–30 డిగ్రీల వరకు ఉండాలి. ► లోతు 7–10 మీటర్లు.. నీటి ప్రవాహ వేగం ఎక్కువగా ఉండి, గాలివేగం తక్కువగా ఉండాలి. ► కేజ్ కల్చర్‌లో తిలాఫియా, ఫంగసీస్, రెడ్ తిలాఫియా, రూప్‌చంద్,, కోబియా, పాంపినో, గ్రూపర్, పండుగప్ప వంటివి సాగుచేస్తున్నారు. పంజరం సాగుతో ప్రయోజనాలివీ.. ► భూమి అందుబాటులో లేనివారికి ఈ సాగు అనుకూలం. నిత్యం నీరు పారడంవల్ల చేపలకు వ్యాధులు సోకే అవకాశం తక్కువ. ► పదెకరాల్లో వచ్చే దిగుబడిని అర సెంటు విస్తీర్ణంలో కేజ్ పద్ధతిలో సాధించవచ్చు. ► యంత్రాలు, కూలీల ఖర్చు తగ్గుతుంది. కలుషిత నీటి బారి నుంచి కూడా రక్షణ ఉంటుంది. ఒక్కో కేజ్ నుంచి రెండున్నర టన్నుల దిగుబడి సీఎంఎఫ్ఆర్ఐ సాంకేతిక సహకారంతో కృష్ణాజిల్లాలో ఏటిపవర పల్లెపాలం గ్రామంలోని ఉప్పుటేరుల్లో ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ కింద గత ఏడాది జూన్‌లో 585 మీటర్ల పరిమాణంగల ఒక్క పంజరంలో 100 గ్రా.సైజుగల 600 పండుగప్ప చేప పిల్లలను వదిలారు. ఏడాది కాలంలో ఇవి కేజీ నుంచి 2 కేజీల వరకు పెరిగాయి. సీఎంఎఫ్ఆర్ఐ సీనియర్ శాస్త్రవేత్తలు డాక్టర్ రితీష్ రంజన్, డాక్టర్ శేఖర్ మేఘరాజన్, ఇతర సాంకేతిక సిబ్బంది సమక్షంలో సోమవారం పట్టుబడి పట్టగా ఒక్కొక్క పంజరం నుండి సుమారు 600–700 కేజీల చొప్పున రెండున్నర టన్నులకు పైగా దిగుబడి వచ్చింది. ఒక్కో పంజరంలోని చేపల అమ్మకం ద్వారా రూ.70వేల– రూ.లక్ష వరకు ఆదాయం వచ్చింది. తక్కువ పెట్టుబడి రెట్టింపు ఆదాయం లభించడంతో వారి ఆనందానికి అవధుల్లేవు. -
సముద్ర వాణిజ్యంలో అగ్రగామిగా
ఎంవీపీకాలనీ (విశాఖ తూర్పు): తూర్పుతీరంలో సముద్ర వాణిజ్యంలో అన్నివేళల బలమైన శక్తిగా ఆంధ్రప్రదేశ్ నిలుస్తోంది. బంగాళఖాతం వెంబడి ఉన్న అనేక నగరాలను దాటుకొని వాణిజ్యం, రక్షణ అంశాల్లో తూర్పు అగ్రగామిగా నిలుస్తోంది. దేశవ్యాప్తంగా ఉన్న మేజర్ పోర్టుల కేటగిరిలో సైతం విశాఖ ప్రత్యేకత చాటుతోంది. వాణిజ్య పరంగా పోర్టు నుంచి రికార్డు స్థాయిలో సరుకు రవాణా సాగిస్తోంది. దశాబ్దాలుగా వాణిజ్య సామర్థ్యాన్ని పెంచుకుంటూ ముందుకు సాగుతోంది. విశాఖ ఓడరేవును లార్డ్ విల్లింగ్డన్ 1933, డిసెంబర్19న ప్రారంభించారు. రూ 3.78 కోట్లు వ్యయంతో ఈ ఓడరేవు నిర్మించారు. ప్రారంభంలో 3 బెర్త్‌లతో ఏడాదికి 1.3 లక్షల టన్నుల సరుకు రవాణా చేసిన ఈ ఓడరేవు ప్రస్తుతం 24 బెర్త్‌లతో 65 మిలియన్ టన్నుల సరుకు రవాణాతో అభివృద్ధిలో దూసుకుపోతోంది. ప్రస్తుతం 974 కిలోమీటర్లు సుదీర్ఘ సముద్రతీరం ఉన్న ఆంధ్రప్రదేశ్ మారిటైం బోర్డు పరిధిలో 13 నాన్ మేజర్ పోర్టులు ఉన్నాయి. దీంతో పాటు ఏపీలో విశాఖపట్నం పోర్టు ఏకైక మేజర్ పోర్టుగా నిలిచింది. రక్షణ రంగంలో బలమైన శక్తిగా.. రక్షణ పరంగా తూర్పు నావికాదళం విశాఖ కేంద్రంగా బలమైన శక్తిగా ఎదుగుతోంది. 1968లో ఆవిర్భవించిన తూర్పు నావికాదళం క్రమంగా తూర్పు సముద్ర జలాల్లో అగ్రగామిగా ఎదుగుతోంది. దేశంలో తొలిగా నిర్మించిన అణుజలాంతర్గామి ఐఎన్ఎస్ అరిహంత్ విశాఖలో తయారు చేయడం విశాఖ తీరానికి గర్వకారణంగా నిలుస్తోంది. 1992 నుంచి జరుగుతున్న మలబార్ విన్యాసాలకు తూర్పు తీరం అనేక సార్లు ఆతిథ్యమిచ్చింది. తూర్పునావికాదళం విశిష్టతను పెంచేలా ప్రెసిడెంట్ ప్లీట్ రివ్యూలకు విశాఖను వేదికగా నిలిచింది. తూర్పున ఏపీకి అగ్రస్థానం.. భారత పోర్ట్స్, షిప్పింగ్స్, వాటర్‌వేవ్స్ మంత్రిత్వశాఖ లెక్కల ప్రకారం నాన్ మేజర్ పోర్టుల కేటగిరీలో 2021–22 ఏడాదికి గాను ఓవర్సీస్ కార్గో ట్రాఫిక్‌లో ఆంధ్రప్రదేశ్ మారిటైం బోర్డు 2వ స్థానంలో నిలిచింది. 70.7శాతం వాటాతో 324.43 మిలియన్ టన్నుల లావాదేవీలతో గుజరాత్ తొలిస్థానంలో ఉండగా 14.8 శాతం వాటాతో ఆంధ్రప్రదేశ్ 2వ స్థానంలో నిలిచింది. తరువాతి స్థానాల్లో 7.7 శాతం వాటాతో ఒడిశా, 4.2 శాతం వాటాతో మహారాష్ట్ర రాష్ట్రాలు ఉన్నాయి. అయితే కోస్టల్ కార్గో ట్రాఫిక్‌లో ఏపీ మూడో స్థానంలో నిలిచింది. 51.7 శాతం వాటాతో 41.27 మిలియన్ టన్నుల లావాదేవీలతో గుజరాత్ తొలిస్థానంలో నిలవగా 28.3 శాతం వాటాతో మహారాష్ట్ర 2వ స్థానంలోను 14.4 శాతం వాటాతో ఏపీ మారిటైమ్ బోర్డు మూడో స్థానంలో నిలిచాయి. తూర్పున బే ఆఫ్ బెంగాల్లో కార్గో వాణిజ్యంలో ఆంధ్రప్రదేశ్‌కు అగ్రస్థానం లభించింది. 4వ స్థానంలో విశాఖ పోర్టు.. 2021–22 ఏడాదికి సంబంధించి మేజర్ పోర్టుల కేటగిరీలో విశాఖ ఓవర్సీస్ కార్గో ట్రాఫిక్‌లో విశాఖ పోర్టు 4వ స్థానంలో నిలిచింది. 20.7శాతం వాటాతో 102.8 మిలియన్ టన్నుల లావాదేవీలతో దీనదయాళ్ పోర్టు తొలిస్థానంలో ఉండగా 13.5 శాతం వాటాతో పారాదీప్ పోర్టు, 13.1 శాతం 3వ స్థానంలో జేఎన్పీటి నిలిచాయి. ఈ కేటగిరీలో విశాఖ పోర్టు 8.7 శాతం వాటాతో 4వ స్థానంలో నిలిచింది. కోస్టల్ కార్గో ట్రాఫిక్‌లో లావాదేవీల్లో విశాఖపోర్టు మూడో స్థానంలో నిలిచింది. 24 శాతం వాటాతో 37.0 మిలియన్ టన్నుల లావాదేవీలతో పారాదీప్ పోర్టు తొలిస్థానంలో నిలవగా 14.3శాతం వాటాతో ముంబాయి పోర్టు 2వ స్థానంలోను, 12.5 శాతం వాటాతో విశాఖపోర్టు మూడు స్థానంలోని నిలిచాయి. మేజర్ పోర్ట్‌ల కేటగిరీలో తూర్పున సముద్ర వాణిజ్యంలో పారాదీప్ తరువాతి స్థానంలో విశాఖ నిలిచింది. ఏపీ మారిటైం బోర్డు బలోపేతం సముద్ర వాణిజ్యాన్ని పెంపొందించే దిశగా ఏపీ మారిటైం బోర్డును బలోపేతం చేస్తున్నాం. విశాఖ మేజర్ పోర్టుతో పాటు 13 నాన్ మేజర్ పోర్టులో ఏపీ తీరంలో ఉన్నాయి. వీటి ద్వారా ఏటా ఎగుమతులు, దిగుమతుల సామర్థ్యం ఏటా పెరుగుతోంది. త్వరలోనే రామయ్యపట్నం, మచిలీపట్నం, భావనపాడు ఓడరేవులు పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానున్నాయి. త్వరలోనే ప్రకాశం జిల్లా రామయ్యపట్నం పోర్టుకు త్వరలోనే శంకుస్థాపన చేయనున్నాం. చేపల నిల్వ, విక్రయాలకు అనువుగా ఫిషింగ్ హార్బర్లు నిర్మిస్తున్నాం. రానున్న రోజుల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా దేశం ఆశ్చర్యపోయే రీతిలో మారీటైం బోర్డును బలోపేతం చేయనున్నాం. – కనకాల వెంకటరెడ్డి, ఏపీ మారిటైం బోర్డు చైర్మన్ -
చేతులతో నడిచే అరుదైన గులాబీ చేప..!
Rare Pink Hand Fish Spotted In Australia: ఆస్ట్రేలియాలో టాస్మానియన్ తీరంలో తొలిసారిగా అరుదైన చేతులతో నడిచే గులాబీ చేప(పింక్ హ్యాండ్ ఫిష్) కనిపించింది. అయితే ఈ పింక్ హ్యాండ్ ఫిష్‌ను గతంలో 1999లో సముద్రం అడుగున ఈత కొట్టే ఒక డైవర్ గుర్తించారు. అయితే ఇప్పుడు తాజాగా టాస్మానియా దక్షిణ తీరానికి 120 మీటర్ల లోతులో ఈ పింక్ హ్యాండ్ ఫిష్‌ని ఆస్ర్టేలియా పరిశోధకులు గుర్తించినట్లు తెలిపారు. (చదవండి: పెళ్లి చేసుకోవడానికి, పిల్లలను కనడానికి లక్షల్లో రుణాలు!) ఈ క్రమంలో యూనివర్సిటీ ఆఫ్ టాస్మానియాలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ అంటార్కిటిక్ అండ్ మెరైన్ స్టడీస్‌కు చెందిన ప్రొఫెసర్ నెవిల్లే బారెట్ అతని బృందం పగడపు పీతలు, చేప జాతులు గురించి సర్వే చేయడానికి మెరైన్ పార్క్ సముద్రగర్భంలో ఒక కెమెరాను ఉంచింది. అయితే ఆ మెరైన్ స్టడీస్ రీసెర్చ్ అసిస్టెంట్ యాష్లీ బాస్టియాన్సెన్ కెమెరా ఫుటేజీని పరిశీలిస్తున్నప్పుడు ఆమె ఈ పింక్ హ్యాండ్‌ఫిష్‌ను గుర్తించింది. అంతేకాదు ఆ ఫుటేజ్‌లో ఈ పింక్ ఫిష్ పీతలో దాడి నుంచి తప్పించేకునే నిమిత్తం కంగారుగా వెళ్లుతున్నట్లుగా కనిపించింది. ఈ అత్యధునిక సాంకేతికతో కూడిన కెమెరా తమకు మంచి చిత్రాలతో కూడిన అరుదైన జాతులను గురించి తెలియజేసింది అని ప్రొఫెసర్ బారెట్ అన్నారు. అంతేకాదు ఇలాంటి అరుదైన జాతులు లోతైన ప్రాంతాల్లో ఆవాసాలు ఏర్పరుచుకుంటాయని చెప్పారు. పైగా ఈ పింక్ ఫిష్‌లు అధిక-పరిమాణ చేతులు కలిగి ఉంటాయని అవి సముద్రగర్భం వెంబడి నడవడం, ఈత కొట్టడం వంటివి చేస్తాయని పేర్కొన్నారు. (చదవండి: పూజారి వేషంలో మాదక ద్రవ్యాల వ్యాపారం... 7 కిలోల గంజాయి పట్టివేత!!) -
వైరల్ వీడియో.. చూస్తుండగానే సముద్రంలో కలిసిపోయిన ఇల్లు
సోషల్ మీడియాను వాడుతున్న యూజర్ల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. అందులో పలు వీడియోలు నెటిజన్లను ఆకట్టుకుంటూ వైరల్‌గా మారుతున్నాయి. ఈ క్రమంలో కొన్ని మనల్ని ఆశ్చర్యానికి గురిచేస్తుంటే.. మరికొన్ని ఆందోళనకు గురిచేస్తుంటాయి. తాజాగా ఓ వీడియో నెట్టింట దూసుకుపోతుంది. ఓ ఇల్లు ఒక్కసారిగా సముద్రంలో కుప్పకూలింది. ఆ ఇల్లు కూలినట్లు గాక సముద్రమే మింగేసిందా? అనేలా ఉన్న ఈ వీడియో చూస్తున్నంతసేపు మనల్ని భయబ్రాంతులకు గురిచేస్తుంది. జూలై 28న అర్జెంటినాలోని బ్యూనస్ ఎయిర్స్‌లోని మార్ డెల్ తుయులో ఈ ఘటన చోటుచేసుకుంది. సముద్రంలో నీటిమట్టం అంతకంతకూ పెరగడంతో తీరం సమీపాన ఉన్న ఓ రెండస్థుల భవనం పునాదులు పూర్తిగా దెబ్బతింది. దీంతో ఒక్కసారిగా ఆ రెండస్థుల భవనం సముద్రంలోకి కుప్పకూలిపోయింది. అదృష్టవశాత్తు ఈ ప్రమాదం జరిగినప్పుడు ఆ ఇంట్లో ఎవరూ లేరని, పెను ప్రమాదం తప్పిందని అర్జెంటినా మీడియా వెల్లడించింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారి హల్ చల్ చేస్తోంది. ఇదిలా ఉండగా తీర ప్రాంతం కోతకు గురవుతున్న కారణంగానే ఇలాంటి ఘటనలు జరిగే అవకాశం ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. After teetering on the edge for some time, a house in Buenos Aires, Argentina, has finally collapsed into the sea. Watch more videos from Sky News: https://t.co/3ZESAqWhX3 pic.twitter.com/8cZE8LKe8S — Sky News (@SkyNews) July 30, 2021 -
తీరాన్ని తాకిన తౌక్టే తుఫాన్
గాంధీనగర్: తుఫాను నుంచి తీవ్ర తుఫానుగా మారిన తౌక్టే గజరాత్‌లో తీరాన్ని తాకింది. ఇక మరో రెండు గంటల్లో తీరాన్ని దాటనున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇప్పటికే గుజరాత్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు పడుతుండగా సహాయక చర్యల్లో కోసం ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ, నేవీ బృందాలు రంగంలోకి దిగాయి. గుజరాత్ ప్రభుత్వం తీరప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ( చదవండి: పశ్చిమ తీరంలో తౌక్టే తుఫాన్ బీభత్సం.. ) -
మిస్టరీ: ఒడ్డుకు కొట్టుకొచ్చిన బంగారం..
కారకాస్: ఆశ్చర్యపరిచే సంఘటన... ప్రస్తుతం బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతూ సామాన్యుడికి అందనంత దూరంలో ఉంది. కానీ ఈ దేశంలో మాత్రం బంగారం నెలకు దిగొచ్చి సామన్యుడి చేతికందొచ్చింది. భారీ స్థాయిలో బంగారం సముద్రపు అలలతో ఒడ్డుకు కొట్టుకొచ్చింది. నమ్మశక్యం కానీ ఈ సంఘటన వెనిజులాలో చోటుచేసుకుంది. ఆదివారం గ్వాకలోని సముద్ర తీరానికి బంగారు, వెండి ఆభరణాలు వేల సంఖ్యలో కొట్టుకొచ్చాయట. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దాదాపు 2 వేలకు పైగా మత్స్యాకార కుటుంబాలు ఈ బీచ్ వద్ద నివసిస్తుంటాయి. ఈ క్రమంలో ఓ మత్స్యకారుడు చేపల వేట కోసం ఉదయాన్నే తీరానికి రాగా అతడికి ఒడ్డున ఇసుకలో మెరుస్తున్న వస్తువు కనిపించింది. అదేంటని చేతిలోకి తీసుకుని చూడగా అది బంగారు ఆభరణం. (చదవండి: వైరల్: కూతురి వేళ్లు కొరుక్కుతిన్న తల్లి!) దాంతో ఆశ్చర్యపోయిన ఆ మత్స్యకారుడు బంగారం దొరికిందోచ్..! అంటూ గట్టిగా కేకలు వేశాడు. అతడి కేకలు విన్న మిగతా గ్రామస్తులు, మత్స్యకారులు వచ్చి చూసేసరికి బీచ్ ఒడ్డున ఇసుకల్లో బంగారం, వెండి ఆభరణాలు కనిపించాయి. అనంతరం గ్రామస్తులు బీచ్ మొత్తం జల్లెడ పట్టడం ప్రారంభించారు. బంగారు ఆభరణాలు దొరకడంతో గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తూ.. ఇలాంటి సంఘటన ఎప్పుడు జరగలేదని, ఇదే మొదటిసారని చెప్పారు. ఈ బంగారం ఒడ్డుకు ఎలా వచ్చిందో, అసలు సముద్రంలోకి ఎలా చేరాయో ఇప్పటికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని చెప్పుకొచ్చారు. ఈ విషయం తెలిసిన వెనిజులా నిపుణులు ఒడ్డుకు బంగారు ఆభరణాలకు ఎలా కొట్టుకువచ్చాయని శోధించే పనిలో పడ్డారట. (చదవండి: పాకిస్తాన్: ‘అందుకే విగ్రహం ధ్వంసం చేశా’) -
ఘర్షణ: సముద్రంలో ఛేజింగ్!
సాక్షి, ఒంగోలు: సముద్రంలో చేపలు, రొయ్యల విషయంలో చీరాల మండలంలోని పలు గ్రామాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. దీంతో రెండు గ్రూపులుగా విడిపోయిన పలు గ్రామాల మత్స్యకారులు సముద్రంలో పలుమార్లు చేపల వేట చేసుకుంటూనే గొడవలకు దిగుతూ వచ్చారు. అది కాస్తా చిలికి చిలికి గాలివానలా మారి ఒక గ్రామం మత్స్యకారుల వలలను, బోట్లను మరో గ్రామానికి చెందిన మత్స్యకారులు తీసుకెళ్లడంతో ఘర్షణలు తారస్థాయికి చేరాయి. ఆ తరువాత తీసుకెళ్లిన బోట్లు, వలలకు చెందిన గ్రామస్తులు ఇతర గ్రామాలకు చెందిన బోట్లను, వలలను తీసుకెళ్లడంతో మత్స్యకారుల మధ్య గొడవ కాస్తా గ్రామాల మధ్య గొడవగా మారింది. దీంతో గ్రామాల వారీగా ఒకరిపై ఒకరు చీరాల, ఈపూరుపాలెం పోలీస్స్టేషన్లలో కేసులు పెట్టుకునే స్థాయికి చేరుకుంది. దీంతో గ్రామాల మధ్య నెలకొన్న ఘర్షణలు తీవ్రరూపం దాల్చడంతో ఆ గ్రామాల మధ్య పంచాయతీ జిల్లా మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్ కార్యాలయానికి చేరుకుంది. దీంతో బుధవారం ఒంగోలులోని మత్స్యశాఖ జేడీ కార్యాలయంలో ఓడరేవు గ్రామానికి చెందిన మత్స్యకారులను, రెండవ వర్గానికి చెందిన కఠారివారిపాలెం, రామచంద్రపురం, పొట్టిసుబ్బయపాలెం గ్రామాలకు చెందిన మత్స్యకారులతో మత్స్యశాఖ అధికారులు, పోలీసులు సంప్రదింపులు జరిపారు. ఒక గ్రామానికి చెందిన పడవలు, వలలు మరో గ్రామానికి చెందిన వారు తీసుకెళ్లడం, మరో గ్రామాలకు చెందిన పడవలు, వలలను ఇంకొక గ్రామానికి చెందిన మత్స్యకారులు తీసుకెళ్లడం మానుకోవాలని అధికారులు ఆయా గ్రామాల మత్స్యకారులకు సూచించారు. ఘర్షణ వాతావరణం లేకుండా సయోధ్యగా ఉండాలని కూడా ఆయా గ్రామాల మత్స్యకారులకు నచ్చజెప్పారు. అర అంగుళం సైజు కంటే తక్కువ కన్ను ఉన్న వలలను వాడటంతో సముద్రంలో ఉన్న గుడ్లుతో సహా వలల్లో వస్తున్నాయని దీంతో మత్స్యసంపద నశించిపోతుందన్న ఉద్దేశంతో ఘర్షణ వాతావరణం నెలకొందనే ఉద్దేశమని అధికారులు నిర్ధారణకొచ్చారు. దీనిపై మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్ ఆవుల చంద్రశేఖరరెడ్డి ఆయా గ్రామాల్లో వాడుతున్న వలలను పరిశీలించి తదుపరి చర్యలు తీసుకుంటామని ఈలోగా గొడవలు లేకుండమత్స్యకారులు కలిసిమెలిసి ఉండాలని ఆయన సూచించారు. -
వేటకెళ్తూ దారితప్పి.. బంగ్లాదేశ్ జలాల్లోకి
సాక్షి, విజయనగరం/పూసపాటిరేగ: జిల్లాలోని మత్స్యకార గ్రామాలు మరోసారి ఉలిక్కిపడ్డాయి. వేటకు వెళ్లిన తమవారు బంగ్లాదేశ్ సరిహద్దుల్లోకి వెళ్లి అక్కడ బందీలయ్యారనే వార్త విని ఇక్కడి వారి కుటుంబాలు తల్లడిల్లాయి. గత అనుభవాల దృష్ట్యా తమ వారు ఎప్పుడొస్తారో తెలి యక వారంతా అల్లాడిపోయా రు. కనీసం తమ వారితో అధికారులు ఫోన్లో మాట్లాడించినా... బాగుండని బోరున విలపించారు. కానీ అదృష్టవశాత్తూ వా రు సురక్షితంగానే ఉన్నారని తెలియగానే వారంతా ఊపిరి పీల్చుకున్నారు. ఒక్కరోజు వ్యవధిలోనే ఆ దేశ కోస్టుగార్డులు వెనక్కిపంపించారన్న సమాచారంతో తిప్పలవలస, పతివాడ బర్రిపేట, చింతపల్లి గ్రామాల్లో ఆనందం వెల్లివిరిసింది. ప్రపంచం మొత్తానికి కీడు చేస్తున్న కరోనా వీరికి మాత్రం ఒకరకంగా మేలు చేసిందనే చెప్పాలి. బందీలుగా చిక్కింది ఇలా... పూసపాటిరేగ మండలం తిప్పలవలస, పతివాడబర్రిపేట, చింతపల్లికి చెందిన ఎడుగురు మత్స్యకారులు మరో ఐదు గురు మత్స్యకారులతో కలిసి విశాఖ హార్బర్ నుంచి నవంబర్ 7వ తేదీన సముద్రంలో చేపల వేటకు వెళ్లారు. నిబంధనలపై అవగాహన లేక మన దేశ సరిహద్దు దాటి బంగ్లాదేశ్ సముద్ర జలాల్లోకి పొరపాటున ప్రవేశించారు. నవంబర్ 29 తెల్లవారు జామున 3 గంటల సమయంలో బంగ్లాదేశ్ రక్షక దళాలు మత్స్యకారులను అదుపులోకి తీసుకున్నాయి. పట్టుబడిన వారిలో పూసపాటిరేగ మండలం తిప్పలవలసకు చెందిన నక్క దానయ్య, రాయితి లక్ష్మయ్య, నక్క బోడోడు, పతివాడబర్రిపేటకు చెందిన గరికిన ఎల్లయ్య, గరికిన శ్రీను, మైలపల్లి కొర్లయ్య, చింతపల్లికి చెందిన చొక్కా శ్రీను ఉన్నారు. బోటులో మత్స్యకారుల పక్కనే మన దేశ సముద్ర జలాల్లో వేట చేస్తున్న మత్స్యకారుల ద్వారా బోటు యజమాని వాసుపల్లి ప్రసాదుకు అక్కడి నుంచి సమాచారం పంపించారు. సోమవారం ఉదయానికి మత్స్యకారుల స్వగ్రామాలకు విషయం తెలియచేయడంతో వారి కుటుంబ సభ్యులంతా ఆందోళన చెందారు. అదృష్ట వశాత్తూ గంటల వ్యవధిలోనే మత్స్యకారులను కరోనా భయంతో బంగ్లాదేశ్‌లో విడిచిపెట్టారు. జీపీఆర్ఎస్, వలలు తీసుకొని సరిహద్దు లు ఎందుకు దాటారని బంగ్లాదేశ్ కోస్టుగార్డులు ఆ గ్రహం వ్యక్తం చేశారు. మరోసారి ఇలా జరిగితే కఠిన చ ర్యలు తీసుకుంటామని హెచ్చరించి వదిలేశారు. మత్స్య కారులు సురక్షితంగా వస్తున్నారని మ త్స్యశాఖ జిల్లా ఉప సంచాలకులు నిర్మలా కుమారి ధ్రు వీకరించారు. చిక్కితే జైలుకే పొట్టకూటి కోసం వలస పోతున్న మత్స్యకారులు సముద్రంలో దారి తెలీక పొరపాటున పరాయి దేశ జలాల్లోకి వెళ్లి అక్కడి రక్షఖ దళాలకు బందీలుగా చి క్కుతున్నారు. జిల్లాలోని తీరప్రాంత మండలాలకు చెందిన వేలాది మంది కడలి బిడ్డలు విశాఖపట్నం, కర్ణాటక పోర్టులకు వెళ్లి, అక్కడి నుంచి సముద్రంలో వేటకు వెళుతుంటారు. దారి తప్పి విదేశీలకు బందీలు గా మారి ఏళ్ల తరబడి జైళ్లల్లో మగ్గిపోతున్నారు. 2018 నవంబర్ 28వ తేదీన అరేబియా మహాసముద్రంలో వేటాడుతూ పాకిస్తాన్ జలాల్లోకి ప్రవేశించారంటూ అక్కడి అధికారులు ఉత్తరాంధ్రకు చెందిన 20 మంది మత్స్యకారులను అరెస్టు చేశారు. దాదాపు 13 నెలల తర్వాత వీరు రాష్ట్ర ప్రభుత్వం చొరవతో విడుదలయ్యారు. ఆ తరువాత సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మత్స్యకారుల సంక్షేమానికి అనేక వరాలనిచ్చా రు. వేట విరామ సయంలో ఇచ్చే సాయాన్ని రూ. 6 వేల నుంచి రూ. 10 వేలకు పెంచారు. డీజిల్ రాయితీలను కూడా పెంచారు. అయితే ఈసారి చిక్కిన వారిని ఒకరకంగా కరోనా కాపాడిందంటున్నారు. ఇక రాడేమోనని భయపడ్డాం నా కొడుకు నక్కా దానయ్య బందీగా చిక్కాడని కబురు తెలియగానే గుండెలు గుభేల్ మన్నాయి. ఎందుకంటే గతంలో బందీలుగా చిక్కిన మా బంధువులు సంవత్సరాల తరబడి అక్కడే ఉండిపోయారు. మా బాబు పరిస్థితీ అంతేనా అని భయపడ్డాం. ఇంతలోనే అక్కడివాళ్లు విడిచిపెట్టారని సమాచారం వచ్చింది. దేవుడే మావోడ్ని కాపాడాడు. – నక్కా లక్ష్మీ, నక్కా దానయ్యతల్లి, తిప్పలవలస. ఆశలు వదులుకున్నాను... నా కొడుకు నక్క బోడోడు బంగ్లాదేశ్ మత్స్యకారులకు చిక్కా డని తెలియగానే నాకు దిక్కు ఎవరని బోరున ఏడ్చాను. దాదాపుగా ఆశలొదిలేసుకున్నాను. అంతలోనే అక్కడి అధికారులు మావోల్ని ఒదిలీసేరని తెలిసింది. నిజంగా దేవుడు మాపక్కనున్నాడు. అందుకు మావోడు వచ్చేత్తన్నాడు. వాడిని తనివితీరా సూసుకోవాలనుంది. – నక్క అప్పన్న, నక్క బోడోడు తండ్రి తిప్పలవలస మా అల్లుడికి మరో జన్మే మా అల్లుడు రాయితి లక్ష్మయ్య బంగ్లాదేశ్ కోస్టుగార్డులకు చిక్కి రోజు వ్యవధిలోనే తిరిగి ఇక్కడికి బయలుదేరినట్లు తెలిసింది. కలలో కూడా ఇలా జరుగుతుందని ఊహించలేదు. బంగ్లాదేశ్ అధికారులకు దేవుడు మంచి బుద్ధి ప్రసాదించడంతో తిరిగి స్వగ్రామాలుకు పంపించారు. – మైలపల్లి అప్పయ్యమ్మ, రాయితి లక్ష్మయ్య అత్త, తిప్పలవలస. -
కల్లోల కడలి
సాక్షి, వజ్రపుకొత్తూరు(శ్రీకాకుళం) : కడలి కల్లోలమవుతోంది. అలలు ఉగ్రరూపం దాల్చి తీరానికి వస్తున్నాయి. ఉవ్వెత్తున ఎగసిపడుతున్న అలలను చూసి మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని భావనపాడు, మంచినీళ్లపేట, బారువ తీరాల్లో దాదాపు 50 మీటర్ల ఎత్తున అలలు ఎగసి పడుతున్నాయి. అలల తాకిడికి వజ్రపుకొత్తూరు మండలం మంచినీళ్లపేట తీరంలో సముద్రం దాదాపు 135 మీటర్ల మేర ముం దుకు వచ్చింది. తీరానికి ఆనుకుని ఉన్న ఇసుక దిబ్బలు కోతకు గురవుతున్నాయి. మంచినీళ్లపేటతో పాటు దేవునల్తాడ, అక్కుపల్లి, డోకులపాడు తీరంలో తీరం కోతకు గురైంది. అల్పపీడన ద్రోణి, ఉపరితల ఆవర్తనం వెరసి కోస్తా తీరానికి భారీ వర్షం పొంచి ఉందని భారత వాతావరణ విభాగం హెచ్చరించడంతో శ్రీకా కుళం జిల్లాలో తీరం ప్రాంతాన్ని అధికారులు అప్రమత్తం చేశారు. తీర ప్రాంత గ్రామాల్లో మత్స్యకారులు వేటకు వెళ్లరాదంటూ దండోరాలు వేయించిన రెవెన్యూ అధికారులు ఎప్పటికప్పుడు సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకోవాలంటూ సూచిస్తున్నారు. తీరంలోనే వేట సామగ్రి వదిలిన మత్స్యకారులు వేట లేకరెండురోజులుగా ఇళ్లకే పరిమితమయ్యారు. ఏడాదిలో ఐదోసారి గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది తీరం కోత కు గురవడం ఇది ఐదోసారని, గతంలో వచ్చిన తుఫాన్, అధిక వర్షాలకు ఇలాంటి ప్రమాదకర పరిస్థితి ఉండేది కాదని మత్స్యకారులు చెబుతున్నారు. మంచినీళ్లపేట, దేవునల్తాడ, అక్కుపల్లి ప్రాంతాల్లో ఏడాదిలో ఐదు సార్లు తీరం కోతకు గురైంది. జిల్లాలో సంతబొమ్మాళి, గార, ఎచ్చెర్ల మండలాల్లో చాలా చోట్ల తీరం ఇలాగే ఆందోళన రేకెత్తిస్తోంది. ఇది ఒక రకంగా ప్రమాదానికి సూచిక అంటూ పెద్దలు హెచ్చరిస్తున్నారు. హుద్‌హుద్, తిత్లీ, ఫొని లాంటి తుపాన్లే ఇందకు నిదర్శనం కాగా.. సముద్ర అంతర్భాగంలోని పొరల్లో ఏర్పడుతున్న అలజడి ఓ కారణం అంటూ నిపుణులు చెబుతున్నారు. నెల రోజుల కిందట అక్కుపల్లి తీరంలో దాదాపు కిలోమీటరు మేర, ఇప్పుడేమో మంచినీళ్లపేట తీరంలో 2 కిలోమీటర్ల మేర తీరం కోతకు గురైంది. పస్తుల్లో గంగపుత్రులు వరుసగా తుఫాన్లు, అల్పపీడన ద్రోణులు ఏర్పడుతుండడంతో మత్స్యకారులు వేటకు వెళ్లడం కుదరడం లేదు. వేట లేక మత్స్యసంపద చిక్కక, చిక్కిన సంపదకు దళారుల బెడద కలగలిపి గంగపుత్రులను బెంగ కు గురి చేస్తున్నాయి. మరో పక్క 61 రోజుల పాటు వేట నిషేధ భృతి ఇంకా అందలేదు. ఆయిల్ సబ్సిడీ సైతం అందని మత్స్యకారులు జిల్లాలో కోకొల్లలుగా ఉన్నారు. ప్రస్తుత ప్రభుత్వం వేట నిషేధ భృతి పెంచింది. తుఫాన్ల సమయంలోనూ తమను ఆదుకోవాలని మత్స్యకారులు కోరుతున్నారు. చేపల వేటకు వెళ్లొద్దు అల్పపీడణ ద్రోణి ఉన్నందున మత్స్యకారులను చేపల వేటకు వెళ్లవద్దని ఆదేశించాం. ఇప్పటికే మా సిబ్బంది ద్వారా సాగర మత్స్యకార సొసైటీ అధ్యక్షులకు సమాచారం అందించాం. తీర ప్రాంత గ్రామాల్లో దండోరాలు వేయించాం. వేట నిషేధ భృతికి సంబంధించి ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన హామీ మేరకు రూ.10వేలు వేట నిషేధ భృతి కోసం కమిషనరేట్ నుంచి బడ్జెట్ ప్రతిపాదనలు అడిగారు. అవి పంపించాం. అందుకే వేట నిషేధ భృతి కొంత మేర ఆలస్యమైంది. త్వరలో మంజూరు అయ్యే అవకాశం ఉంది. – సంతోష్‌కుమార్, ఎఫ్డీఓ, పలాస తుపాన్ల సమయంలో అండగా నిలవాలి తుపానులు, అధిక వర్షా ల సమయంలో మత్స్యకారులకు తీవ్ర నష్టం జరుగుతోంది. రైతులకు ఇచ్చే ఇన్పుట్ సబ్సిడీ తుఫాన్ల సమయంలో మత్స్యకారులకు కూడా అందించేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. ఇసుక దిబ్బ లపై ఎండబెట్టిన ఉప్పు చేపలు పాడైతే నష్ట పరిహారం ఇవ్వాలి. మత్స్యకారులకు కార్పొరేషన్ ఏర్పాటు చేసి రుణాలు అందించి సొసైటీలను బలోపేతం చేయాలి. వేటకెళ్లే మత్స్యకారుని ఖాతాలో నిషేధ భృతి జమ అయ్యేలా చర్యలు తీసుకోవాలి. – జి.శంభూరావు, మత్స్యకారుడు. -
కోస్ట్‌గార్డు స్టేషన్ ప్రారంభం
నిజాంపట్నం: సముద్ర తీరప్రాంతంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. తీరప్రాంత రక్షణ చర్యల్లో భాగంగా నిజాంపట్నంలో మంగళవారం కోస్ట్‌గార్డు స్టేషన్ ఏర్పాటు చేశారు. ఇండియన్ కోస్ట్‌గార్డు డెరైక్టర్ జనరల్ అనురాగ్ జి తప్లియాల్ స్టేషన్‌ను ప్రారంభించి ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. 2008లో ముంబై తీర ప్రాంతం నుంచి ఉగ్రవాదులు నగరంలోకి చొరబడి సృష్టిం చిన హింసాకాండను ఎప్పటికీ మరువలేమన్నారు. అలాంటి ఘటనలకు తావు లేకుండా తీరంలో పటిష్ట రక్షణ ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పారు. నిజాంపట్నంలో ఏర్పాటు చేసిన కోస్ట్‌గార్డు స్టేషన్ తీరప్రాంతంలో నిరంతర నిఘా కొనసాగిస్తుందని చెప్పారు. ప్రకృతి విపత్తుల సమయంలో తీరప్రాంతంలోని ప్రజల రక్షణకు కోస్ట్‌గార్డు సిబ్బంది పూర్తి సహాయసహకారాలు అందిస్తారన్నారు. హుదూద్ తుపాను సమయంలో రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో భారీ నష్టం సంభవించకుండా కోస్ట్‌గార్డ్ సిబ్బంది తీవ్రంగా కృషి చేశారన్నారు. నిఘా విషయంలో మత్స్యకారుల సహకారం కీలకమైందన్నారు. దేశరక్షణకు మత్స్యకారులు అంకిత భావం తో సమాచారం అందించి సహకరించాలని కోరారు. సముద్రంలో వేట చేస్తున్న సమయంలో అపరిచిత బోట్లు, వ్యక్తులు ఉన్నట్లు గుర్తిస్తే వెంటనే కోస్ట్‌గార్డు సిబ్బందికి సమాచారం అందించాలని ఆయన మత్స్యకారులకు సూచించారు. 15 వేల మంది జనాభా ఉన్న నిజాంపట్నం పంచాయతీ పరిధిలో కోస్ట్‌గార్డు స్టేషన్ ఏర్పాటు చేసుకోవటం ఎంతో సంతోషంగా ఉందన్నారు. తొలుత కోస్ట్‌గార్డు సిబ్బంది గౌరవవందనం స్వీకరించారు. జాతీయ జెండా, కోస్ట్‌గార్డు జెండాలకు వందన సమర్పణ చేశారు.అనంతరం కోస్ట్‌గార్డు స్టేషన్‌ను లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ కోస్ట్‌గార్డు ఐజి ఎస్పి.శర్మ, కోస్ట్‌గార్డు డీఐజీ శబర్వాల్, కోస్ట్‌గార్డు అధికారి ఏకేఎస్ పన్వర్, రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
సరుగుడు తోట దగ్ధం
* 50 ఎకరాల్లోని చెట్లు అగ్నికి ఆహుతి * 40 లక్షల ఆస్తి నష్టం మలికిపురం : మలికిపురం మండలం శంకరగుప్తం గ్రామంలోని సముద్ర తీరంలో గురువారం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తీరంలోని సీసీఎఫ్‌కు చెందిన సుమారు 50 ఎకరాల్లోని సరుగుడు తోట దగ్ధమై రూ.40 లక్షల ఆస్తి నష్టం వాటెల్లింది. బీచ్‌కు వచ్చే ఆకతాయిలు సిగరెట్లు పడేయడం వల్ల మంటలు చెలరేగి ఈ ప్రమాదం జరిగి ఉంటుందని స్థానికు లు భావిస్తున్నారు. మధ్యాహ్నం రెండు నుంచి మూడు గంటల వరకూ అనగా గంట వ్యవధిలో 50 ఎకరాల్లోని పంట కాలిబూడిదైంది. ప్రమాద స్థలాన్ని తహశీల్దారు బత్తుల ఝాన్సీ పరిశీలించి నష్టాన్ని అంచనా వేశారు. దిగబడిపోయిన అగ్నిమాపక వాహనం రైతులు తమ భూముల్లోని సరుగుడు పంటను కాపాడుకునేందుకు పరుగులు తీశారు. కళ్లెదుటే కాలిపోతున్న పంటను చూసి విలవిలలాడిపోయారు. ప్రమాదంపై స్థానిక అగ్నిమాపకశాఖ కేంద్రానికి సమాచారం అందించగా సిబ్బంది సకాలంలో వచ్చారు. అయితే ప్రమాదం స్థలం సమీపంలోనే కొత్తగా వేసిన రోడ్డుపై వాహనం దిగబడిపోయింది. అప్పటికే ఆందోళనలో ఉన్న రైతులు, సర్పంచ్ ఉల్లూరి గోపాలరావు, మండల ఉపాధ్యక్షురాలు రాపాక అరుణ ఆనందకుమార్, ఎంపీటీసీ సభ్యులు ఆచంట నరసింహమూర్తి, సీసీఎఫ్ అధ్యక్షుడు కొంబత్తుల చంద్ర శేఖర్, డెరైక్టర్లు పారలతో ఇసుక వేసి మంటలను కొంత అదుపు చేశారు. అగ్ని మాపక వాహనం ఆగిపోవడంతో ఏం చేయాలో తెలియక అయోమయ స్థితిలో పడ్డారు. అయితే అంతకు ముందు సముద్రం నుంచి భారీ కెరటం వచ్చి సమీపంలోని సేలయేరులోకి నీరు చేరడంతో ఆ విషయాన్ని రైతులు అగ్నిమాపక సిబ్బందికి చెప్పారు. దాంతో వారు వాహనంలోని పైపులను సుమారు 200 మీటర్ల మేర వేసి సెలయేరులోని నీటిని మోటార్లుతో తోడి మంటలను ఆర్పారు. అప్పటికే సుమారు 50 ఎకరాల్లోని తోట దగ్ధమైయింది. అరుదుగా తప్ప సాధారణ సమయాల్లో సెలయేరులో నీరు ఉండదని స్థానికులు చెబుతున్నారు. ఆదుకోవాలి దగ్ధమైన సరుగుడు తోటల రైతులంతా పేదలని..వారిని ప్రభుత్వం ఆదుకోవాలని సర్పంచ్ ఉల్లూరి గోపాలరావు, మండల ఉపాధ్యక్షురాలు రాపాక అరుణకుమారి, ఎంపీటీసీలు కోరారు. మూడేళ్లుగా వ్యయప్రయాసలతో సాగుచేస్తున్న సరుగుడు తోటలు కాలిపోవడంతో రైతులకు తీవ్ర నష్టం జరిగిందని, నాలుగేళ్లకోసారి కోతకు వచ్చే సరుగుడు తోట పెంచేందుకు ఎకరానికి రూ.2 లక్షల ఖర్చు అవుతోందని రైతు నాయకులు చెప్పారు. తోటలు మరో ఏడాదిలో చేతి కొచ్చేవని, పంట కోల్పోయిన రైతులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రమాద రైతులను పరామర్శించారు.