ఆస్పత్రిలో ‘కరోనా రోగి శృంగారం’పై మీ సమాధానం.. షాక్‌కు గురైన ప్రధాని | New Zealand PM Jacinda Ardern Disappointed On Hospital Incident | Sakshi
Sakshi News home page

ఆస్పత్రిలో కరోనా రోగి శృంగారం.. షాక్‌కు గురయిన మహిళా ప్రధాని

Published Fri, Sep 10 2021 6:13 PM | Last Updated on Fri, Sep 10 2021 6:58 PM

Australia PM Jacinda Ardern Disappointed On Hospital Incident - Sakshi

ఆక్లాండ్‌: మహమ్మారి కరోనా వైరస్‌ను న్యూజిలాండ్‌ సమర్ధవంతంగా ఎదుర్కొని పారదోలింది. ప్రస్తుతం ఆ దేశంలో కరోనా విజృంభణ తగ్గిపోయింది. కరోనా కట్టడి చర్యలు పటిష్టంగా అమలు కావడంతో ఆ దేశంలో మహమ్మారి కనుమరుగవుతోంది. ప్రస్తుతం కరోనా రహిత దేశంగా అడుగులు వేస్తోంది. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి జసిండా ఆర్డర్న్‌పై ప్రశంసలు కురుస్తున్నాయి. ఆమె పనితీరును అందరూ మెచ్చుకుంటున్నారు. ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూకు హాజరవగా ఆమెకు ఊహించని ప్రశ్న ఎదురైంది. ఆ ప్రశ్న వినడంతోనే ఆమె ఆశ్చర్యం వ్యక్తం చేసింది. కొద్దిసేపు ఆగింది.. అనంతరం దీటుగా జవాబిచ్చారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి..
చదవండి: సెక్యూరిటీ గార్డే డాక్టరైండు.. పేషెంట్‌కు ఇంజెక్షన్‌

ఆరోగ్య శాఖ డ్రైరెక్టర్‌ జనరల్‌ ఆష్లే బ్లూమ్‌ ఫీల్డ్‌తో కలిసి ఇటీవల ఓ సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా విలేకరులు ప్రశ్నలు అడుగుతున్నారు. ఈ క్రమంలో ఓ మహిళా విలేకరి ‘ఆక్లాండ్‌లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఓ కరోనా బాధితుడిని పరామర్శించేందుకు వచ్చిన మహిళా శృంగారంలో పాల్గొన్నదనే వార్తలు వచ్చాయి. ఇది అత్యంత ప్రమాదకరం కాదా?’ అని ప్రశ్నించారు. ఆ ప్రశ్న విని ప్రధాని జసిండా అవాక్కయ్యారు. కొన్ని సెకన్ల అనంతరం తేరుకుని ‘కరోనా పరిస్థితుల్లోనే కాదు.. సాధారణ రోజుల్లో కూడా ఆస్పత్రిలో అలాంటి కార్యకలాపాలకు పాల్పడకూడదు’ అని ప్రధాని సమాధానమిచ్చారు. పక్కన ఉన్న ఆరోగ్య శాఖ డైరెక్టర్‌ ఆష్లే కూడా ఈ ప్రశ్న విని అవాక్కయ్యాడు.
చదవండి: భిక్షమెత్తుకుంటున్న మాజీ ముఖ్యమంత్రి మరదలు
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement