ఆక్‌లాండ్: పాపం న్యూజిలాండ్ ప్రధాని జెసిండా ఆర్డెర్న్‌కు పెళ్లి చేసుకుందామంటే సమయమే దొరకడం లేదట. గత రెండేళ్లుగా ఆమె పెళ్లి వాయిదా పడుతూ వస్తుంది. ఈ క్రమంలో ఈ ఏడాది ఎట్టి పరిస్థితుల్లో వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు జెసిండా. ఈ వేసవిలో పెళ్లికి సిద్ధమవతున్నారట ప్రధాని. అయితే డేట్, టైం ఇంకా ఫిక్స్ చేయలేదని స్థానిక మీడియా తెలిపింది. జెసిండా కోస్ట్ రేడియోతో మాట్లాడుతూ.. ‘‘ఇప్పటికి నాకు టైం దొరికింది. ఈ వేసవిలో నేను, నా భాగస్వామి క్లార్కే గేఫోర్డ్ వివాహం చేసుకోవాలని భావిస్తున్నాం. టైం, డేట్ ఇంకా ఫిక్స్ చేయలేదు. ఎవరికి చెప్పకుండా వివాహం చేసుకోవాలని మేం కోరుకోవడం లేదు. కొద్ది మందిని తప్పక ఆహ్వానిస్తాం’’ అని ప్రధాని తెలిపినట్లు మీడియా వెల్లడించింది.
ఇక జెసిండా ఆర్డెర్న్(40)కు, క్లార్కే(44)కు 2019లో నిశ్చితార్థం అయ్యింది. ఆ ఏడాది ఈస్టర్ సెలవుల్లో వీరు ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు. ప్రస్తుతం వీరికి రెండు సంవత్సరాల కుమార్తె ఉంది. అయితే ఇప్పటి వరకు వీరు వివాహం చేసుకోలేదు. పలు కారణాల వల్ల వీరి పెళ్లి వాయిదా పడుతూ వస్తుంది. ఈ నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో ఈ వేసవిలో వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు జెసిండా. దక్షిణార్థగోళంలో డిసెంబర్ నుంచి ఫిబ్రవరి నెలల్లో వేసవి ఉంటుంది. ఆ సమయంలో వివాహం చేసుకోవాలని జెసిండా నిర్ణయించుకున్నారు. ఇక సంప్రాదాయబద్దంగా తన పెళ్లి జరగదని జెసిండా తెలిపారు. అలా చేయడం తనకు ఇష్టం లేదని జెసిండా వెల్లడించినట్లు మీడియా ప్రచురించింది.
ఇక జెసిండా 2017లో న్యూజిలాండ్ ప్రధానిగా ఎన్నికయ్యారు. గతేడాది అక్టోబర్‌లో తిరిగి మరోసారి ప్రధాని పీఠం చేజిక్కుంచుకున్నారు. ప్రధానిగా ఉన్న సమయంలో బిడ్డకు జన్మనిచ్చారు జెసిండా. ఇక కోవిడ్‌ను కంట్రోల్ చేయడంలో జెసిండా ప్రపంచదేశాధ్యక్షులకు స్ఫూర్తిగా నిలిచారు.
Comments
Please login to add a commentAdd a comment