ప్రతీకాత్మక చిత్రం
దాదాపు కనుమరుగు అయ్యిందనుకుంటున్న పోలియో వైరస్.. కొత్త వేరియెంట్ రూపంలో మళ్లీ తెర మీదకు వచ్చింది. పోలియో వైరస్‌లో వీడీపీవీ2 రకాన్ని గుర్తించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ అధికారికంగా ప్రకటించింది. అయితే..
ఇందుకు సంబంధించిన కేసులేవీ అధికారికంగా నమోదు కావడం భారీ ఊరట ఇచ్చే అంశం. లండన్‌లోని మురుగు నీటి నమునాలో ఈ కొత్త వేరియెంట్‌ను గుర్తించినట్లు డబ్ల్యూహెచ్‌వో ప్రకటించింది. టీకాల నుండి తీసుకోబడిన ఈ రకమైన పోలియోవైరస్ టైప్‌ను గుర్తించామని బ్రిటిష్ ఆరోగ్య ప్రతినిధులు సైతం బుధవారం ధృవీకరించారు.
ప్రస్తుతానికి ఈ వేరియెంట్ బారిన పడినట్లు ఏ కేసు నమోదు కాలేదని, ఈ వేరియెంట్‌పై మరింత విశ్లేషణ జరుగుతోందని బ్రిటిష్ ప్రతినిధులు తెలిపారు. ‘‘వైరస్.. పర్యావరణ నమూనాల నుండి మాత్రమే వేరు చేయబడింది. కానీ, పక్షవాతం యొక్క సంబంధిత కేసులు ఏవీ కనుగొనబడలేదు అని ఒక ప్రకటనలో పేర్కొంది డబ్ల్యూహెచ్‌వో. అయితే పోలియో వైరస్ ఏ టైప్, వేరియెంట్‌లో, ఏ రూపంలో ఉన్నా.. పిల్లలకు ప్రమాదమేన’’ని హెచ్చరించింది.
పోలియోను అరికట్టేందుకు దశాబ్దాలుగా ప్రపంచ దేశాలు ఎంతో కృషి చేస్తున్నాయి. 1988 సంవత్సరంతో పోలిస్తే.. ప్రస్తుత కాలంలో 99 శాతం కేసులు తగ్గాయి. దాదాపు 125 దేశాల్లో.. 3,50,000 కేసులు మాత్రమే గుర్తించబడ్డాయి. ప్రమాదకరమైన పోలియో వైరస్ అఫ్గనిస్తాన్, పాకిస్తాన్‌లో మాత్రం ఇంకా మనుగడలో ఉంది.
ఇక భారత దేశం పోలియో రహిత దేశమని ప్రపంచ ఆరోగ్య సంస్థ 2014లో ప్రకటించింది. కానీ ఈ మధ్యే కోల్‌కతాలో పోలియో వైరస్ నూతన రూపాంతరాన్ని గుర్తించారు. యునిసెఫ్ (UNICEF)తో కలిసి నిర్వహించిన అధ్యయనంలో పోలియో వైరస్ రూపాంతరం బయటపడింది. పశ్చిమ బెంగాల్‌లో చివరిసారిగా.. హౌరాలో 2011లో పన్నెండేళ్ళ బాలికకు పోలియో వైరస్ సోకినట్లు గుర్తించారు. ఆ తర్వాత UNICEFతో కలిసి రాష్ట్ర ఆరోగ్య శాఖ నిర్వహించిన అధ్యయనాల్లో తాజాగా ఈ వైరస్ రూపాంతరం కనిపించింది.
వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్న బాలలపై ప్రత్యేక శ్రద్ధ చూపించడం, టీకాలు వేయించడం.. పోలియో బారిన పడకుండా పిల్లల్ని కాపాడుకునే మార్గాలు.
Comments
Please login to add a commentAdd a comment