టెలీఅవీవ్: ధాని మోదీకి ఇజ్రాయెల్‌లో అరుదైన గౌరవం లభించింది. ఆ దేశ పార్లమెంటు మోదీకి ఘన స్వాగతం పలికింది. కాగా ఈ రోజు ప్రధాని మోదీ రెండురోజుల పర్యటనకు ఇజ్రాయెల్ వెళ్లారు. ఈ సందర్భంగా ఆ దేశ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహు, ఆయన సతీమణి సారా నెతన్యాహుతో కలిసి ప్రధాని మోదీకి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం మోదీ ఇజ్రాయెల్ పార్లమెంటులో ప్రసంగించారు.
ఇజ్రాయెల్ పార్లమెంటులో మోదీ మాట్లాడుతూ "ఇజ్రాయెల్ భారత్‌కు నిజమైన స్నేహితుడు, కష్టకాలంలో భారత్‌కు అండగా నిలిచారు. ఉగ్రవాదంపై పోరులో ఇజ్రాయెల్ మాకు భాగస్వామి. ఇక్కడ పర్యటించడం సంతోషంగా ఉంది. ఇజ్రాయెల్- భారత్ ప్రాచీన నాగరికత ఉన్న దేశాలు. రెండు దేశాలు తీవ్రవాదం కారణంగా కష్టాలు పడుతున్నాయి. ఇక్కడి పార్లమెంటులో ప్రసంగించడం గౌరవంగా భావిస్తున్నా", అని అన్నారు.
అనంతరం ఆ దేశ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహు మాట్లాడుతూ "ప్రపంచ దేశాల్లో మోదీ గొప్ప నాయకుడు. మోదీ ఇజ్రాయోల్ పర్యటన ఎంతో సంతోషదాయకం. మోదీ నాకు స్నేహితుడి కంటే ఎక్కువ నా సోదరుడి లాంటి వాడు." అని నెతన్యాహు అన్నారు. భారత్‌ని మోదీ వేగవంతంగా అభివృద్ధి చేస్తున్నారని ఆయన కాలంలో వాణిజ్య ఒప్పందాలు రెట్టింపు అయ్యాయన్నారు. భారత ప్రధాని 2 రోజుల పాటు ఇజ్రాయెల్‌లో పర్యటించనున్నారు. ఇరు దేశాలు రక్షణకు సంబంధించిన పలు కీలక ఒప్పందాలు చేసుకోనున్నట్లు సమాచారం.
ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం చేయడమే లక్ష్యంగా భారత ప్రధాని మోదీ బుధవారం నుంచి రెండ్రోజులపాటు ఇజ్రాయెల్‌లో పర్యటించనున్నారు.‘‘ పరస్పర ప్రజాస్వామ్య దేశాల మధ్య బలమైన భాగస్వామ్యం, సమష్టి దార్శనికతల సుసాధ్యమే లక్ష్యంగా, ఉమ్మడి సవాళ్ల పరిష్కారమే ధ్యేయంగా, ఇరుదేశాలు సుదృఢ, సుదీర్ఘకాల వ్యూహాత్మక సంబంధాలను సమున్నత స్థాయికి తీసుకుపోయే ఉద్దేశంతో మోదీ, నెతన్యాహూలు చర్చలు జరుపుతారు’’ అని భారత విదేశాంగ శాఖ ఇదివరకే ప్రకటన విడుదల చేసింది. అనంతరం రణక్షేత్రంగా మారిన గాజా అంశం సైతం ఇరు దేశాధినేతలు చర్చించనున్నట్లు తెలుస్తోంది.
పర్యటనలో భాగంగా మోదీ అక్కడి పార్లమెంట్‌లో ప్రసంగించనున్నారు. మరోవైపు ఇరాన్- అమెరికా ఉద్రిక్తల వేళ పశ్చిమాసియాలో మోదీ పర్యటించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ రోజు (బుధవారం) రాత్రి మోదీకి, నెతన్యాహూ ప్రత్యేక ప్రైవేట్ విందు ఇవ్వనున్నారు. ప్రధానిగా మోదీ బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి ఇజ్రాయిల్‌లో పర్యటించడం ఇది రెండోసారి.


#WATCH | Tel Aviv: PM Narendra Modi arrives in Israel.
Israeli Prime Minister Benjamin Netanyahu, along with his wife Sara Netanyahu, receive him at the airport
(Source: Reuters) pic.twitter.com/BStw87lujA— ANI (@ANI) February 25, 2026



