Russia Said US Recognize That Territories Vladimir Putin Ready To Talk - Sakshi
Sakshi News home page

అందుకు అమెరికా ఒప్పుకుంటే చర్చలకు రెడీ!...భారీ ట్విస్ట్‌ ఇచ్చిన పుతిన్‌

Published Fri, Dec 2 2022 4:40 PM | Last Updated on Sat, Dec 3 2022 2:10 PM

Russia Said US Recognise That Territories Vladimir Putin Ready To Talk - Sakshi

ఉక్రెయిన్‌పై దురాక్రమణకు దిగిన రష్యాని ఎంతమంది చర్చల ద్వారా సమస్యని పరిష్కరించుకోమని సలహ ఇచ్చిన అందుకు అంగీకరించలేదు. కానీ ఇప్పుడూ అనుహ్యంగా తాము చర్చలకు సిద్ధం అంటూ అనుహ్యంగా ముందుకు వచ్చారు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌. అదీగాక ఇటీవల అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఇప్పట్లో రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో చర్చించే ప్రసక్తి లేదని తేల్చి చెప్పేశాక అనుహ్యంగా పుతిన్‌ చర్చలకు తెరతీయడం అందర్నీ షాక్‌కి గురి చేసింది.

ఇరు దేశాలవైపు భారీ మొత్తంలో సైనికులు నేలకొరిగి, జరగాల్సిన తీవ్ర నష్టం చవిచూశాక రష్యా అధ్యక్షుడు ఇలా అనడంలో ఆంతర్యం తెలియదు గానీ అందర్నీ మాత్రం ఆశ్చర్యానికి గురిచేసింది. ఐతే పుతిన్‌ చర్చలకు సిద్ధం అంటూనే మరో ట్విస్ట్‌ ఇచ్చాడు. ఉక్రెయిన్‌లో రష్యా తన సొంతమని చెప్పుకుంటున్న భూభాగాలను అమెరికా గుర్తించాలి అని ఒక షరతు పెట్టాడు.

అమెరికా అందుకు అంగీకరిస్తానే తాను యుద్ధ ప్రాతికన చర్చలకు సిద్ధం అని పుతిన్‌ స్పష్టం చేశారు. ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని ముగించేందుకు రష్యా ఆసక్తి చూపితే తాను పుతిన్‌తో మాట్లేడేందుకు సిద్దం అని చెప్పారు కూడా మెరికా అధ్యక్షుడు బైడెన్‌ . అయితే బైడెన్‌ నాటో మిత్ర దేశాలతో సంప్రదింపులు జరిపిన తర్వాతే తన నిర్ణయం ఉంటుందని చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement