నల్ల సముద్రం దగ్గర ఒక గ్రామాన్ని కొన్నివారాల కింద రష్యా సైనికులు చేజిక్కించుకున్న సమయంలో వారితో ఓ కుక్క ఉంది. బెల్జియన్ మాలినోయిస్ జాతికి చెందిన ఆ కుక్క పేరు మాక్స్. అయితే రష్యా సైనికులు వెనక్కి తగ్గి ఆ గ్రామం నుంచి వెళ్లిపోయినప్పుడు మాక్స్‌ను అక్కడే వదిలేశారు. దీంతో కొన్ని రోజులుగా తిండిలేక అది చాలా నీరసించిపోయింది. చుట్టుపక్కల దొరికే కొద్దిపాటి కుళ్లిన ఆహారం తింటూ ప్రాణం కాపాడుకుంది.
ఇక చనిపోయే స్థితికి చేరుకున్న సమయంలో ఆ కుక్కను మైకోలైవ్ ప్రాంతానికి చెందిన ఉక్రెయిన్ సైనికులు చూశారు. చేరదీసి చికిత్స చేశారు. దీంతో ఉక్రెయిన్ సైనికులపై మాక్స్ విశ్వాసం చూపింది. ఇప్పుడది వాళ్లు చెప్పినట్టు వింటోంది. వాళ్ల ఆదేశాలను అర్థం చేసుకుంటోంది. బాంబులను పసిగట్టి సాయం చేస్తోంది. నేషనల్ గార్డ్ ఆఫ్ ఉక్రెయిన్ తన ఫేస్‌బుక్ పేజీలో ‘మాక్స్’ కథను పోస్ట్ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment