America: Several Dead in Shooting at Shopping Mall in Indiana city - Sakshi
Sakshi News home page

America Indiana City: ఇండియానా షాపింగ్‌ మాల్‌లో కాల్పులు.. ముగ్గురి మృతి.. దుండగుడి హతం

Published Mon, Jul 18 2022 7:22 AM | Last Updated on Mon, Jul 18 2022 8:37 AM

Several Dead in Shooting at Shopping Mall in America Indiana city - Sakshi

వాషింగ్టన్‌: అమెరికాలో మరోమారు కాల్పులు కలకలం సృష్టించాయి. ఇండియానా ప్రాంతంలోని ఓ షాపింగ్‌ మాల్‌లో ఆదివారం సాయంత్రం చొరబడిన దుండగుడు కాల్పులకు పాల్పడ్డాడు. ఈ దుర్ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వేగంగా స్పందించిన పోలీసులు.. సంఘటనా స్థలానికి చేరుకుని దుండగుడిని మట్టుబెట్టారు. 

'గ్రీన్‌వుడ్‌ పార్క్‌ మాల్‌లో ఆదివారం సాయంత్రం భారీస్థాయిలో కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా.. మరో ముగ్గురు గాయపడ్డారు. పోలీసులు జరిపిన కాల్పుల్లో దుండగుడు హతమయ్యాడు.' అని గ్రీన్‌వుడ్‌ మేయర్‌ మార్క్‌ మయేర్స్ తెలిపారు. మరోవైపు.. ఈ కాల్పులను చూసిన వారు తమకు సమాచారం ఇవ్వాలని ఫేస్‌బుక్‌ ద్వారా కోరారు గ్రీన్‌వుడ్‌ పోలీసులు. అమెరికాలో ఇటీవల కాల్పుల ఘటనలు పెరిగాయి. కాల్పుల కారణంగా ఏడాదికి సుమారు 40వేల మరణాలు సంభవిస్తున్నట్లు పలు నివేదికలు చెబుతున్నాయి. 

ఇదీ చదవండి: రష్యా దాడిలో చిన్నారి మృతి.. మిన్నంటిన తండ్రి రోదనలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement