Indiana City
-
Indiana: షాపింగ్ మాల్లో కాల్పులు.. ముగ్గురి మృతి
వాషింగ్టన్: అమెరికాలో మరోమారు కాల్పులు కలకలం సృష్టించాయి. ఇండియానా ప్రాంతంలోని ఓ షాపింగ్ మాల్లో ఆదివారం సాయంత్రం చొరబడిన దుండగుడు కాల్పులకు పాల్పడ్డాడు. ఈ దుర్ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వేగంగా స్పందించిన పోలీసులు.. సంఘటనా స్థలానికి చేరుకుని దుండగుడిని మట్టుబెట్టారు. 'గ్రీన్వుడ్ పార్క్ మాల్లో ఆదివారం సాయంత్రం భారీస్థాయిలో కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా.. మరో ముగ్గురు గాయపడ్డారు. పోలీసులు జరిపిన కాల్పుల్లో దుండగుడు హతమయ్యాడు.' అని గ్రీన్వుడ్ మేయర్ మార్క్ మయేర్స్ తెలిపారు. మరోవైపు.. ఈ కాల్పులను చూసిన వారు తమకు సమాచారం ఇవ్వాలని ఫేస్బుక్ ద్వారా కోరారు గ్రీన్వుడ్ పోలీసులు. అమెరికాలో ఇటీవల కాల్పుల ఘటనలు పెరిగాయి. కాల్పుల కారణంగా ఏడాదికి సుమారు 40వేల మరణాలు సంభవిస్తున్నట్లు పలు నివేదికలు చెబుతున్నాయి. ఇదీ చదవండి: రష్యా దాడిలో చిన్నారి మృతి.. మిన్నంటిన తండ్రి రోదనలు -
విమాన ప్రమాదంలో ముగ్గురి మృతి
వాషింగ్టన్ : విమాన ప్రమాదంలో ముగ్గురు మృతిచెందిన సంఘటన అమెరికాలోని ఇండియానా రాష్ట్రం మిడ్వెస్ర్టన్లో జరిగింది. విమానం మిస్సౌరీలోని కాన్సాన్ నగరం నుంచి మేరీలాండ్లోని ఫ్రెడరిక్కు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఈఘటనలో ముగ్గురు వ్యక్తులతో పాటు ఓ శునకం కూడా చనిపోయింది. మరో శునకం అదృష్టవశాత్తూ గాయాలతో బయటపడింది. ఆ శునకాన్ని పోలీసు అధికారులు దగ్గరలోని వెటర్నరీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల వివరాలను పోలీసు అధికారులు ఇంకా వెల్లడించలేదు. ప్రమాదానికి గురైన విమానానికి ఒక ఇంజిన్ మాత్రమే ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు చెప్పారు. -
అమెరికాలో ఇద్దరు భారతీయుల కాల్చివేత
అమెరికాలో ఇద్దరు భారతీయులను కాల్చిచంపారు. మృతులు జగ్తర్ భట్టి(55), పవన్ సింగ్(20)గా గురించారు. ఉత్తర ఇండియానా నగరంలోని మిడిల్బరీ స్ట్రీట్లో ఈ సంఘటన జరిగింది. 400 బ్లాకులు ఉన్న కన్వీనియన్స్ స్టోర్లో ఈ ఘాతుకం చోటుచేసుకుంది. ముసుగు ధరించి వచ్చిన ఇద్దరు దుండగులు వారిని కాల్చిచంపినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ జంట హత్యలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అసలేం జరిగిందో పోలీసుల నుంచి తెలుసుకునేందుకు మృతుల కుటుంబ సభ్యులు, సన్నిహిత ప్రయత్నిస్తున్నట్టు స్థానిక మీడియా పేర్కొంది. అయితే దుండగుల కాల్పుల్లో మృతి చెందిన భట్టి, పవన్ అందరితో ఎంతో స్నేహంగా మెలిగేవారని పొరుగున ఉంటున్న ఓ మహిళ తెలిపింది. తనను సొంత కుటుంబ సభ్యురాలిగా భావించేవారని వెల్లడించింది.