సాధారణంగా అందరి చేతికి అయిదు వేళ్లు ఉంటే కొంతమందికి ఆరు వేళ్లు ఉంటాయి. ఇంకా చెప్పాలంటే వేళ్ల సైజులలో కాస్తా అటుఇటుగా కూడా ఉండొచ్చు. మరి అవి ఏ కలర్‌లో ఉంటాయి.. ఎవరూ ఏ రంగులో ఉంటే దాదాపు వేళ్లు అదే రంగులో ఉంటాయని అనుకుంటున్నారా.. అవును ప్రత్యేకంగా వాటికంటూ ఒక రంగు ఏమీ ఉండదు కదా. ఇప్పటి వరకు అలాగే అనుకున్నాం. కానీ ఓ మహిళ వేళ్లు చూశాకా ఈ అభిప్రాయం మార్చుకోవచ్చు. ఎవరికి చూడని వింతంగా మహిళ చేతి రెండు వేళ్లు అప్పుడప్పుడు తెల్లగా మారుతుంటాయి. ఇందుకు ఓ కారణం కూడా ఉంది.
మోనికా అనే మహిళ రేనాడ్స్ సిండ్రోమ్ అనే ఆరోగ్య సమస్యతో బాధపడుతోంది. ఇది రక్తనాళాలపై అరుదుగా ప్రభావం చూపుతుంది. చేతి వేళ్ళ రక్త ప్రసారం చేసే నాళాలు చాలా సన్నగా ఉండటంతో రక్త ప్రసరణ సరిగా అందకపోవడం వల్ల చేతి లేదా కాలి వేళ్లు ఇలా తెల్లగా మారుతాయట. అయితే మోనికాకు చలిగా అనిపించినప్పుడు, ఏదైనా ఒత్తిడికి గురైనప్పుడల్లా వేళ్లు పూర్తిగా తెల్లగా వైట్‌గా మారుతాయి. ఈ విషయాన్ని ఆమె కూతురు జూలీ సోషల్ మీడియాలో పంచుకున్నారు. ప్రస్తుతం ఇది నెట్టింట్లో వైరలవుతోంది.
మొదట ఎప్పుడో ఒకసారి ఇలా మారితో ప్రస్తుతం ఆమె వేళ్లు పూర్తిగా మొద్దుబారాయిని తెలిపారు. జనవరిలో అయితే వేళ్ళు మరింత తెల్లగా ఉంటాయని , తిరిగి మామూలు రంగులోకి వచ్చిన సమయంలో మరింత నొప్పిగా ఉంటాయని తెలిపారు. అయితే దీనికి ఏ వైద్యం లేదని వైద్యులు చెప్తున్నారు. ఆమె చేతి నరాల్లో ఉన్న సమస్య కారణంగానే అలాంటి పరిస్థితి ఉంటుందని వైద్యులు తెలిపారు.
చదవండి:
మే 2న ఎన్నికల కౌంటింగ్‌పై ఈసీ కీలక నిర్ణయం
మాస్క్‌లాగా పెయింటింగ్.. దిమ్మతిరిగే షాకిచ్చిన అధికారులు
Comments
Please login to add a commentAdd a comment