ఇస్లామాబాద్: పాకిస్తాన్‌కు చెందిన ఇద్దరు యువతులు తమ మేనేజర్‌పై ప్రవర్తించిన తీరు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మేనేజర్ మాట్లాడిన ఇంగ్లీష పదాలను అవహేళన చేస్తూ సదరు మహిళలు చేసిన కామెంట్స్‌పై నెటిజన్లు మండిపడుతున్నారు. అసలు విషయంలోకి వస్తే.. ఉజ్మా, దియా అనే ఇద్దరు యువతులు ఇస్లామాబాద్‌లో కన్నోలి కేఫ్ ఆఫ్ సోల్‌కు ఓనర్స్‌గా వ్యవహరిస్తున్నారు. కాగా గురువారం బోర్ కొడుతుందని కేఫ్‌కు వచ్చిన వీరిద్దరు ఒక టేబుల్‌పై కూర్చొని హోటల్ మేనేజర్ ఒవైస్‌ను పిలిచి స్టాఫ్‌ను పరిచయం చేయాలని చెప్పారు.
అయితే దియా.. ఒవైస్ మీరు ఇక్కడ ఎంతకాలం నుంచి పనిచేస్తున్నారని ఇంగ్లీష్‌లో అడిగింది.. దానికి ఒవైస్ 9 సంవత్సారాలు అని చెప్పాడు. అతని ఇంగ్లీష్‌లో తేడా గమనించిన దియా.. మీరు ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఎన్ని క్లాసులు తీసుకున్నారు. ఇంగ్లీష్ నేర్చుకోవడానికి తాను మూడు కోర్సులు చదివానని ఒవైస్ సమాధానమిచ్చాడు. వెంటనే ఉజ్మా అందుకుంటూ.. మరి మీరు ఇంగ్లీష్‌లో మాట్లాడడానికి ప్రయత్నించండి అని తెలిపారు.చదవండి: సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రెస్టారెంట్
ఒవైస్ ఇంగ్లీష్ మాట్లాడుతుండగానే దియా.. ఉజ్మాలు గట్టిగా నవ్వుతూ..'గుర్తుంచుకోండి.. ఈయనే మా మేనేజర్. అతను మాట్లాడే అందమైన ఇంగ్లీష్ ఇదే. దానికి మేము మంచి జీతం చెల్లిస్తున్నాం అంటూ' ఒవైస్‌ను చులకన చేస్తూ మాట్లాడారు. అయితే దీనిని వీడియో తీసిన జర్నలిస్ట్ రాజా అహ్మద్ రుమీ ట్విటర్‌లో షేర్ చేశారు. 'ఇది చాలా విచారకరమైన విషయం. పెత్తదారుతనం.. పనివాళ్లపై యజయాని చులకన భావం.. వివక్ష ఇలా అన్ని నాకు ఒకే ఫ్రేములో కనిపించాయి. వాస్తవానికి ఇక్కడ అసలైన హీరో మేనేజర్ .. ఇంగ్లీష్ నేర్చుకోవాలన్న అతని కృషి, అంకితభావం, పట్టుదలకు ఇదే నా సలాం! అంటూ 'క్యాప్షన్ జత చేశాడు. మేనేజర్‌పై యువతులు వ్యవహరించిన తీరు నెటిజన్లకు కోపం తెప్పించింది. తమ కేఫ్‌లో పనిచేసే మేనేజర్‌పై మహిళలు ఇద్దరు ఇలా ప్రవర్తించడం సిగ్గుచేటని కామెంట్లు పెడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment