ఆర్థిక, ఆహార సంక్షోభం కారణంగా శ్రీలంక అల్లాడుతున్న సంగతి తెలిసిందే. అయితే అక్కడి పరిస్థితులు రోజురోజూకి మరింత క్లిష్టంగా మారుతోంది. గతంలో దేశాధినేతలు తీసుకున్న నిర్ణయాల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో ప్రజలకు నిత్యావసరాల కొరత ఏర్పడడంతో లంక ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమాల నేపధ్యాన సమస్యకు పరిష్కారం దిశగా ప్రభుత్వం అడుగు వేయకలేకపోతోంది. తాజాగా శ్రీలంక ఆర్థిక మంత్రి అలీ సబ్రీ.. ఈ సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు ఓ మార్గం ఉన్నట్లు సూచించారు.
అప్పుడే ఔషదాల, ఇంధనం, నిత్యావసరాల వంటి అత్యవసర వస్తువులను సరఫరా చేయగలమని, పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేయగలమని అన్నారు. దేశంలో జరుగుతున్న పరిణామాల కారణంగా నిరసనకారులను వీధుల్లోకి వచ్చి అధ్యక్షుడు గోటబయ రాజపక్సే ప్రభుత్వంపై ఒత్తిడిని పెంచుతున్నారు. 22 మిలియన్ల జనాభా కలిగిన ద్వీప దేశం చాల కాలం నుంచి విద్యుత్ కోతలు, మందులు, ఇంధనం, ఇతర వస్తువుల కొరతతో తీవ్ర ఇబ్బందుల్లో ఉంది.
ఆర్థిక మంత్రిగా బాధ్యతుల చేప్టటిన తర్వాత అలీ సబ్రీ తొలిసారిగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. ప్రస్తుతం శ్రీలంక తీవ్రమైన సంక్షభంలో ఉంది. ఈ క్లిష్ట పరిస్థితి నుంచి కొంచెమైనా బయటపడాలంటే 3 బిలియన్ డాలర్ల ఆర్థిక సాయం అవసరమని, అయితే ఈ మొత్తం అనుకున్నంత సులవు కాదని అన్నారు. ఈ నెలలో ప్రభుత్వం అంతర్జాతీయ ద్రవ్య నిధితో ఈ సమస్యపై చర్చిందేకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. అంతేకాకుండా ఇతర దేశాల నుంచి ఆర్థిక సహాయం తీసుకోవాలని భావిస్తున్నట్లు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment