యుద్ధంలోకి నేరుగా గల్ఫ్‌ దేశం? | UAE straight into war | Sakshi
Sakshi News home page

యుద్ధంలోకి నేరుగా గల్ఫ్‌ దేశం?

Apr 1 2026 10:53 PM | Updated on Apr 2 2026 9:09 AM

UAE straight into war

మధ్యప్రాచ్యంలో మరో కీలక పరిమాణం చోటు చేసుకోనుంది. అమెరికా, ఇజ్రాయెల్‌కు మద్దతుగా గల్ఫ్ దేశం నేరుగా యుద్ధంలోకి దిగడానికి రంగం సిద్ధం చేసుకుంది. హార్మూజ్ జలసంధిపై మూసివేతతో వాణిజ్య సంక్షోభ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో  యుఏఈ నేరుగా యుద్ధంలోకి దిగేలా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.

ప్రపంచ చమురు సరఫరాలో 20 శాతం వాటా కలిగిన అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధిని ఇరాన్ తన ఆధీనంలోకి తీసుకుని మూసివేయడంతో ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం ఏర్పడింది. పలు దేశాలకు ఎగుమతులు నిలిచిపోయి ఇబ్బందికర పరిస్థితులు తలెత్తాయి. దీంతో ప్రపంచ దేశాలు అమెరికాకు మద్దతుగా నిలవాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కోరారు.

ఈ నేపథ్యంలో హార్మూజ్ జలసంధిని తెరిపించడానికి అమెరికాతో పాటు  ఇతర మిత్రదేశాలతో కలిసి సైనిక చర్య చేపట్టాలని UAE నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో తీర్మానం ప్రవేశపెట్టాలని బహ్రెయిన్‌తో కలిసి యూఏఈ పావులు కదుపుతోన్నట్లు వాల్‌స్ట్రీట్ జనరల్ కథనం పేర్కొంది.

హార్ముజ్ జలసంధిలో ఇరాన్ అమర్చిన మైన్లను  తొలగించడంతో పాటు  అక్కడ సైనిక పహారా కాయడానికి ప్రత్యేక బలగాలను మోహరించనున్నట్లు తెలుస్తోంది. కాగా ఒకవేళ యుఏఈ యుద్ధంలో దిగితే ఆ అమెరికాకు మద్దతుగా యుద్ధంలో పాల్గొన్నమెుదటి గల్ఫ్ దేశంగా నిలుస్తోంది. 

టెహ్రాన్‌ను ఎదుర్కోవడానికి తమ దేశం ముఖ్యమైన దేశాలతో కొత్త పొత్తులను నిర్మిస్తోందని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు చేసిన ప్రకటన తరువాత యూఏఈ యుద్ధంలోకి  దిగుతుందని ప్రచారం జరుగుతుంది. 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement