లండన్: విదేశీ విద్యార్థుల కోసం యూకే ప్రభుత్వం సరికొత్త వీసా నిబంధనలను గురువారం వెల్లడించింది. అయితే సరికొత్త వీసా రావాలంటే కనీసం 70పాయింట్లు పరిమితిని విధించారు. ఈ నేపథ్యంలో మెరిట్ విద్యార్థులకు అవకాశం కల్పించే విధంగా నూతన వీసా విధానం అమలు చేయనున్నట్లు తెలిపారు. అయితే విద్యార్థులు కోర్సు ప్రారంభానికి 6 నెలల ముందే వీసా అప్లికేషన్ ప్రక్రియ ప్రారంభించాలని తెలిపారు.
అయితే గత ఆర్థిక సంవత్సరం 50,000 మంది దేశీయ విద్యార్థులు యూకేలో వీసా పొంది చదువుకున్నట్లు బ్రిటిష్ అధికారులు తెలిపారు. అయితే కోర్సు పూర్తయిన తరువాత కూడా కొందరు విద్యార్థులు అక్రమంగా ఉంటున్నారని, వీసా నిబంధనలు పాటిస్తున్న వారికి ఎలాంటి ఢోకా ఉండదని యూకే వర్గాలు పేర్కొన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment