
వాషింగ్టన్: దక్షిణ చైనా సముద్రం మీద డ్రాగన్ దుందుడుకు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. అమెరికా నిఘా విమానాన్ని చైనా జే–11 యుద్ధ విమానం వెంబడించడం కలకలం సృష్టించింది. గగనతలం నుంచి గగనతలంలో లక్ష్యాలను ఛేదించే క్షిపణులున్న ఈ విమానం పరాసల్ ద్వీప సమూహం దగ్గర అమెరికా పీ–8 పోసీడాన్ విమానాన్ని 21,500 అడుగుల ఎత్తులో వెంబడించింది.
‘‘చైనా గగన తలానికి 12 నాటికల్ మైళ్ల దాకా వచ్చారు. ఇంకా ముందుకొస్తే తీవ్ర పరిణామాలంంటాయి’’ అని హెచ్చరించింది. కాసేపటికే అమెరికా విమానం రెక్కలకు కేవలం కొన్ని వందల అడుగుల దూరం వరకు వెళ్లింది! ఇలా 15 నిమిషాలు వెంబడించాక వెనుదిరిగింది. పరాసల్ ద్వీపాలపై చైనా హక్కులను అమెరికా అంగీకరించడం లేదు. దీనిపై విభేదాలు నెలకొన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment