సంకేతాలిచ్చిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ వాణిజ్య యుద్ధానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే కెనడా, మెక్సికో, చైనాలపై అదనపు టారిఫ్‌లు విధించిన ట్రంప్ ఇప్పుడు యూరోపియన్ యూనియన్ (ఈయూ)పై సుంకాలు విధిస్తానని సంకేతాలు ఇస్తున్నారు. ట్రంప్ సుంకాలు విధిస్తే తాము దీటుగా బదులిస్తామని ఐరోపా సమాఖ్య సైతం కుండబద్దలు కొట్టింది. చర్చల ద్వారా వాణిజ్య సంఘర్షణను నివారించవచ్చని వ్యాఖ్యానించింది.
27 దేశాల కూటమిపై సుంకాల విధింపు అంశాన్ని పరిశీలిస్తున్నారా? అని వైట్‌హౌజ్‌లో ట్రంప్‌ను మీడియా ప్రశ్నించింది.‘‘ దీనికి నిజమైన సమాధానం కావాలా లేక రాజకీయ సమాధానం కావాలా?. ఖచ్చితంగా విధిస్తా’’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. యూరోపియన్ యూనియన్ అమెరికా పట్ల వివక్షాపూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఈయూకు వ్యతిరేకంగా ట్రంప్ గళమెత్తడం ఇది మొదటిసారి కాదు.
వాణిజ్యం విషయంలో అమెరికా పట్ల చాలా అన్యాయంగా వ్యవహరిస్తోందని గతంలోనూ ఆయన ఆరోపించారు. ట్రంప్ తొలిసారిగా అమెరికా అధ్యక్ష పీఠంపై కూర్చున్నప్పుడూ స్టీల్, అల్యూమినియం ఎగుమతులకు సంబంధించి ఈయూపై సుంకాలు విధించారు. దీంతో ఆగ్రహం వ్యక్తంచేసిన ఈయూ కూటమి వెంటనే తగిన రీతిలో స్పందించింది. విస్కీ, మోటార్ సైకిళ్లతో సహా పలు అమెరికా వస్తువులపై టారిఫ్‌లు విధించి ప్రతీకారం తీర్చుకుంది.
ప్రతీకారం తప్పదన్న ఈయూ
కెనడా, మెక్సికో, చైనాలపై అమెరికా టారిఫ్‌లు విధించడాన్ని ఈయూ వ్యతిరేకించింది. ‘‘సుంకాలు అనవసరమైన ఆర్థిక అంతరాయాలను సృష్టిస్తాయి. ద్రవ్యోల్బణాన్ని పెంచుతాయి. అవి రెండు వైపులా ఇబ్బందులను కలగచేస్తాయి. అలాంటిది ఈయూ వస్తువులపైనే అన్యాయంగా లేదా ఏకపక్షంగా సుంకాలు విధించే ఏ వాణిజ్య భాగస్వామికైనా మేం గట్టిగా బదులిస్తాం’’ అని ఈయూ వ్యాఖ్యానించింది.
మెక్సికోపై టారిఫ్ అమలుకు బ్రేక్
మెక్సికో నుంచి దిగుమతి అయ్యే వస్తూత్ప త్తులపై 25 శాతం టారిఫ్ విధిస్తానని ప్రకటించిన అమెరికా అధ్యక్షడు ట్రంప్ ఆఖరి నిమిషంలో తన ఆదేశాల అమలును నిలుపుదల చేశారు. నేటి నుంచి కొత్త టారిఫ్ అమల్లోకి రావాల్సి ఉండగా తన ఉత్తర్వుల అమలును నెల రోజులపాటు వాయిదా వేస్తున్నట్లు సోమ వారం ట్రంప్ ప్రక టించారు. టారిఫ్‌ల అమలు నిలుపుదలపై అమె రికా సర్కార్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షేన్‌బామ్ వెల్ల డించారు. సోమవారం ఆమె ట్రంప్‌తో దాదాపు 45 నిమిషాలు ఫోన్‌లో మంతనాలు జరిపారు.
Comments
Please login to add a commentAdd a comment