సోషల్ మీడియాలో ప్రతిరోజూ రకరకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వీటిలోని కొన్ని వీడియోలను చూస్తే అవి నిజమనే నమ్మకం కలగదు. తాజాగా సోషల్ మీడియాలో వర్షానికి సంబంధించిన అనేక వీడియోలు వైరల్ అవుతున్నాయి. అలాంటి ఒక వీడియో ఇటీవల ట్విట్టర్‌లో షేర్ అయ్యింది.
మెరుపునకు సంబంధించిన అద్భుతమైన దృశ్యం కెమెరాకు చిక్కింది. దీనిని చూస్తే నమ్మాలని అనిపించదు. ఎందుకంటే ఇది యానిమేటెడ్ 3డీ షో మాదిరిగా కనిపిస్తుంది. ఈ 9-సెకన్ల వీడియో ట్విట్టర్‌లో మాసిమో అనే పేజీలో షేర్ అయ్యింది.
ఈ వీడియోలో రాత్రి వేళ పర్వతంపై మెరుపులు కనిపిస్తాయి. కొన్ని సెకన్ల పాటు ఈ పర్వతంపై మెరుపులతో కూడిన కాంతి కనిపిస్తుంది. ఈ పర్వతంపై ఒక మేఘం కనిపిస్తుంది. ఆ మేఘాల మధ్యలో నుంచి మెరుపులు మెరుస్తుంటాయి. ఈ వీడియోలో ఆ మెరుపు అద్భుతమైన లైటింగ్ షోలా కనిపిస్తుంది. ఈ వీడియో చూసిన వారి కళ్లు కూడా మిరిమిట్లు గొలుపుతాయి. ఇప్పటివరకు ఈ వీడియోను 54 వేల మందికి పైగా నెటిజన్లు వీక్షించారు.
వేలాది మంది ఈ వీడియోను రీట్వీట్ చేశారు. కొంతమంది వినియోగదారులు ఇది ప్రకృతి అందించిన ప్రత్యేకమైన దృశ్యమని అంటుండగా, మరికొందరు ఈ వీడియో అద్భుతంగా ఉందంటున్నారు. కాగా కొండ ప్రాంతాలలో రుతుపవనాల సమయంలో భారీ వర్షాలు కురుస్తుంటాయి. మెరుపులు, పిడుగులు వంటి సంఘటనలు సాధారణం. కానీ ఈ మెరుపు మెరుస్తున్న విధానం ఎంతో అద్భుతమని అనిపిస్తుంది.
ఇది కూడా చదవండి: 2012లో ఇంజినీరింగ్ పూర్తి.. 2023లో ఎంబీబీఎస్‌లో అడ్మిషన్.. తీరని కల నెరవేరుతోందిలా..
Have you ever seen such stunning upward lightning?
— Massimo (@Rainmaker1973) August 3, 2023
Probably one of the most impressive lightning show ever
This is Volcan de Agua, Guatemala
[📹 bienesinmueblestv: https://t.co/mAnnM9Hcsi]pic.twitter.com/5DAtCEtuRW
Comments
Please login to add a commentAdd a comment