వార్షాకాలంలో పిడుగు పడటం దగ్గర నుంచి చూడకపోయినా వింటుంటాం. దూరం నుంచైనా సరే ఆ శబ్దం వింటేనే శరీరమంతా వణుకు పుట్టడంతో పాటు భయం కూడా వేస్తుంది. ఇక అదే పిడుగును లైవ్‌లో చూశామంటే చెమటలు పట్టాల్సిందే మరి. అలాంటిది లైవ్ కాకుండా మనం ప్రయాణిస్తున్న వాహనం మీద పిడుగు ప్రతాపం చూపెడితే, సరిగ్గా ఇలాంటి విపత్కర పరిస్థితే ఓ కుటుంబానికి ఎదురైంది. అందుకే అంటారు ఏ నిమిషానకి ఏం జరుగుతుందో ఎవరు కూడా ఊహించలేమని!
ఒక్క సారిగా పెద్ద మెరుపు ఆ కారుని కుదిపేసింది
వివరాల్లోకి వెళితే.. ఇటీవల అమెరికాలోని కాన్సస్‌లో ఓ కుటుంబం కారులో ప్రయాణిస్తున్నారు. చూట్టూ మబ్బులు కమ్మేసి జోరుగా వర్షం కురవడంతో నింపాదిగా వెళ్తున్న వాళ్ల కారుపై అకస్మాత్తగా పిడుగు పడింది. ఆ భీకర శబ్దానికి కారులో ఉన్న ఐదుగురు వణికిపోయారు. ఆ కారులో ముగ్గురు పిల్లలు మూడేండ్ల వయసులోపు ఉన్నవారే. అదృష్టవశాత్తు అందులో ఉన్న ఐదుగురు క్షేమంగా బయటపడ్డారు. ఎలాంటి ప్రాణపాయం జరగకపోవడంతో ఆ కుటుంబం ఊపిరి పీల్చుకుంది. ఇదంతా ఆ కారు వెనుకాలే ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి.. ఆ పిడుగు పడటాన్ని చిత్రీకరించి సోషల్‌మీడియాలో షేర్ చేశాడు. కాగా ఈ ఘటన జూన్ 25న చోటు చేసుకోగా.. ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారి హల్ చల్ చేస్తోంది. అంత పెద్ద పిడుగు పడినప్పటికీ కారులోని పిల్లలకు ఏ ప్రమాదం జరగకపోయేసరికి ‘యూ ఆర్ లక్కీ’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment