
పుట్టినరోజు అంటేనే కేక్ కటింగ్, ఈ తంతు ముగియగానే ఇష్టమైన వారు కానుకలు సమర్పించుకుంటారు. అయితే ఈ రెండూ ఒకేసారి చేస్తే ఎలా ఉంటుంది? అచ్చంగా ఇక్కడ చెప్పినట్లుగా కనిపిస్తుంది. ఓ తండ్రి పుట్టినరోజు సెలబ్రేషన్స్ కోసం అతని కుటుంబం కేక్ సిద్ధం చేసింది. అయితే కేక్ కట్ చేయనివ్వలేదు. ఎందుకంటే ఆ కేక్‌లోనే అసలు సిసలైన గిఫ్ట్ ఉంది. దీంతో కేక్ పైన ఉన్న హ్యాపీ బర్త్‌డే టాపర్‌ను బయటకు తీస్తుండగా దాని చివరన నోట్ల కట్టలు కనిపించాయి. లాగుతూ ఉన్నంత సేపు అవి వస్తూనే ఉన్నాయి. ఆ డాలర్ల కట్టలు కేకులో తడవకుండా ఉండేందుకు ప్లాస్టిక్ కవర్‌లో పెట్టారు. ఇక ఈ నోట్ల కట్టలను తీస్తున్న ఆ తండ్రి ఆనందం చెప్పనలవి కాదు. చిన్నపిల్లాడిలా గంతులు వేస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు. (స్వీట్ షాక్)
"నాకు తెలుసు, మీరు నన్ను తప్పకుండా సంతోషపెడ్తారని.." అంటూ ఏకంగా డ్యాన్స్ చేస్తున్నాడు. అయితే అతను నోట్లు లాగే క్రమంలో కేక్ ఏమాత్రం దిబ్బతినకపోవడం గమనార్హం. ఈ వీడియోను అతని కూతురు టోనీ సోషల్ మీడియాలో షేర్ చేశారు. "ఈ రోజు నాన్నగారి పుట్టిన రోజు. ప్రతి బర్త్‌డేకు ఆయన ఒక్కటే కోరుకుంటారు. అదే డబ్బు. అందుకే ప్రతి ఏడాది ఆయన్ను అదే డబ్బులతో ఎన్నోరకాలుగా సర్‌ప్రైజ్ చేసేందుకు నా సోదరి, తల్లి ప్రయత్నిస్తూనే ఉంటారు" అని రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. "కేకులో అంత డబ్బు ఎలా పెట్టారో'నని కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు అతని ఆనందాన్ని చూసి భావోద్వేగానికి లోనవుతూ.. 'నేను కూడా మా నాన్నకు ఏది కావాలో తెలుసుకుని తప్పకుండా ఇస్తాను" అంటున్నారు. (వైరల్: బట్టలు చిరిగేలా కొట్టుకున్నారు)
My dads birthday is today. Each birthday he wants the same thing. Cash. Each birthday my sister and mom find a different way to surprise him with it. pic.twitter.com/qRmzbqnXDP
— Toe Knee (@toekneerlynos) July 27, 2020
Comments
Please login to add a commentAdd a comment