
లండన్: టీమిండియా బౌలర్ మహ్మద్ షమీ శుక్రవారంతో(సెప్టెంబర్ 3) 31వ పడిలోకి అడుగుపెట్టాడు. ఈ సందర్భంగా షమీ తన జన్మదిన వేడుకలను అభిమానుల మధ్య ఘనంగా జరుపుకున్నాడు. అయితే షమీకి నాలుగో టెస్టు టీమిండియా జట్టులో చోటు దక్కలేదు. అతని స్థానంలో శార్దూల్ ఠాకూర్ తుది జట్టులోకి వచ్చాడు. షమీ పుట్టినరోజు కావడంతో మ్యాచ్ చూడడానికి వచ్చిన ఒక భారత అభిమాని హ్యాపీ బర్త్‌డే షమీ అని రాసి ఉన్న టీషర్ట్ ధరించాడు.
చదవండి: ఔటయ్యానన్న కోపంతో బ్యాట్‌ను నేలకేసి కొట్టాడు
ఎలాగైనా షమీతో కేక్ కట్ చేయించాలని సదరు అభిమాని భావించాడు. అభిమాని కోరికను తెలుసుకున్న షమీ స్వయంగా వచ్చి కేక్ కట్ చేసి వారిని సంతోషపరిచాడు. షమీ కేక్ కటింగ్ చేస్తుండగా.. కొందరు అభిమానులు షమీ.. షమీ అంటూ స్టేడియాన్ని హోరెత్తించారు. కాగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో షమీ మొదటి మూడు టెస్టు మ్యాచ్‌ల్లో 11 వికెట్లు తీశాడు. ఓవరాల్‌గా షమీ టీమిండియా తరపున 54 టెస్టుల్లో 195 వికెట్లు, 79 వన్డేల్లో 145 వికెట్లు, 12 టీ20ల్లో 12 వికెట్లు తీశాడు.
చదవండి: ENG Vs IND: రోహిత్ శర్మ స్టన్నింగ్ క్యాచ్.. వీడియో వైరల్
@MdShami11 Paaji cutting cake in the stadium , happy birthday sir shami pic.twitter.com/dz13ksppKK
— Sukhmeet Singh Bhatia (@sukhmeet12) September 3, 2021
Comments
Please login to add a commentAdd a comment