
దీంతో కాఫీ కోసం అయిదు నిమిషాలు ఆగాలా అని అసహనానికి లోనైన మహిళ ఒక్కసారిగా..
ఇటీవల కాలంలో బయట ఫుడ్ తినడం ఎక్కువైపోయింది. రెస్టారెంట్స్, హోటల్స్ తిరుగుతూ నచ్చిన ఫుడ్‌ను తెగ లాగించేస్తున్నారు. ఒక్కోసారి అక్కడి ఫుడ్ లేదా సర్వీస్ నచ్చనప్పుడు అసహనం వ్యక్తం చేస్తూ వింతగా ప్రవర్తించడం సహజమే. తాజాగా ఓ రెస్టారెంట్ సిబ్బందిపై అసంతృప్తి చెందిన మహిళ అక్కడ వస్తువులను చెల్లాచెదురు చేసింది.
ఈ ఘటన అమెరికాలో చోటుచేసుకుంది. అర్కాన్సాస్‌లో ఓ మహిళ మెక్‌డొనాల్డ్స్‌లోకి వెళ్లి కాఫీ ఆర్డర్ చేసింది. అయితే కాఫీ తయారికీ నిమిషాలు సమయం పడుతుందని వెయిట్ చేయాలని సిబ్బంది కోరింది. దీంతో కాఫీ కోసం అయిదు నిమిషాలు ఆగాలా అని అసహనానికి లోనైన మహిళ షాప్‌లో బీభత్సం సృష్టించింది.
చదవండి: హ్యాట్సాఫ్ ఆర్య: ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తున్న తండ్రికూతుళ్లు
అక్కడున్న ఆహార ట్రేలను కొట్టింది. టేబుల్ నంబర్లను కింద పడేసింది. ఇదంతా సీసీ కెమెరాల్లో రికార్డయ్యింది. మహిళ ప్రవర్తనపై మెక్‌డొనాల్డ్ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే మహిళ తనకు డయాబెటిస్ ఉందని, లో బ్లడ్ షుగర్ వల్ల ఇలా ప్రవర్తించానని తెలిపింది. ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్‌గా మారింది. ఇప్పటికి దీనిని 10 లక్షల మంది వీక్షించారు.
చదవండి: ‘ఛీ.. వ్యూస్ కోసం ఇంతకు తెగిస్తావా?
Karen Trashes McDonald’s because Her Coffee Took too Long pic.twitter.com/qi0V0MG2mk
— Karen (@crazykarens) October 4, 2021