ఇజ్రాయెల్‌ బాంబు దాడి.. త్రుటిలో తప్పించుకున్న WHO చీఫ్‌ గుటేరస్‌ | WHO Chief Tedros Adhanom Ghebreyesus Narrowly Escapes Bomb Threat At Yemen Airport, More Details Inside | Sakshi
Sakshi News home page

ఇజ్రాయెల్‌ బాంబు దాడి.. త్రుటిలో తప్పించుకున్న WHO చీఫ్‌ గుటేరస్‌

Published Fri, Dec 27 2024 8:29 AM | Last Updated on Fri, Dec 27 2024 10:17 AM

WHO chief Tedros Adhanom Ghebreyesus narrowly escapes bomb Threat At Yemen

యెమెన్‌: పలు దేశాల మధ్య జరుగుతున్న యుద్ధ ప్రభావం ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అధానోమ్‌ గ్యాబ్రియాసిస్‌(Tedros Adhanom Ghebreyesus)పై చూపించింది. బాంబు దాడి నుంచి ఆయన తృటిలో ప్రాణాలతో బయటపడ్డారు. ఈ షాకింగ్‌ ఘటన యెమెన్‌ దేశంలో చోటుచేసుకుంది. ఇజ్రాయెల్‌ వైమానిక దాడి నుంచి ఆయన అదృష్టవశాత్తు తప్పించుకున్నారు. ఈ ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.

వివరాల ప్రకారం.. ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అధానోమ్‌ గురువారం యెమెన్‌ దేశంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఐక్యరాజ్యసమితికి చెందిన ఉద్యోగులతో కలిసి ఖైదీల విడుదల, యెమెన్‌లో పరిస్థితులపై చర్చించేందుకు అక్కడికి వెళ్లారు. చర్చల అనంతరం ఆయన యెమెన్‌ నుంచి బయలుదేరుతున్న క్రమంలో వైమానిక బాంబు దాడి జరిగింది. సనాలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆరోగ్య సంస్థకు చెందిన అధికారులు వేచి ఉన్న సమయంలో బాంబు దాడి జరిగింది. ఈ ప్రమాదంలో టెడ్రోస్‌ తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకోగా.. ఇద్దరు మృతిచెందారు. ఇక, ఈ దాడిని ఐక్యరాజ్యసమితి సైతం తీవ్రంగా ఖండించింది.

అనంతరం, ఈ దాడి ఘటనపై టెడ్రోస్ ట్విట్టర్‌ వేదికగా స్పందించారు. టెడ్రోస్‌ ట్విట్టర్‌లో..‘ఐక్యరాజ్యసమితికి చెందిన ఉద్యోగులతో కలిసి ఖైదీల విడుదలపై చర్చలు, యెమెన్‌లో ఆరోగ్యం, మానవతా పరిస్థితులను అంచనా వేసేందుకు అక్కడికి వెళ్లాం. ఖైదీలను తక్షణమే విడుదల చేయాలని మేము పిలుపునిచ్చాం. సనాలో విమానం ఎక్కేందుకు వేచిఉండగా బాంబు దాడి జరిగింది. ఈ దాడిలో ఇద్దరు మృతి చెందినట్లు సమాచారం. విమానంలోని ఓ సిబ్బంది గాయాలపాలయ్యారు. ఘటన జరిగిన ప్రాంతానికి, మాకు కొన్ని మీటర్ల దూరం మాత్రమే ఉంది. ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు సంతాపం తెలియచేస్తున్నాం’ అని కామెంట్స్‌ చేశారు.

ఈ దాడిని ఐరాస సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెరస్‌ (Antonio Guterres) ఖండించారు. ట్విట్టర్‌ వేదికగా స్పందిస్తూ..‘ఇటీవల యెమెన్‌, ఇజ్రాయెల్‌ల మధ్య దాడులు తీవ్రతరం అయ్యాయి. సనా అంతర్జాతీయ విమనాశ్రయంతో సహా ఎర్రసముద్రం, ఓడరేవులు, యెమెన్‌లో పవర్ స్టేషన్‌లపై వైమానిక దాడులు ఆందోళనకరంగా ఉన్నాయి’ అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా అంతర్జాతీయ చట్టాలను గౌరవించాలన్నారు. పౌరులు, కార్మికులే లక్ష్యంగా దాడులు చేయకూడదన్నారు. 

మరోవైపు. యెమెన్‌లోని సనా విమానాశ్రయం, ఇతర నౌకాశ్రయాలపై, పలు విద్యుత్కేంద్రాలపై గురువారం ఇజ్రాయెల్‌ (Israel) వైమానిక దాడులు చేసింది. ఈ దాడుల్లో పలువురు మృతి చెందారు. 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement