
మల్లాపూర్ : ఎమ్మెల్యేగా ఉన్నా, లేకున్నా నా ప్రాణం ఉన్నంత వరకూ మీ వెంటే ఉంటానని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు అన్నారు. స్థానిక కేఎంఆర్ గార్డెన్‌లో ఆదివారం నిర్వహించిన బీఆర్‌ఎస్ ఆత్మీ య సమ్మేళనంలో జెడ్పీ చైర్మన్ దావ వసంతతో కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆ యన మాట్లాడుతూ, బీఆర్‌ఎస్‌ను ఓడించే శక్తి కాంగ్రెస్, బీజేపీకి లేదన్నారు. ఆ పార్టీల కుట్ర లను ఎండగడుతూ కార్యకర్తలు గ్రామాల్లో విస్తృత ప్రచారం చేయాలని కోరారు. నియోజకవర్గంలో ఇప్పటికే 90శాతం అభివృద్ధి పనులను పూర్తిచేశానని, మిగతా పనులకు నిధుల కొరత అడ్డంకిగా మారి ఆలస్యమవుతోందని స్పష్టం చేశారు.
వచ్చే ఎన్నికల్లో కోరుట్ల నియోజకవర్గం నుంచి తన కుమారుడు డాక్టర్ సంజయ్‌కుమార్‌ను ఎమ్మెల్యే అభ్యర్థిగా మీ చేతుల్లో పెడుతున్నానని, తనపై ఉన్న ప్రేమాభిమానాలనే సంజయ్‌పై ఉంచి ఆశీర్వదించాలని కోరారు. ఎమ్మెల్యే, ఖాదీబోర్డు చైర్మన్, టీటీడీ బోర్డు సభ్యుడు.. ఇలాంటి ఏ పదవి చేపట్టినా ప్రజలు, కార్యకర్తల సేవకే వినియోగిస్తానని అన్నారు. నాయకులు సంజయ్‌కుమార్, కాటిపెల్లి సరోజన, సందిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, గౌరు నాగేశ్, కొమ్ముల జీవన్‌రెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment