
ఈ మూడు కుటుంబాలు మనస్పర్థలతో 15ఏళ్లుగా మాట్లాడుకోవడంలేదు.
ఇబ్రహీంపట్నం(కోరుట్ల):బలగం సినిమా చూసి స్పందించిన ఓ కుటుంబం కలహాలు వీడి ఒక్కటైంది. వివరాలు జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్టనంలోని సుభాష్ చంద్రబోస్ చౌరస్తా వద్ద సోమవారం రాత్రి బలగం సినిమా ప్రదర్శించారు. గ్రామస్తులు భారీసంఖ్యలో తరలివచ్చి సినిమా తిలకించారు. సినిమాలోని కొన్ని సన్నివేషాలు చూస్తూ గ్రామస్తులు కన్నీటిపర్యంతమయ్యారు.
అయితే, గ్రామానికి చెందిన అన్నదమ్ములు బొప్పరతి సంజీవ్, రాజేందర్, జనార్దన్ కుటుంబాలు కూడా సినిమా తిలకించాయి. ఈ మూడు కుటుంబాలు మనస్పర్థలతో 15ఏళ్లుగా మాట్లాడుకోవడంలేదు. వీరి తల్లి బొప్పరాతి తారబాయి మంగళవారం ఉదయం వృద్ధాప్య కారణాలతో మృతి చెందింది. బలగం సినిమాలో మాదిరిగానే ముగ్గురు అన్నదమ్ములు, వారి కుటుంబాలు కలిసిపోయాయి. తల్లి అంతిమయాత్ర నిర్వహించాయి.