అక్కపల్లి రాజన్న హుండీ ఆదాయం రూ.4.40లక్షలు
ధర్మపురి: ధర్మపురిలోని శ్రీఅక్కపల్లి రాజరాజేశ్వర స్వా మి ఆలయంలో హుండీ లెక్కింపు ను శనివారం చేపట్టారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా స్వా మివారికి మొత్తం రూ.4,40,893 ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో శ్రీనివాస్ తెలిపారు. హుండీ ద్వారా రూ.1,98,319, కల్యాణం టికెట్ల ద్వారా రూ.1,82,000, ఇతర టికెట్ల ద్వారా రూ. 60,574, విదేశీనోట్లు 11 సమకూరినట్లు తెలిపారు. లెక్కింపులో దేవాదాయశాఖ ఇన్స్‌పెక్టర్ రాజమౌళి, ఆలయ చైర్మన్ సీపతి సత్యనారాయణ, సూపరింటెండెంట్ కిరణ్‌కుమార్, అర్చకులు తదితరులున్నారు.
Comments
Please login to add a commentAdd a comment