కొలనులో చేపలమవుదాం
● ఈతతో ఆరోగ్యానికి ఊతం
● పలు వ్యాధులకు ఔషధం
● చిన్నారుల్లో పెరుగుతున్న ఆసక్తి
● సమ్మర్‌కు ముందే కొలనుల్లో సందడి
● ఎండలు ముదిరితే.. మరింత రద్దీ
కరీంనగర్‌స్పోర్ట్స్/కరీంనగర్ టౌన్: ఈత.. ఆరోగ్యానికి ఊతం. శరీరానికి చక్కటి వ్యాయామం. ఈత నేర్చుకుంటే ఎన్నో ఉపయోగాలు. దీంతో చాలామంది తల్లిదండ్రులు సమ్మర్ వచ్చిందే చాలు తమ పిల్లలను సమీపంలోని కొలనులు, చెరువులు, బావు ల వద్దకు తీసుకెళ్లి ఈత నేర్పిస్తున్నారు. ఆదరణ పెరుగుతుండడంతో కొన్ని కార్పొరేట్ పాఠశాలల్లో ఈత కొలనులు అందుబాటులో ఉంచి శిక్షణ ఇస్తున్నాయి. పలు ప్రభుత్వ మైదానాల్లోని స్విమ్మింగ్‌పూల్స్‌లోనూ ఈత నేర్పిస్తున్నారు. సమ్మర్ సమీపిస్తోంది. ఎండలు ముదురుతుండడంతో ఉపశమనం కోసం ఈతకు వెళ్తున్నారు. పలు స్విమ్మిగ్‌పూల్స్‌లో ఇప్పుడే సందడి కనిపిస్తుండగా.. మరో పక్షం రోజుల తరువాత అన్ని ప్రాంతాల్లోని కొలనులు ఈత నేర్చుకునేందుకు వచ్చేవారితో నిండిపోనున్నాయి. ఈ సందర్భంగా ఈత.. రకాలు.. ఉపయోగాలు.. జాగ్రత్తతో ప్రత్యేక కథనం.
ఉమ్మడి జిల్లాలో స్విమ్మింగ్ పూల్స్
జిల్లా ప్రభుత్వ ప్రైవేటు
కరీంనగర్ 02 05
జగిత్యాల 01 01
పెద్దపల్లి 02 06
సిరిసిల్ల 01 05
Comments
Please login to add a commentAdd a comment