ఆ సార్ మాకొద్దు
● విద్యార్థుల ఆందోళన
● పాఠశాలకు తాళం
సుల్తానాబాద్(పెద్దపల్లి): ‘ఆ సార్ మాకొద్దు.. ఆయన తీరుతో చదువు దెబ్బతింటున్నది.. విద్యాబుద్ధులు చెప్పాల్సిన ఉపాధ్యాయులు వారి స్వప్రయోజనాల కోసం మమ్మల్ని ఇబ్బందులను గురిచేసే పరిస్థితి నెలకొంది.. అలాంటి సార్ మాకు వద్దు’ అని విద్యార్థులు ఆందోళనకు దిగారు. ,గ్రామస్తులు, తల్లిదండ్రులతో కలిసి రోడ్డుపై బైఠాయించారు. పెద్దపల్లి మండలం నిట్టూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఇందుకు వేదికై ంది. విద్యార్థులు, తల్లిదండ్రుల కథనం ప్రకారం.. ఉపాధ్యాయుడు ఒకరు విద్యార్థులను క్లాస్ రూమ్‌లో శ్రీజై భీమ్‌శ్రీ అని పలకాలని ఆదేశిస్తున్నారు. ఆ ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని విద్యార్థులు నిరసనకు దిగారు. సదరు ఉపాధ్యాయుడిపై చర్య తీసుకునే వరకూ పాఠశాలకు రాబోమని తెల్చి చెప్పారు. సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కొద్దిరోజులుగా ఉపాధ్యాయులు రెండు గ్రూపులుగా విడిపోయి పరస్పరం పీఎస్‌లో ఫిర్యాదు చేసుకుంటున్నారని ఆరోపించారు. వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని కోరారు. ప్రధానంగా పదో తరగతి విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని కోరారు. సమస్యకు కారణమైన శంకరయ్య సర్‌ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై ఉపాధ్యాయుడు శంకరయ్యను వివరణ కోరగా టీచర్ల మధ్య గొడవలను విద్యార్థులు, వారి తల్లిదండ్రులపై రుద్దుతున్నారన్నారు. హెచ్‌ఎం సహకారంతోనే విద్యార్థులు ధర్నాకు దిగారని ఆరోపించారు. తనకు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. కాగా, ఆందోళన తీవ్రతరం కావడంతో సమాచారం అందుకున్న పోలీసులు.. వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు. వివరాలు సేకరించి జిల్లా విద్యాధికారికి సమాచారం చేరవేశారు. దీంతో డీఈవో మాధవి, ఎస్సై లక్ష్మణరావు పాఠశాలకు చేరుకున్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులతో సమావేశమయ్యారు. సమస్యపై చర్చించి ఆందోళన విరమింపజేశారు.
ఆ సార్ మాకొద్దు
Comments
Please login to add a commentAdd a comment