ఆలయాల్లో చోరీ చేసిన దొంగ అరెస్ట్
జగిత్యాలక్రైం: జగిత్యాలలోని శివాజీనగర్‌లోగల నల్లపోచమ్మ తల్లి ఆలయం, ఉప్పరిపేట ఆలయాల్లో దొంగతనానికి పాల్పడిన దొంగను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు జగిత్యాల డీఎస్పీ రఘుచందర్ తెలిపారు. బుధవారం పట్టణ సర్కిల్ కార్యాలయంలో విలేకరులకు వివరాలు వెల్లడించారు. ఇటీవల ఉప్పరిపేటతోపాటు నల్లపోచమ్మతల్లి ఆలయంలో దొంగతనాలు జరిగాయి. ఆలయ కమిటీ, స్థానికుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. ఈ క్రమంలో జిల్లాకేంద్రంలోని వాణీనగర్ చౌరస్తాలో పట్టణ సీఐ వేణుగోపాల్ బుధవారం వాహనాలను తనిఖీ చేస్తున్నారు. అదే సమయంలో కోరుట్ల పట్టణం అల్లమయ్య గుట్ట ప్రాంతానికి చెందిన విభూది అలియాస్ వూటూరి శేఖర్ బైక్‌పై అనుమానాస్పదంగా కనిపించాడు. అతడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టగా దొంగతనం చేసినట్లు ఒప్పుకున్నాడు. అతడి నుంచి రూ.50 వేల విలువైన పూజాసామగ్రి, సొత్తును స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై ఎనిమిదేళ్లలో 25 దొంగతనం కేసులు నమోదై ఉన్నాయన్నారు. అలాగే ఆలయాల దొంగతనాల్లో ప్రమేయం ఉన్న లక్ష్మీ అనే మహిళ దొంగ పరారీలో ఉందని డీఎస్పీ వివరించారు. నిందితుడిని పట్టుకున్న సీఐ వేణుగోపాల్, ఎస్సై కిరణ్, కానిస్టేబుళ్లు జీవన్, అనిల్‌ను అభినందించారు.
బాల నిందితుడి అరెస్ట్
జగిత్యాలలోని నర్సింగ్ కళాశాలలో సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో రెండు రోజుల క్రితం దొంగతనానికి పాల్పడిన బాలుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ తెలిపారు. అతడిని జువైనల్ హోంకు తరలించినట్లు పేర్కొన్నారు.
మరో మహిళ దొంగ పరార్
రూ.50 వేల విలువైన సామగ్రి స్వాధీనం
జగిత్యాల డీఎస్పీ రఘుచందర్ వెల్లడి
ఆలయాల్లో చోరీ చేసిన దొంగ అరెస్ట్
Comments
Please login to add a commentAdd a comment