దొంగ అరెస్ట్
ముస్తాబాద్(సిరిసిల్ల): ఆలయాల్లో చోరీలకు పాల్పడుతూ పోలీసులకు సవాల్‌గా మారిన దొంగను ఎట్టకేలకు పట్టుకున్నారు. ముస్తాబాద్ ఎస్సై గణేశ్ బుధవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ముస్తాబాద్ మండలం తెర్లుమద్దికి చెందిన మామిండ్ల ఆంజనేయులు అలియాస్ అంజిని ముస్తాబాద్ ఏఎంఆర్ గార్డెన్ వద్ద అనుమానాస్పద స్థితిలో సంచరిస్తుండగా పట్టుకున్నారు. విచారించగా ముస్తాబాద్, గూడూరు, మద్దికుంటల్లోని ఆలయాల్లో చోరీలకు పాల్పడ్డాడు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
రైలు ఢీకొని ఆరు ఎడ్లు మృతి
కోరుట్ల రూరల్: మండలంలోని చిన్నమెట్‌పల్లి శివారులోని రైల్వే వంతెన వద్ద బుధవారం రైలు ఢీకొని ఆరు ఎడ్లు మృతిచెందాయి. స్థానికుల కథనం ప్రకారం ఎడ్లు రైల్వే ట్రాక్‌పై నుంచి వెళ్తుండగా గూడ్స్ రైలు వచ్చి ఢీకొన్నట్లు వివరించారు. రైల్వే అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు.
యువతి ఆత్మహత్య
కోరుట్ల: కోరుట్ల పట్టణంలోని వేములవాడ రోడ్‌లో నివాసముండే పల్లికొండ రోహిత (22) ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. పల్లికొండ రాజ, లతల కూతురు రోహితకు మానసిక స్థితి సరిగాలేదు. ఆరోగ్యం కూడా సరిగాలేకపోవటంతో మనస్థాపానికి గురై బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
గాయపడిన వ్యక్తి మృతి
జగిత్యాలక్రైం: జగిత్యాల అర్బన్ మండలం ధరూర్ గ్రామ బస్టాండ్ వద్ద మంగళవారం రాత్రి ట్రాలీ ఆటోను ఆర్టీసీ బస్సు ఢీకొని ఒకరు అక్కడికక్కడే మృతిచెందారు. ఇదే ఘటనలో తీవ్రంగా గాయపడిన టీఆర్‌నగర్‌కు చెందిన మల్యాల శ్రీనివాస్ అలియాస్ శ్రీహరి (32) చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మృతిచెందాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment