మల్యాల: మహిళల ఆర్థిక స్వావలంబనతోనే సమాజాభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. మండలంలోని మానాల గ్రామానికి ఆర్టీసీ బస్సును పునరుద్ధరించి గురువారం స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించారు. మానాల నుంచి తక్కళ్లపల్లి వరకు బస్సులో ప్రయాణం చేశారు. ఆర్టీసీ బస్సు పునరుద్ధరించడంతో రెండు గ్రామాల ప్రజలు ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. ఏళ్ల తరబడిగా ఉన్న సమస్య తీరినందుకు ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఆనందరెడ్డి, ఆదిరెడ్డి, శ్రీనివాస్, మల్లయ్య, తిరుపతి, రాజన్న, లక్ష్మీనారాయణ, శంకర్ గౌడ్, గంగారెడ్డి, దిండు ప్రవీణ్, మరాటి బుచ్చిరెడ్డి, మ్యాక లక్ష్మణ్, ఎంపీడీవో స్వాతి, తహసీల్దార్ మునీందర్, అధికారులు పాల్గొన్నారు.