● నేటి నుంచి టెన్త్ పరీక్షలు ● మెలకువలు పాటిస్తే మెరుగైన ఫలితాలు ● నిత్య సాధనతో గణితం సులువే ● సైన్స్‌లో పట్టికలు.. ప్రయోగాలు కీలకం ● సోషల్‌లో అవగాహన.. విశ్లేషణ ముఖ్యం ● లాంగ్వేజ్‌లో అక్షరదోషాలు నివారించాలి ● సబ్జెక్టుల వారీగా ఉపాధ్యాయుల సూచనలు
గొల్లపల్లి: నేటి నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభంకానున్నాయి. అయితే విద్యార్థుల్లో ఏదో తెలియని ఆందోళన, భయం వెంటాడుతోంది. దీనికి ఆయా సబ్జెక్టుల ఉపాధ్యాయులు కొన్ని చిట్కాలు వివరిస్తున్నారు. కొన్ని మెలకువలు పాటిస్తే సత్ఫలితాలు సాధించవచ్చంటున్నారు. గతేడాది నుంచి రెండు పరీక్షల స్థానంలో ఒకేరోజు పరీక్ష రాయాల్సి ఉంటుంది. గణితం, సోషల్ సబ్జెక్టులకు 80 మార్కుల పశ్నపత్రంలో 20 మార్కులు పార్ట్–బీకి కేటాయించారు. సైన్స్‌కు సంబంధించి ఫిజిక్స్, బయోలాజీ రెండు పేపర్లు వేర్వేరుగా నిర్వహిస్తారు.