● ఎస్పీ అశోక్‌కుమార్
జగిత్యాలక్రైం: జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణలో ప్రజలు భాగస్వాములు కావాలని ఎస్పీ అశోక్‌కుమార్ అన్నారు. జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు సురక్షిత ప్రయాణం ప్రత్యేక కార్యక్రమాన్ని శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లాలో రోడ్డు ప్రమాదాలు తగ్గించే ఉద్దేశంతో నేషనల్ హైవే అథారిటీ అధికారులు, పోలీసు అధికారులతో కలిసి రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రదేశాలను (బ్లాక్ స్పాట్లను) పరిశీలించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తే రోడ్డు ప్రమాదాలను నివారించడం సాధ్యమవుతుందన్నారు. ప్రమాదాలను పూర్తిగా నివారించాలంటే ప్రజల సహకారం అవసరమని, బాధ్యతాయుతంగా వాహనాలు నడపాలని సూచించారు. జి ల్లా వ్యాప్తంగా ఎక్కువ రోడ్డు ప్రమాదాలు జరిగే 43 బ్లాక్‌స్పాట్స్‌ను గుర్తించడం జరిగిందని, వివి ధ శాఖల సమన్వయంతో ప్రమాదాలు జరగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. పోలీ సు కళాబృందాల ద్వారా జాతీయ రహదారులపై ఉన్న గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్‌పై అవగాహన కల్పించడంతో పాటు వాటి పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ రఘుచందర్, ఐటీ కోర్ ఇన్‌స్పెక్టర్ రఫీక్‌ఖాన్, సీఐలు కృష్ణారెడ్డి, వేణుగోపాల్, రవి, ఎస్సైలు సదాకర్, నరేశ్, మల్లేశం, నేషనల్ హైవే ఏఈ లక్ష్మణ్, మోటారు వెహికిల్ ఇన్‌స్పెక్టర్ ప్రమీల పాల్గొన్నారు.