మెట్‌పల్లిరూరల్: పెద్దవాగును ఇసుక రీచ్‌గా ఏర్పాటు చేయడాన్ని వ్యతిరేకిస్తూ మెట్‌పల్లి మండలం ఆ త్మకూర్‌లో గ్రామస్తులు ఆందోళనకు దిగారు. గ్రా మ పంచాయతీ ఎదుట బైటాయించారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకుని రీచ్‌ను రద్దు చే యాలని డిమాండ్ చేశారు. ఇసుక తవ్వకాలతో భూ గర్భజలాలు తగ్గిపోయే ప్రమాదముందన్నారు. తా గు, సాగునీటికి ఇబ్బంది పడుతున్నామని, ఈ పరిస్థితుల్లో రీచ్ ఏర్పాటు సరికాదని మండిపడ్డారు. అనంతరం మెట్‌పల్లి ఆర్డీవో శ్రీనివాస్, తహసీల్దార్ శ్రీనివాస్‌కు వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో వీడీసీ సభ్యులు, మహిళలు పాల్గొన్నారు.