సారంగాపూర్: ప్రజలకు అన్నిరకాల వైద్యసేవలను అందుబాటులోకి తీసుకొచ్చినపుపడే వైద్య సిబ్బంది, ఆస్పత్రికి గుర్తింపు వస్తుందని డిప్యూటీ డీఎంహెచ్‌వో శ్రీనివాస్ అన్నారు. ఆదివారం బీర్‌పూర్ మండలకేంద్రంలోని ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్‌లో ఆయన వైద్య సిబ్బందితో సమావేశమయ్యారు. బీర్‌పూర్ ఆస్పత్రిని త్వరలో కేంద్రప్రభుత్వ పరిధిలోని జాతీయ నాణ్యత ప్రమాణాల బృందం ఆన్‌లైన్ వెరిఫికేషన్ చేపట్టనుందన్నారు. గర్భిణులు, ఇమ్యూనైజేషన్, అందుబాటులో ఉన్న మందులు, ఓపీ, ల్యాబ్ టెస్ట్, టీబీ పరీక్షలు, లెప్రసీ, జ్వర పరీక్షలు, ఈఎన్‌టీ, బీపీ, మధుమేహం తదితర అంశాలపై చర్చించారు. జాతీయ బృందం ఆస్పత్రిని బెస్ట్‌గా గుర్తించడానికి రోగులకు మరిన్ని సేవలు చేయడంతో పాటు, ఆస్పత్రి నిర్వహణ మెరుగ్గా ఉండాలని సూచించారు.
మందుల నిల్వ ఉండాలి
జగిత్యాల: ఆస్పత్రుల్లో రోగులకు మెరుగైన సేవలు అందించాలని, మందుల నిల్వ ఉండేలా చూసుకోవాలని శ్రీనివాస్ అన్నారు. టీఆర్‌నగర్‌లోని బస్తీ దవాఖానాను తనిఖీ చేశారు. ఆయన వెంట డాక్టర్లు ఉన్నారు.
ఆదివారం ఆటవిడుపు
బుగ్గారం: ఎండలు ముదురుతుండడంతో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. దీంతో వేసవితాపం మొదలైంది. మండలంలోని యువకులు, చిన్నారులు వేసవితాపం నుంచి ఉపశమనం కోసం బుగ్గారం శివారులోని డీ–53 కాలువలో ఈతకొడుతూ ఇలా సేదతీరుతూ కనిపించారు. ఆదివారం కావడంతో పెద్దసంఖ్యలో చిన్నారులు తరలివచ్చారు.
అథ్లెటిక్స్ పోటీల్లో గురుకులం విద్యార్థుల ప్రతిభ
జగిత్యాల: రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో జిల్లాకేంద్రంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ మహిళా డిగ్రీ కళాశాల ద్వితీయ సంవత్సరం విద్యార్థిని మామిడాల స్వాతికాంజలి రజత పతకం సాధించింది. ఆదివారం హైదరాబాద్‌లోని గౌడీయం స్పోర్ట్స్‌పియాలో జరిగిన అథ్లెటిక్స్ పోటీల్లో బాలికల విభాగంలో 400 మీటర్ల పరుగుపందెంలో రజత పతకం సాధించింది. విద్యార్థినిని అథ్లెటిక్స్ అసోసియేషన్ కార్యదర్శి ముత్తయ్యరెడ్డి, అంజయ్య, రాందాస్, కొమురయ్య, ప్రిన్సిపల్ శ్రీలత, హరిరాంనాయక్ అభినందించారు.
జగిత్యాల వాసికి రాష్ట్ర మహిళా శక్తి పురస్కారం
జగిత్యాలటౌన్: జిల్లాకేంద్రానికి చెందిన ప్రము ఖ రచయిత్రి, ప్రభుత్వ ఉపాధ్యాయురాలు అడువాల సుజాత సాహిత్య రంగంలో చేస్తున్న కృషికి రాష్ట్రస్థాయి మహిళాశక్తి పురస్కారం అందుకున్నారు. ఆదివారం మహబూబ్‌నగర్‌లో జరిగిన కార్యక్రమంలో ఉస్మానియా యూనివర్సిటీ తెలు గు శాఖ పూర్వ అధ్యక్షుడు, తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి మనోజు బాలాచారి చేతుల మీదుగా పురస్కారం అందుకున్నారు. సుజాత సాహితీ ప్రస్తానంతోపాటు సామాజిక సేవలను వక్తలు కొనియాడారు. కార్యక్రమంలో రచయిత్రి చుక్కాయపల్లి శ్రీదేవి, రావూరి శ్రీమతిరావు, కవులు, రచియిత్రులు పాల్గొన్నారు. సుజాతను జగిత్యాల బల్దియా మా జీ చైర్‌పర్సన్ అడువాల జ్యోతి, కళాశ్రీ సాహితీ వేదిక నిర్వాహకులు గుండేటి రాజు, కవయిత్రులు మద్దెల సరోజన, కటుకం కవిత, చిందం సునీత, అయిత అనిత, లక్కరాజు శ్రీలక్ష్మి, ఓదెల గంగాధర్, శ్యాంసుందర్ అభినందించారు.
ప్రజలకు అవసరమైన ఆరోగ్య సేవలు అందించాలి
ప్రజలకు అవసరమైన ఆరోగ్య సేవలు అందించాలి
ప్రజలకు అవసరమైన ఆరోగ్య సేవలు అందించాలి