
ధర్మపురి నుంచి 5 వేల మంది
పెగడపల్లి: ఈ నెల 27న వరంగల్‌లో జరిగే బీఆర్‌ఎస్ రజతోత్సవ మహాసభకు ధర్మపురి నియోజకవర్గం నుంచి 5 వేల మందిని తరలిస్తున్నట్లు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. తాను గెలిచినా.. ఓడినా ప్రజల పక్షమే ఉంటున్నట్లు పేర్కొన్నారు. మండలకేంద్రంలో శనివారం బీఆర్‌ఎస్ శ్రేణులతో సమావేశమయ్యారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ప్రతి గ్రామం నుంచి కార్యకర్తలు స్వచ్ఛందంగా తరలివచ్చి పార్టీకి అండగా ఉన్నామని తెలియజేసేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో అభివృద్ధి, సంక్షేమం, అన్ని రంగాల్లో దేశాన్ని ఆదర్శంగా నలిపిన ఘనత కేసీఆర్‌కు దక్కిందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 420 హామీలు, మోసపూరిత మాటలు, అబద్దపు హామీలు ప్రజలకు ఇప్పటికే అర్ధమయ్యాయని, ఎన్నికలు ఎప్పుడు వస్తాయా అని ప్రజలు ఎదురుచూస్తున్నారని వివరించారు. రజతోత్సవ సభకు దండు కట్టి తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. పార్టీ మండల అధ్యక్షుడు మల్లారెడ్డి, బీఆర్‌ఎస్ శ్రేణులు నరేందర్‌రెడ్డి, లక్ష్మణ్, నర్సింహారెడ్డి, రాజేశ్వర్‌రావు, తిరుపతి, స్వామి, సత్యనారాయణరెడ్డి, లక్ష్మీనారాయణ, సుధాకర్, రామచంద్రం, వీరేశం, శంకర్, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
గెలిచినా.. ఓడినా ప్రజల పక్షమే
మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్