సేవాలాల్ ఆశయ సాధనకు కృషి
పాలకుర్తి టౌన్: సంత్ సేవాలాల్ మహరాజ్ ఆశయ సాధనకు కృషి చేయాలని ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డి అన్నారు. శనివారం సంత్‌సేవాలాల్ మహారాజ్ 286వ జయంతి సందర్భంగా నియోజకవర్గంలోని ఆరు మండలాలకు చెందిన గిరిజనులు ర్యాలీగా తరలివచ్చి సేవాలాల్ మహరాజ్‌కు పూజలు చేశారు. గిరిజన వేషధారణలో ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి, నియోజకవర్గ ఇన్‌చార్జ్ హనుమండ్ల ఝాన్సీరెడ్డి పూజలు నిర్వహించి ప్రత్యేకంగా తయారు చేసిన నైవేద్యాన్ని సమర్పించారు. రాజకీయాలకతీతంగా గిరిజనులు పాల్గొని భోగ్ బండార్‌ను తిలకించి పూజలు నిర్వహించారు. అనంతరం సేవాలాల్ జయంతి ఉత్సవ కమిటీ అధ్యక్షుడు హమ్యానాయక్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు. గిరిజనుల సంక్షేమం కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందన్నారు. నియోజవర్గంలోని ప్రతీ మండలంలో సేవాలాల్ భవనం ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్లు లావుడియ మంజుల, తిరుపతిరెడ్డి, హమ్యానాయక్, లావుడియ్య భాస్కర్, దరావత్ రోజా, సరేష్‌నాయక్, రాజేష్‌నాయక్, తదితరులు పాల్గొన్నారు.
పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి
Comments
Please login to add a commentAdd a comment